12 నవంబరు 2019 (మంగళవారం), ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

12 నవంబరు 2019 (మంగళవారం), ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (12 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆలుమగల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. కొన్ని విషయాలలో ఇద్దరు పరస్పరం ఒకరి నిర్ణయాన్ని మరొకరు గౌరవించుకోవడం మంచిది. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన అవకాశం. వ్యాపారస్తులు వివేకంగా ఆలోచించాలి. విద్యార్థులు ప్రత్యమ్నాయ కోర్సుల వైపు ఆసక్తి చూపిస్తారు.

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ప్రేమికులు కొన్ని విషయాలలో తమ స్నేహితుల సహాయాన్ని తీసుకుంటారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. మహిళలు షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. మహిళలు అపరిచితులను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొత్త భాగస్వాములను ఆహ్వానిస్తారు. సాఫ్ట్‌వేర్, ఐటి రంగాలకు చెందిన వ్యక్తులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. 

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి చూపిస్తారు. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. వివాహితులు తమ జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

సింహ రాశి (Leo) – ఈ రోజు మీరు ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ చూపించడం మంచిది. వ్యాపారస్తులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు డబ్బును ఖర్చు పెట్టే విషయంలో సంయమనం పాటించాలి. ఈ రోజు మీరు మీ కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. భార్యభర్తలు కొన్ని విషయాలలో ఇష్టం లేకపోయినా సర్దుకుపోవాల్సి ఉంటుంది. ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారస్తులు బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శుభవార్తలు వింటారు. అలాగే పాత మిత్రులను కలుస్తారు. మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే సంఘటనలు కూడా ఈ రోజు జరుగుతాయి. ఆలుమగలు కొన్ని నిర్ణయాలు తీసుకొనేటప్పుడు పెద్దల సలహాలు పాటించడం శ్రేయస్కరం. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలను వింటారు. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు వివేకంగా ఆలోచించాలి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.  విద్యార్థులు లక్ష్యసాధనలో మరింత కష్టపడాలి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధను రాశి (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే ప్రత్యర్థులు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు.  వ్యాపారస్తులు కూడా అనుకోని లాభాలు పొందుతారు. ప్రేమికులు కొన్ని విపత్కర పరిస్థితుల నుండి బయటపడతారు. ఆలుమగలు తమ జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.  

మకర రాశి (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సమాజ సేవ పట్ల మొగ్గు చూపిస్తారు. ఉద్యోగులు తాము కష్టపడిన దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్లతో డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు పలు శుభవార్తలను వింటారు.  

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా గడుపుతారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని చూపిస్తారు. విద్యార్థులు క్రీడలు లేదా కళలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. వ్యాపారస్తులు రుణాలు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆలుమగలు కొన్ని విషయాలలో.. ఎదుటి వారి నిర్ణయాలను కూడా గౌరవించడం నేర్చుకోవాలి. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ జీవితానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రులు అప్పుడప్పుడు తమ పిల్లలను ఒక కంట కనిపెట్టడం మంచిది. నిరుద్యోగులు ఇంకాస్త కష్టపడితే.. తాము కోరుకున్న రంగాలలో ఉపాధిని పొందే అవకాశం ఉంది.  

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.