26 నవంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

26 నవంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (26 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఆఫీసులో ఒత్తిడిని తట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది. మీ దినచర్యలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే వివాదాల జోలికి వెళ్లవద్దు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు ప్రేమికులు కొన్ని ఊహించని పరిణామాలను ఎదుర్కొంటారు. ఆలుమగలు తొలుత పొరపొచ్చాలు వచ్చినా తర్వాత కలిసిపోతారు. అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే కొన్ని సందర్భాలలో కోపాన్ని నియంత్రించుకోండి. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు మీరు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంటుంది. వివాహితులకు ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలలో  మీకు స్నేహితుల నుండి మద్దతు కూడా లభిస్తుంది. 

కర్కాటక రాశి (Cancer) –  ఈ రోజు మీకు రోజంతా ప్రశాంతంగా సాగుతుంది. సొంత ఇల్లు కొనుక్కోవాలనే మీ కల త్వరలో నెరవేరుతుంది. అలాగే జీవిత భాగస్వామితో బంధం మరింత పటిష్టమవుతుంది. మీకు విదేశీ ప్రయాణయోగం కూడా ఉంది. అలాగే పాతమిత్రులు మిమ్మల్ని కలుస్తారు. 

సింహ రాశి (Leo) –  ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చినా.. తర్వాత మళ్లీ ఒకే మాట మీద నిలబడతారు. అలాగే పలు శుభవార్తలు కూడా వింటారు. రాజకీయ రంగంలోని వ్యక్తులకు కొత్త బాధ్యతలు పెరగవచ్చు. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో అధికారుల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరి పట్ల మరొకరు నిజాయతీతో వ్యవహరించడం మంచిది. అప్పుడే బంధాలు నిలబడతాయి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

తుల రాశి (Libra) – ఈ రోజు స్థిరాస్తుల రంగంలోని వారికి మంచి లాభం చేకూరుతుంది. అలాగే కొత్తదంపతులు దూర ప్రాంతాలను సందర్శిస్తారు. అదేవిధంగా ఖరీదైన బహుమతులను కూడా పొందుతారు.  కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీరు తీసుకొనే కొన్ని నిర్ణయాలు..  వ్యాపారానికి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి.  అదేవిధంగా ఆఫీసులో కొత్త సమస్యలు తలెత్తుతాయి. అలాగే మీకు వాహన యోగం ఉంది. కుటుంబ సంబంధాలలో మార్పు వస్తుంది. కొన్ని అనుకోని సంఘటనల పట్ల ప్రభావితులవుతారు. 

ధను రాశి (Saggitarius) -  ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించండి. అలాగే ఆఫీసులో ఆడిట్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక పెండింగ్ పనులను పూర్తి చేయండి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగులు వేయండి.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు జీవిత భాగస్వామితో మీ సంబంధాలు పటిష్టంగా మారతాయి. మీ సోదరులు లేదా సన్నిహితుల సహాయంతో వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో సీనియర్ల నుండి మద్దతు ఉంటుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) -  ఈ రోజు నిరుద్యోగులకు శుభదినం. అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. అలాగే వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలో పురోగమనం ఉంటుంది. విద్యార్థులు కొన్ని విషయాలలో సోమరితనాన్ని వీడాలి. 

మీన రాశి (Pisces) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యాపారం నెమ్మదిగా సాగడం వల్ల.. ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. అలాగే రుణాలు తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల నుండి అన్ని విధాలుగా సహాయ, సహకారాలు పొందుతారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.