మసాలా దినుసుల్లో జరిగే కల్తీ ఎలా గుర్తించాలో మీకు తెలుసా? | POPxo

మసాలా దినుసుల్లో జరిగే కల్తీ.. ఎలా గుర్తించాలో మీకు తెలుసా?

మసాలా దినుసుల్లో జరిగే కల్తీ.. ఎలా గుర్తించాలో మీకు తెలుసా?

ఈ రోజుల్లో ప్రతి వస్తువు కల్తీ (Adultration) అయిపోతోంది. దీంతో అసలు ఏం తినాలన్నా భయమేస్తుంది. బియ్యం, పప్పుల దగ్గర నుండి కూరగాయలు, పాలు.. ఇలా అన్నీ కల్తీమయమే. అలాగే కిచెన్‌లో రోజూ ఎక్కువగా వాడే మసాలా దినుసులు (Spices) కూడా కల్తీ అయిపోతున్నాయి. ముఖ్యంగా పసుపు, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి వంటి వాటిలో.. కల్తీ పదార్థాలు కలిపి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు కొందరు వ్యాపారులు. ఇది మన ఆరోగ్యం పై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోంది.

అందుకే ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్డ్‌మెంట్ తమ సూచనల ప్రకారం.. ప్యాకేజ్డ్ కాకుండా విడిగా దొరికే మసాలా దినుసులు లేదా ఇతర వస్తువులు కొనవద్దని చెబుతున్నారు. ముఖ్యంగా సరైన ప్యాకింగ్ లేకుండా.. విడిగా అమ్మే పదార్థాలలో దుమ్ము, ధూళి కలుస్తోంది. దీని వల్ల జనాలు ఎలర్జీ లేదా ఇతర ఆరోగ్య రుగ్మతల బారిన ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలో మనం కూడా, కల్తీ అయిన మసాలా దినుసులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం రండి.

1. పసుపు

పసుపు సాధారణ రంగు కంటే.. కాస్త ఘాఢంగా ఉంటే అది కల్తీ అయ్యే అవకాశం ఉంది. కనుక కచ్చితంగా అనుమానించాల్సిందే. ఎందుకంటే సాధారణంగా పసుపు.. లేత పసుపు రంగులో ఉంటుంది. ఇక రసాయనాలు కలిపి తయారు చేసిన పసుపును వంటల్లో వాడితే.. మనం రోగాలకు స్వాగతం పలికినట్లే. పసుపులో కల్తీని ఎలా గుర్తించాలంటే.. ఓ గ్లాస్ నీళ్లు తీసుకొని అందులో పసుపు వేయాలి. స్వచ్ఛమైన పసుపు అయితే.. కొద్దిగా రంగును విడుదల చేస్తూ అడుగుకు చేరుకుంటుంది. అదే కల్తీ అయితే ..కలపకుండానే నీరు మొత్తం పసుపు రంగుకు మారిపోతుంది.

2. ధనియాల పొడి

ధనియాల పొడిలో జనాలు తేడాను గమనించకుండా చేయడానికి.. గడ్డి గింజల పొడి కలుపుతారు. లేదా ఎండబెట్టిన పేడను కలుపుతారు. ఈ కల్తీని తెలుసుకునేందుకు ధనియాల పొడి వాసనను చూడాలి. చక్కటి ధనియాల పొడి వాసన రాకపోతే.. అందులో కల్తీ జరిగిందన్నమాటే.

3. కారం

నిత్యం వాడే వంటల్లో ఇది చాలా ముఖ్యమైంది. అయితే ఈ మధ్యకాలంలో కారం కూడా కల్తీ అవుతోంది. దీనిలో పలు రసాయనాలతో పాటు రంపపు పొట్టు, ఇటుక పొడి వంటివి కలుపుతుంటారు. దీనిని గుర్తించేందుకు ఓ గ్లాస్‌లో నీళ్లు పోసి అందులో కారం వేయాలి. ఒకవేళ కారం నీళ్లపై తేలియాడితే.. అందులో రంపపు పొట్టు ఉన్నట్లు లెక్క. ఒకవేళ నీరు ఎరుపు రంగులోకి మారితే కెమికల్ కలిసిందని చెప్పచ్చు. సాధారణంగా స్వచ్ఛమైన కారం.. కొద్దిగా రంగును విడుదల చేసి నీటి అడుగున ఉండిపోతుంది. ఇటుక పొడి ఉందా? లేదా? అన్న విషయం తెలుసుకోవాలంటే.. కారాన్ని చేతి వేళ్లతో తీసి కాస్త నలపాలి. ఒకవేళ అప్పుడు అది ఇసుక మాదిరిగా అనిపిస్తే.. కారంలో ఇటుక పొడి కలిసిందని చెప్పచ్చు. 

4. దాల్చిన చెక్క పొడి

ఈ మధ్యకాలంలో దాల్చిన చెక్క పొడిని రంపపు పొట్టుతో కలిపి కల్తీ చేస్తున్నారు. అలాగే చెక్కను కూడా వేరే చెట్టు బెరడును ఉపయోగించి కల్తీ చేయడం గమనార్హం. వీటిని గుర్తించడం సులువే. ఒకవేళ రంపపు పొట్టు అయితే.. నీటిపై తేలుతుంది. సాధారణంగా దాల్చిన చెక్క లేదా ఆ పొడిని చేతిపై రుద్దితే కాస్త రంగు వస్తుంది. అలా రంగు రాకపోతే అది దాల్చిన చెక్క కాదని గుర్తుంచుకోవాలి.

5. కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు రంగు చాలా ముదురుగా ఉంటుంది. అలాగే దాన్ని ముక్కలు చేయడం కూడా అంత సులభం కాదు. ఒకవేళ కల్తీ చేసిన కుంకుమ పువ్వు అయితే.. దాని రంగు లేత ఎరుపులో లేదా పసుపు రంగులో ఉంటుంది. దాన్ని ముక్కలు చేయడం సులభం. గ్లాసు నీటిలో కుంకుమ పువ్వు తేలియాడితే.. అది స్వచ్ఛమైందని గుర్తుంచుకోవాలి.

6. ఇవి కూడా..

* ఆవాల్లో కల్తీని కనుక్కోవాలంటే.. ఓ గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని అందులో ఆవాలు వేయాలి. బ్రహ్మ జెముడు విత్తనాలు నీటిలో తేలతాయి. ఆవాలు అడుగున చేరుకుంటాయి.

* మిరియాల్లో కల్తీని గుర్తించేందుకు కూడా గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో మిరియాలు వేయాలి. బొప్పాయి గింజలు నీటిపై తేలతాయి. మిరియాలు అడుగుకు చేరుకుంటాయి.

* ఇంగువ పొడిలో చాక్ పీస్ పొడి కలుపుతారు. దీన్ని గుర్తించేందుకు కాస్త యాసిడ్‌ని దానిలో కలిపాలి. పొగలు వస్తే కల్తీ జరిగినట్లు.. ఒకవేళ రాకపోతే స్వచ్ఛమైనది అన్నట్లు లెక్క.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More from Lifestyle
Load More Lifestyle Stories