సెక్స్ గురించి తరచూ ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఇవే..

సెక్స్ గురించి తరచూ ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఇవే..

సెక్స్(sex).. దీని గురించి మాట్లాడడం మన దేశంలో సహజంగా జరగదు. సెక్స్ అంటే ఎప్పుడూ నాలుగు గోడల మధ్య జరిగేదనే అందరికీ తెలుసు. దాని గురించి మాటలు కూడా నాలుగు గోడలు దాటకూడదని అనుకుంటారు చాలామంది. అందుకే సెక్స్ విషయంలో మన దేశంలో కేవలం స్త్రీలకే కాదు.. పురుషులకు కూడా ఎన్నో రకాల సందేహాలు.. మరెన్నో ప్రశ్నలు(questions).. అందుకే ఇంటర్నెట్ లో ఎక్కువ మంది వెతికే సెక్స్ ప్రశ్నలేంటో తెలుసుకొని.. వాటికి సమాధానాలు అందించే ప్రయత్నం చేసింది POPxo. చాలామంది అమ్మాయిలు ఈ తరహా ప్రశ్నలను మా యాప్ లో కూడా అడిగారు. మరి, వారందరికీ ఉన్న ఆ ప్రశ్నలు.. వాటికి సమాధానాలు తెలుసుకుందాం రండి.. ఇవన్నీ మనం తెలుసుకోవడం వల్ల మన జీవితంలో ఎంతో కొంత క్లారిటీ వస్తుందని మా నమ్మకం.

1. ఓరల్ సెక్స్ ద్వారా ఎస్ టీ డీ (STD)లు వస్తాయా?

జవాబు : తప్పకుండా అవుననే చెప్పాలి. సెక్సువల్లీ ట్రాన్స్ మిటెడ్ డిసీజెస్ (STD) అనేది ఓరల్ సెక్స్ ద్వారా కూడా వ్యాపిస్తాయి. అందుకే ఒకవేళ మీ భాగస్వామికి అలాంటి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే వారి నుంచి దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ మీ భాగస్వామికి క్లెమిడియా ఇంటే మీరు ఓరల్ సెక్స్ లో పాల్గొంటే మీకు గొంతు భాగంలో క్లెమిడియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో దూరంగా ఉండడం లేదా కండోమ్ ఉపయోగించడం వంటివి చేయడం మంచిది.

2. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎలా పనిచేస్తాయి? అవి కూడా పనిచేయని సందర్భాలు ఉంటాయా? వాటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలుంటాయి.

జవాబు : చాలామంది సెక్స్ లో పాల్గొనే సమయంలో కండోమ్ లేదా ఇతర గర్భ నిరోధకాలు ఉపయోగించడం మర్చిపోతుంటారు. ఇలా మర్చిపోయేవారికి ఈ పిల్స్ ఉపయోగపడతాయి. వీటిని మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్ అని కూడా అంటారు. ఇవి అండం విడుదలను ఆలస్యం చేస్తాయి. అలా గర్భం రాకుండా కాపాడతాయి. అయితే మీరు ఈ పిల్స్ తీసుకునేలోపే అండం విడుదలై ఫలదీకరణం చెందితే మాత్రం వీటి ప్రభావం కనిపించదు. అందుకే సెక్స్ లో పాల్గొన్న తర్వాత వీలైనంత తొందరగా ఈ పిల్స్ తీసుకోవడం వల్ల ప్రభావం ఉంటుంది. ఆలస్యమైన కొద్దీ వీటి ఫలితం నెగటివ్ గా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇవి అబార్షన్ పిల్స్ కావు. అందుకే ఒకవేళ మీరు ఇప్పటికే గర్భం ధరిస్తే మాత్రం ఈ పిల్స్ మీకు పనిచేయవు.

అంతేకాదు.. ఇవి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ మాత్రమే. వీటికి బర్త్ కంట్రోల్ పిల్స్ కి తేడా ఉంటుంది. వీటిని రోజూ తీసుకోకూడదు. తరచూ వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మరీ తప్పదు అనుకున్నప్పుడు మాత్రం దీన్ని వాడాలి. దీన్ని ఉపయోగించిన తర్వాత కళ్లు తిరగడం, వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పి వంటి వాటితో పాటు కొద్దిగా రక్తస్రావం కూడా కనిపించవచ్చు.

3. ఓరల్ సెక్స్ ద్వారా గర్భం ధరించే వీలుంటుందా?

