25 నవంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

25 నవంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (25 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు ప్రేమికులు అనుకోని ఇబ్బందులలో పడతారు. ముఖ్యంగా స్నేహితుల ప్రవర్తనతో మీరు బాధపడతారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆఫీసులో పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.

వృషభ రాశి (Tarus) – ఈ రోజు   కుటుంబ సమస్యల వల్ల మీరు ఒత్తిడికి లోనవుతారు. అయినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. ఆఫీసులో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. అవివాహితులు పలు శుభవార్తలను వినే అవకాశం ఉంది. ప్రేమికులు లేదా ఆలుమగల బంధాలు పటిష్టంగా మారతాయి.

మిథున రాశి (Gemini) –   ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కాస్త ఒత్తిడికి లోనవుతారు. ఆర్థికంగా కూడా కొంత నష్టాన్ని చవిచూస్తారు. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. సృజనాత్మక రంగాల వైపు ఆసక్తి పెరుగుతుంది. వివాదాలకు దారితీసే కార్యకలాపాలకు దూరంగా ఉండండి. రుణాలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

కర్కాటక రాశి (Cancer) –  ఈ రోజు మీ వైవాహిక జీవితంలో..  ఎనలేని ఆనందాన్ని చవిచూస్తారు. మీ ప్రత్యర్థులతో కొన్ని విషయాలలో రాజీ పడతారు. అలాగే కొన్ని విషయాలలో ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులకు ఆర్థికంగా బాగుంటుంది.

సింహ రాశి (Leo) –  ఈ రోజు ఉద్యోగస్తులు కొన్ని విషయాలలో నిర్లక్ష్యాన్ని వీడాలి.  లేకపోతే అనుకోని సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఈ రోజు మీకు సులభ ధనయోగం ఉంది. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలోని వ్యక్తులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు తల్లిదండ్రుల నుండి సహాయాన్ని పొందుతారు. పలు శుభవార్తలు కూడా వింటారు. వాణిజ్య విస్తరణ కోసం ప్రణాళికలు రచిస్తారు. మీ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెండింగ్ పనులు ఒక కొలిక్కి వస్తాయి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

తుల రాశి (Libra) – ఈ రోజు కెరీర్‌కు సంబంధించి మీరు కొత్త నిర్ణయాలు తీసుకోకండి. అలాగే మంచి పోటీవాతావరణాన్ని తట్టుకుంటారు. ప్రత్యర్థుల నుండి సవాళ్లను స్వీకరిస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీరు కొన్ని విషయాలలో నిరాశకు గురవుతారు. వాతావరణం కూడా మిమ్మల్ని అసహనానికి గురిచేయవచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినా మీ వ్యాపార ప్రణాళికలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 

ధను రాశి (Saggitarius) -  ఈ రోజు ప్రేమికుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మీ బంధం గురించి ఇంట్లో తెలియజేయడానికి ఇదే సరైన సమయం. అలాగే కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆఫీసులో ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు   విద్యార్థులు కొంత అసహనానికి గురవుతారు. మీ పనులకు అవరోధం కలిగించడానికి కొందరు ప్రయత్నిస్తారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు ఈ రోజు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే వివాదాల జోలికి వెళ్లకపోవడం మంచిది. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) -  ఈ రోజు మీ  వాణిజ్య ఒప్పందాలు రద్దు అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఆఫీసులో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని.. మీకు నైతిక మద్దతు ఇస్తారు. 

మీన రాశి (Pisces) –  ఈ రోజు అన్ని సమస్యలకు దూరంగా వెళ్లి... కాసేపు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. మిత్రులు లేదా సన్నిహితులతో కలిసి కొంత సమయం గడపండి. అలాగే కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలోని వ్యక్తులకు  ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.