కప్పింగ్ థెరపీ వల్ల.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా?

కప్పింగ్ థెరపీ వల్ల.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా?

(Benefits of Cupping Therapy)

కప్పింగ్  థెరపీ.. ఇది మూడు వేల సంవత్సరాల క్రితం నాటి వైద్య చికిత్స పద్ధతి. చిన్న గాజు కప్పుల సాయంతో నిర్వహించే ఈ థెరపీని చైనీయులు ప్రారంభించారు. అక్కడి నుంచి ఈ పద్ధతి ఈజిప్ట్, గ్రీకు దేశాల వరకూ తరలి వెళ్లింది. ఆ తర్వాత మిగిలిన దేశాలకూ పాకింది. ప్రస్తుతం మన దేశంలోనూ ఎంతో ప్రాధాన్యాన్ని సంపాదించుకుంది. హైదరాబాద్‌లోనూ ఈ చికిత్స చాలా చోట్ల జరుగుతోంది.

శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుందట. అందుకే దీన్ని తరచూ చేయించుకునేవారు.. దీనివల్ల ఆరోగ్యపరంగా మాత్రమే కాదు.. సౌందర్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతూ ఉంటారు. ఎందుకంటే దీనివల్ల చర్మం పై భాగంలోని టాక్సిన్లన్నీ తొలగిపోతాయి. ఈ కప్పింగ్ థెరపీని.. సాధారణంగా కాళ్లు, వీపు, భుజాలు, ముఖం వంటి భాగాల్లో చేయించుకుంటారు. ఈ క్రమంలో మనం కూడా..  కప్పింగ్ థెరపీలోని వివిధ రకాలతో పాటు.. ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం

కప్పింగ్ థెరపీ అనేది మన శరీరంలోని రుగ్మతలను తగ్గించేందుకు ఉపయోగించే సహజసిద్ధమైన పద్ధతి. ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ లాగే.. ఇదీ మన శరీరంలోని నరాలు, గ్రంథులకు ఉత్తేజాన్ని కలిగించే  ప్రక్రియ. ఈ పద్ధతిలో ఉపయోగించే కప్పులను.. గ్లాస్, వెదురు, మట్టి, సిలికాన్ వంటి పదార్థాలతో తయారుచేస్తారు. ఇందులో ముఖ్యంగా రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి డ్రై కప్పింగ్.. రెండోది వెట్ కప్పింగ్. ఈ రెండూ కాకుండా ముఖంపై చేసే ప్రక్రియ కూడా.. కాస్త విభిన్నంగా ఉంటుంది.

డ్రై కప్పింగ్

డ్రై కప్పింగ్‌లో భాగంగా  శరీరంపై కప్పులను పేర్చి.. పంప్ సాయంతో గాలిని తొలగిస్తారు. దీనివల్ల రక్తప్రసరణను అవి వేగంగా, సులువుగా కొనసాగేలా చేస్తాయి. డ్రై కప్పింగ్ చేయడానికి కేవలం పది నుంచి పదిహేను నిమిషాల పాటు సమయం పడుతుంది. ఈ క్రమంలో ఒకేసారి చాలా కప్పులను కూడా ఉపయోగించవచ్చు. నొప్పి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇలా చేయడం వల్ల.. నొప్పి తగ్గుతుంది.

వెట్ కప్పింగ్

వెట్ కప్పింగ్‌లో భాగంగా.. కప్పింగ్ ప్రక్రియకు ముందు గుండు సూది లేదా బ్లేడ్ సాయంతో చిన్న చిన్న కోతలు పెడతారు. డ్రై కప్పింగ్ తర్వాత రక్త ప్రసరణ పెరుగుతుంది కాబట్టి.. మొదట అది చేసిన తర్వాత తిరిగి మరోసారి కప్పులను పెడతారు. దీనివల్ల కొద్ది మోతాదులో రక్తం బయటకు వస్తుంది. ఆ కప్పులు మూడు నిమిషాల పాటు ఉంచి తీసేస్తారు. కప్పుల వేడి వల్ల గాయాలు వారం రోజుల పాటు ఉంటాయి. ఇక బ్లేడ్‌తో కట్ చేసిన గాయాలు పది రోజుల పాటు ఉంటాయి.

ఫేస్ కప్పింగ్

ఫేస్ కప్పింగ్ లేదా ఫేషియల్ కప్పింగ్ అనేది ముఖం చర్మంపై నిర్వహించే కప్పింగ్ ప్రక్రియ. ఇది చర్మం నుంచి మురికి, జిడ్డు వంటివన్నీ తొలగిస్తుంది. ఇందులో భాగంగా ముఖ చర్మంతో పాటు.. బుగ్గలు, నుదురు, దవడలు వంటి ప్రదేశాల్లో సక్షన్ కప్స్‌ని పెడతారు. దీనివల్ల వ్యాక్యూమ్ ప్రభావవంతంగా తన పని తాను పూర్తి చేస్తుంది. మురికిని తొలగించడంతో పాటు రక్త ప్రసరణను పెంచుతుంది.

ఇలా ఫేస్ కప్పింగ్ చేయడం వల్ల.. చర్మ గ్రంథుల్లోని మురికి పూర్తిగా తొలగిపోతుంది. దీని తర్వాత మనం చర్మ సంరక్షణ కోసం ఉపయోగించే క్రీములన్నీ.. చర్మం కింద పొర వరకూ చేరి దాన్ని ఆరోగ్యంగా, అందంగా మారుస్తాయి. దీనివల్ల ముడతలు తగ్గడంతో పాటు.. రక్త ప్రసరణ పెరగడం వల్ల చర్మం మెరుస్తూ ఉండడంతో పాటు సున్నితంగా కూడా మారుతుంది.

కప్పింగ్ థెరపీ ప్రయోజనాలు

కప్పింగ్ థెరపీ వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు ఉంటాయి. వాటిలో కొన్ని..

కప్పింగ్ థెరపీ వల్ల నొప్పులు చాలా వేగంగా తగ్గుతాయి. ముఖ్యంగా నడుము నొప్పి, కీళ్ల నొప్పితో బాధపడేవారు కప్పింగ్ థెరపీని ఉపయోగించడం వల్ల వేగంగా తగ్గుతాయట.

కప్పింగ్ థెరపీ వల్ల మొటిమలు, ఇతర చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

గేమ్స్ ఆడిన తర్వాత గాయాల బారిన పడిన వాళ్లు.. దాన్ని తగ్గించుకోవడానికి కప్పింగ్ థెరపీని పాటిస్తుంటారు.

రక్త ప్రసరణను పెంచడంతో పాటు.. వివిధ రకాల కణజాలాలను రిలాక్స్ చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

ఫెర్టిలిటీ సంబంధ సమస్యలు, రక్తపోటు, డిప్రెషన్, ఎలర్జీలు, వెరికోస్ వీన్స్, ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఇది చాలా తోడ్పడుతుంది.

ఇంకా చదవండి - 

Cupping Therapy in Hindi

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.