27 నవంబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

27 నవంబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (27 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుకోని సమస్యలు.. మీ సహనాన్ని పరీక్షించవచ్చు.  విద్యార్థులు మరింత కష్టపడాలి. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు ఆరోగ్యం విషయంలో.. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి.  ఉద్యోగస్తులకు ఆఫీసు పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. అలాగే పాత స్నేహాలను కొత్త సంబంధాలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు.

మిథున రాశి (Gemini) – ఈ రోజు ఆస్తి సంబంధిత లావాదేవీలు చర్చకు వస్తాయి. అలాగే కుటుంబ విభేదాలు పెరిగే అవకాశం ఉంది. మీ మాటలతో కొందరు మనస్తాపం చెందుతారు. అలాగే ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యత ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. 

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. మీ భాగస్వామితో చర్చించండి. ఆఫీసులో అదనపు బాధ్యతలు పెరగవచ్చు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

సింహ రాశి (Leo) –  ఈ రోజు మీకు కొత్త వ్యాపార పద్థతుల వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి.  

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేస్తారు. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో తెలియజేయడానికి ఇదే సరైన సమయం. అలాగే బాధలో ఉన్నప్పుడు.. మిత్రులు చెప్పే మాటలు మీకు ఉపశమనం కలిగిస్తాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

తుల రాశి (Libra) – ఈ రోజు వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. సులువుగా చేయగలిగే పనులను కూడా.. కొన్ని పరిస్థితుల వల్ల పూర్తి చేయడం కష్టంగా మారుతుంది. ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం మంచిది. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంటుంది. మీ వ్యాపార భాగస్వామ్యంలో కొంత అస్థిరత ఏర్పడుతుంది. కొన్ని విషయాలలో.. ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. అవివాహితులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. 

ధను రాశి (Saggitarius) - ఈ రోజు ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు రద్దయ్యే అవకాశం ఉంది. అలాగే అధిక శ్రమ కారణంగా.. శారీరక ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.  మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. కొన్ని విషయాలలో కోపాన్ని  నియంత్రించుకోండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు ఆరోగ్య విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. స్థిరాస్తుల కొనుగోల విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై.. మీకు ఎనలేని ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో మరింత కష్టపడాలి. మీ బాల్య మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) -  ఈ రోజు మీరు ఒంటరితనాన్ని ఫీలవుతారు. అలాగే కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం ఆలోచిస్తారు. రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల పట్ల ఆసక్తి చూపిస్తారు. 

మీన రాశి (Pisces) –  ఈ రోజు నిరుద్యోగులకు శుభదినం. కొంచెం కష్టపడితే.. అనుకోని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే వ్యాపారస్తులు రుణాలు ఇచ్చే విషయం లేదా తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పలు మేధోపరమైన ఆలోచనలు చేస్తారు. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.