02 నవంబరు 2019 ( శని వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

02  నవంబరు 2019 ( శని వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (02  నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు మీ పనికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇతరులపై ఆధారపడకండి. మీ ఆలోచనలను మీకు నచ్చినట్లు అమల్లో పెట్టండి. ఇతరులు పెట్టిన గొడవల వల్ల మీ కుటుంబంలో ప్రశాంతత కరువవుతుంది. స్నేహితులతో సమయం గడిపి దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించండి.

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు మీ ఆలోచనల వేగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పని సజావుగా సాగుతుంది. పనికి సంబంధించిన క్లారిటీ రావడం వల్ల దాన్ని పూర్తిచేసేందుకు మీరు శాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ కుటుంబ సభ్యులు చాలా బద్ధకంతో ఉండడం వల్ల వారితో పని చేయించేందుకు మీరు కష్టపడాల్సి వస్తుంది. స్నేహితులు మీ సలహాలు కోరుకుంటారు. 

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీ ఆరోగ్యం అంతగా బాగా లేకపోవడం వల్ల మీ చేతిలో ఉన్న పనిని మొత్తం పూర్తి చేయలేకపోతారు. కుటుంబ సభ్యులు మీ ఆరోగ్యం గురించి మిమ్మల్ని నిందిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం సమయానికి వైద్యుల దగ్గరికి వెళ్లడం మంచిది. 

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు ఒకవేళ మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటే ఈ రోజు మంచి అవకాశం మీకు లభిస్తుంది. పని గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం వల్ల వారి సలహాలు కూడా మీకు అందుతాయి. చాలామంది స్నేహితులు మిమ్మల్ని కలవాలనుకుంటారు. కానీ మీరు మాత్రం ఒంటరిగా గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు వీకెండ్ అయినా మీరు పనిచేయాల్సి వస్తుంది. ఇతరులు మీ నుంచి చాలా ఎక్కువ ఆశిస్తుంటారు. అయితే మీరు ఆ విషయంలో ఒత్తిడికి గురవ్వకండి. స్నేహితులు బయటకు పిలిచినా కుటుంబంతో గడిపేందుకు వారికి నో చెబుతారు. బంధువుల రాక మిమ్మల్ని సంతోషపెడుతుంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు పని ప్రదేశంలో మీ పై అధికారులు మీ ఆలోచనలను గుర్తించి మీకు వాటిని అమలు పర్చేందుకు తగిన స్వేచ్ఛ అందిస్తారు. కుటుంబంతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. సాయంత్రాలను శారీరకంగా యాక్టివ్ గా ఉండేందుకు ఉపయోగించండి. 

తుల రాశి (Libra) – ఈ రోజు కొత్త పని రాకపోతే పెండింగ్ లో ఉన్న పని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కొత్త కాంట్రాక్ట్ పనులు కాస్త ఆలస్యమవుతాయి.   అయితే నిరుత్సాహపడకండి. స్నేహితులతో బయటకు వెళ్లి ఆనందంగా సమయం గడుపుతారు. దీనివల్ల కుటుంబానికి తగినంత సమయాన్ని అందించలేరు. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు చాలా బ్యాలన్స్డ్ గా సాగుతుంది పని, కుటుంబం, స్నేహితులు అన్నింటికీ సమయాన్ని సమానంగా పంచుకుంటారు. కుటుంబంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మీపై పడుతుంది. కుటుంబ సభ్యులు మీ ఓదార్పు కోరుకుంటారు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు మీరు మానసికంగా డల్ గా ఉంటారు. పని చేస్తారు అందులో ఫోకస్ పెట్టరు కాబట్టి పెద్దగా పనులు జరగవు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతాయి. ఒంటరిగా సమయం గడపడం వల్ల మీ బాధ కొద్దిగా తగ్గుతుంది. 

మకర రాశి  (Capricorn) – ఒకసారి ఒక పని పై ఫోకస్ పెట్టండి. మీరు అన్ని పనులు ఒకేసారి వేగంగా చేసుకుంటూ పోతుంటే ఇతరులకు మీ వేగాన్ని అందుకోవడం కష్టంగా మారుతుంది. దీనివల్ల కూడా మీ పని ముందుకు సాగదు. మీ పనిని ఇతరులకు అప్పగించండి. కుటుంబంతో సమయాన్ని గడపండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు అందుకుంటారు. అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోండి. మీ నిర్ణయాల పట్ల అతి విశ్వాసం పనికి రాదు. ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం వల్ల వీకెండ్ ప్లాన్లు వాయిదా పడతాయి. ఎక్కువ చేస్తానని చెప్పి తక్కువ చేయడం కంటే తక్కువగా చెప్పడం మంచిది. 

మీన రాశి  (Pisces) – ఈ రోజు మీ నిర్ణయాలే సరైనవని.. అవి పాటించమని ఇతరులపై ఒత్తిడి పెంచడం సరికాదు. వారి ఆలోచనలను అమల్లో పెట్టేందుకు వారికి అవకాశం ఇవ్వండి. పని ప్రదేశంలో ఇతరులతో గొడవలు పెట్టుకోకండి. కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది. పాత స్నేహితులను కలుస్తారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.