21 నవంబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

21 నవంబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (21 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు మీరు మీ పాత మిత్రులను కలిసే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలు వింటారు. అలాగే వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. కొన్ని విపత్కర పరిస్థితులలో మీకు మీ కుటుంబ సభ్యుల సహాయం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా మీకు ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంది. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు మీ మనసు అస్థిరంగా ఉంటుంది. అలాగే కొన్ని పనులు వాయిదా పడతాయి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే పలు వివాదాస్పద విషయాలలో తలదూర్చకపోవడం మంచిది. అదేవిధంగా, దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  మీ భాగస్వామితో ప్రేమగా మెలగండి. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు మీ కుటుంబంలో ఆస్తి లావాదేవీలకు సంబంధించిన విషయాలు చర్చకు వస్తాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి మొగ్గు చూపిస్తారు. ఈ రోజు ఇల్లు లేదా ఆఫీసుకు సంబంధించిన కొన్ని రిపేరింగ్ పనులతో బిజీగా గడుపుతారు. కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి పిక్నిక్ లేదా వనభోజనాలకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. అలాగే మీ ఆదాయ పరిస్థితి కూడా బాగుంటుంది. 

కర్కాటక రాశి (Cancer) –  ఈ  రోజు కుటుంబంతో ఎక్కువగా సమయాన్ని గడపడం వల్ల.. సంబంధ బాంధ్యవాలు మెరుగుపడతాయి. అలాగే మీ పట్ల మీ భాగస్వామికి, పిల్లలకు ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అలాగే ఆఫీసులో మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే ఈ రాశి వారికి సులభ ధన యోగం ఉంది. అలాగే విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంది. 

సింహ రాశి (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆఫీసులో కొన్ని విపత్కర పరిస్థితులలో చిక్కుకుంటారు. అలాగే సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల.. మీరు అనుకోని సమస్యలలో పడతారు. అయినా సరే మీ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దు. కొన్ని విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించండి.  మీ సహచరుల మద్దతు తీసుకోండి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించినా.. మీ నిజాయతీని వీడకండి. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని శుభవార్తలు వింటారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితులు సైతం బాగా మెరుగుపడతాయి.  సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలోని వ్యక్తులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు పరిష్కరించబడతాయి. ఈ రాశి వ్యక్తులకు విదేశీ ప్రయాణ యోగం ఉంది. అలాగే బాల్య మిత్రులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

తుల రాశి (Libra) – ఈ రాశి వారు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తిని చూపించే అవకాశం ఉంది. ఆఫీసులో మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. విద్యార్థులకు క్రీడలు లేదా కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తుల వాణిజ్య ఒప్పందాలు.. రద్దు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు మీ భాగస్వామి నుండి మద్దతు ఉంటుంది. పిల్లలను కొన్ని విషయాలలో కట్టడి చేయడం శ్రేయస్కరం. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీరు మీ పిల్లలకు సంబంధించి మంచి విషయాలు వింటారు. అయితే వారి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ చూపించండి. అలాగే మీ రోజువారి జీవితంలో కూడా అనుకోని మార్పులు సంభవిస్తాయి. అద్దెకున్న ఇల్లు మారడం లేదా కొత్త ఉద్యోగంలో చేరడం గానీ జరగవచ్చు. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. ఆర్థికంగా కూడా మీకు బాగానే ఉంటుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధను రాశి (Saggitarius) -  ఈ రోజు ప్రేమికులకు అనుకూలమైన రోజు. అలాగే.. మీ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. అలాగే కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి కూడా.. ఇదే సరైన రోజు.  అదేవిధంగా మీకు సామాజిక కార్యక్రమాల పై ఆసక్తి పెరుగుతుంది. చట్టపరమైన సమస్యల నుండి కూడా వేగంగానే బయటపడతారు. రాజకీయ రంగంలోని వ్యక్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. 

మకర రాశి (Capricorn) –    ఈ రోజు నిరుద్యోగులకు శ్రేయస్కరమైన రోజు.  కొత్త ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ  వస్తాయి. అలాగే స్వయంఉపాధి లేదా స్టార్టప్స్‌లో రాణించాలని భావించే యువతకు కూడా ఈ రోజు బాగా కలిసొస్తుంది. విద్యార్థులకు కూడా తమ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కష్టపడి పనిచేసే వారికి తమ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా సరదాగా ఉంటుంది. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి అడుగులు వేయాలి. రుణాలు ఇచ్చే విషయంలో లేదా తీసుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగరూకతతో వ్యవహరించాలి. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అలాగే ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేయాలి. వాయిదా పద్ధతులకు స్వస్తి పలకాలి. అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే  ఈ రాశి వ్యక్తులకు విదేశీ ప్రయాణ యోగం ఉంది. అలాగే సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.