జవాబు : మన జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ రెండూ విభిన్నమైన వ్యవస్థలు. ఈ రెండింటికీ ఎక్కడా సంబంధం ఉండదు. ఒకవేళ మీరు ఓరల్ సెక్స్ లో భాగంగా వీర్యాన్ని మింగేస్తే కడుపులోకి చేరిన శుక్రకణాలు జీర్ణమైపోతాయి. గర్భం ధరించాలంటే తప్పనిసరిగా వజైనల్ సెక్స్ చేయాల్సిందే. సెక్స్ సమయంలో యోని ద్వారా శుక్రకణాలు లోపలికి వెళ్తే తప్ప గర్భం ధరించే వీలుండదు.

4. ప్రెగ్నెన్సీ కి సంబంధించిన టెస్ట్ ఎప్పుడు చేయాల్సి ఉంటుంది?

జవాబు : సాధారణంగా పిరియడ్ మిస్సయిన వారం రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం వల్ల ఫలితం సరిగ్గా తెలుస్తుంది. ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తెచ్చుకొని చెక్ చేసుకోవడం వల్ల హెచ్ సీజీ లెవల్స్ ఎక్కువగా ఉంటే పాజిటివ్ ప్రెగ్నెన్సీ రిజల్డ్ వస్తుంది. ఇంప్లాంటేషన్ తర్వాత ఆరు నుంచి పన్నెండు రోజుల తర్వాత ఈ హార్మోన్ విడుదల ప్రారంభమవుతుంది. ఇది అండం విడుదల తర్వాత తొమ్మిది రోజులకు జరుగుతుంది. అందుకే ముందే చెక్ చేయడం సరికాదు. అలా చేయడం వల్ల నెగెటివ్ అని కనిపించే వీలుంటుంది.

5. మగవాళ్లు సెక్స్ ని ఎక్కువగా ప్రేమిస్తారని.. పెళ్లయిన తర్వాత వారితో ఏదైనా సమస్య వస్తే సెక్స్ ద్వారా దాన్ని పరిష్కరించుకోవచ్చని నేను విన్నా. ఇది నిజమేనా? ఎందుకు?

జవాబు : చాలామందికి సెక్స్ అంటే ఇష్టం. అందులో మగవారు మాత్రమే కాదు.. ఆడవారు కూడా ఉంటారు. కానీ సెక్స్ అంటే ఇష్టం లేకపోవడం కూడా తప్పు కాదు. అయితే ఇద్దరి మధ్య సమస్యలను పరిష్కరించేందుకు సెక్స్ మార్గం అనేది తప్పు. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం దానికి మంచి మార్గం. సెక్స్ సమస్యలను తగ్గిస్తుందన్నది కేవలం ఒక అపోహ మాత్రమే.

6. పెళ్లికి ముందే నా బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ పాల్గొనడం సరైన పనేనా? అదే తప్పేమో అనిపిస్తోంది.

జవాబు : ఇది పూర్తిగా మీ మీద, మీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. మీరు అది తప్పు అనుకుంటే తప్పు. కాదు అనుకుంటే కాదు. మీరు తప్పేమో అని బాధపడడం గురించి చూస్తే ఒకవేళ మీరిద్దరూ ఇష్టపడి సెక్స్ లో పాల్గొంటే అది తప్పు కాదు. మీరు తనని ప్రేమిస్తున్నారు కాబట్టి ఒప్పుకుంటే ఆ సమయంలో ఇద్దరూ సెక్స్ కోరుకున్నారు కాబట్టి జరిగింది అనుకోండి. గతం గత: అందులో మీరు మార్చగలిగింది ఏమీ లేదు. ఒకవేళ అవతలి వ్యక్తి మిమ్మల్ని బలవంతం చేయడం వల్ల మీరు సెక్స్ లో పాల్గొంటే అది మిమ్మల్ని ఇంకా వెంటాడుతుంటే మీ సమస్యను ఎవరితోనైనా పంచుకోండి. దానికి సంబంధించి ఏం చేయాలో ఓ నిర్ణయానికి రండి.

7. గర్భం రాకుండా చేయడంలో కండోమ్ లు పూర్తి రక్షణ ఇవ్వగలవా?

జవాబు : అవును.. కండోమ్ లు కేవలం గర్భం రాకుండా మాత్రమే కాదు.. వివిధ రకాల సెక్సువల్లీ ట్రాన్స్ మిటెడ్ డిసీజెస్ నుంచి కూడా కాపాడతాయి. సులువుగా ఉపయోగించగలిగే అత్యంత ప్రభావవంతమైన గర్భ నిరోధక సాధనాలు ఇవి. అందుకే దీన్ని ఉపయోగించడం ఎంతో మంచిది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.