23 నవంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

23 నవంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (23 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. వివాహితులు కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంటుంది. విద్యార్థులు ఇంకాస్త కష్టపడి చదవాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. 

వృషభ రాశి (Tarus) – ఈ రోజు ప్రేమికుల సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఆస్తి వివాదాలు వేగంగానే పరిష్కారమవుతాయి. ఆలుమగల సంబంధాలు మరింత బలపడతాయి. పలు సామాజిక కార్యక్రమాలలో మీరు కూడా పాల్గొనే అవకాశం ఉంది. 

మిథున రాశి (Gemini) –  ఈ రోజు   విద్యార్థులు మరింత కష్టపడి చదవాల్సిన సమయం ఆసన్నమైంది. ఉద్యోగస్తులు వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. వ్యాపారస్తులు జాగ్రత్తగా లేకపోతే.. ఆర్థికంగా నష్టాన్ని చవిచూస్తారు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు.

కర్కాటక రాశి (Cancer) –  ఈ రోజు రుణాలు ఇవ్వడం లేదా తీసుకొనే క్రమంలో జాగ్రత్తగా ఉండాలి. సివిల్ కాంట్రాక్టులు చేసే వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు వేగంగానే పరిష్కారవుతాయి.  అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. 

సింహ రాశి (Leo) – ఈ రోజు  ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపార ఒప్పందాలు రద్దు అయ్యే ప్రమాదం ఉంది. చట్టపరమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో క్రియాశీలత పెరుగుతుంది. ప్రియమైనవారితో కలిసి గడపడం ఆహ్లాదకరంగా ఉంటుంది.

క‌న్య రాశి (Virgo) –    ఈరోజు ప్రత్యర్థుల వల్ల మీకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడుల వల్ల మానసిక క్షోభ పెరుగుతుంది. అందుకే వివాదాలకు దూరంగా ఉండండి. అదేవిధంగా మీ తల్లిదండ్రులు నుండి శుభవార్తలు వింటారు. మీ ఆఫీసు వాతావరణం మీకు అనుకూలంగానే ఉంటుంది.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

తుల రాశి (Libra) – ఈ రోజు కుటుంబ వివాదాలు క్రమంగా పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆఫీసులో మీ పని శైలి అధికారులను సంతోషపరుస్తుంది. మీ భాగస్వామి కూడా మీ పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు. అలాగే మీకు ఆధ్యాత్మికపరమైన కార్యకలాపాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు నిరుద్యోగులకు శుభదినం. మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు మీ నిజాయతీయే మిమ్మల్ని కాపాడుతుంది. కోర్టు కేసులు, ఆస్తి లావాదేవీలు పరిష్కారదశకు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి.

ధను రాశి (Saggitarius) - ఈ రోజు  మీరు తొందరపాటుతో.. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. చంచలమైన ఆలోచనలకు స్వస్తి పలకడం మేలు. మీ కెరీర్‌లో మార్పులు సంభవించే అవకాశం ఉంది. మిత్రులతో సమస్యలు పరిష్కరించబడతాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –   ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కాస్త ఉపశమనంగా ఉంటుంది. అలాగే కొత్త వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు నూతన వాణిజ్య ఒప్పందాలను స్వీకరించే అవకాశం ఉంది. అలాగే సులభ ధనయోగం కూడా ఉంది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) - ఈ రోజు మీ కుటుంబ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఆఫీసులో కూడా ఉద్రిక్త వాతావరణం పెరిగే ఉంది. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. కొన్ని విపత్కర పరిస్థితులలో మీకు మీ మిత్రుల సహాయం లభిస్తుంది. 

మీన రాశి (Pisces) – ఈ రోజు మీకు మీ ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మేలు. వివాహితులకు తమ భాగస్వామి నుండి నైతిక మద్దతు ఉంటుంది. రాజకీయ రంగంలోని వ్యక్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.