ADVERTISEMENT
home / DIY Fashion
స్లీవ్ లెస్ లో చేతులు లావుగా కనిపిస్తున్నాయా? అయితే ఇలా ట్రై చేసి చూడండి.

స్లీవ్ లెస్ లో చేతులు లావుగా కనిపిస్తున్నాయా? అయితే ఇలా ట్రై చేసి చూడండి.

మనలో చాలామందికి స్లీవ్ లెస్ (sleeveless) డ్రస్సులు వేసుకోవాలని కోరిక. కానీ అవి వేసుకుంటే మన చేతులు(arms) ఎక్కడ లావుగా కనిపిస్తాయో అని మనమంతా ఆలోచిస్తుంటాం. చేతులు లావుగా కనిపించకుండా ఉండాలని హాఫ్ స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్ ఇలాంటి దుస్తులనే ధరిస్తాం స్లీవ్ లెస్ దుస్తులు ధరించాలంటే మాత్రం చాలా ఆలోచించాల్సి వస్తుంది. షాపింగ్ కి వెళ్లినప్పుడు స్లీవ్ లెస్ దుస్తులు కొనుక్కున్నా సరే.. ఇంటికి వచ్చాక మాత్రం వాటిని వార్డ్ రోబ్ నుంచి బయటకు తీసేది చాలా తక్కువే. మీరూ ఇలా స్లీవ్ లెస్ దుస్తులు ధరించడానికి ఇబ్బంది పడుతున్నారా? మీ చేతులు లావుగా కనిపిస్తాయని వెనుకాడుతున్నారా? అయితే ఈ టిప్స్ వాడండి. మీ చేతులు సన్నగా కనిపించేలా చేసుకోండి.

1. సరైన ఫిటింగ్

మీరు వేసుకునే బ్రా ఫిటింగ్ సరిగ్గా లేకపోతే మీ లుక్ చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. మీ సైజ్ కాకుండా కాస్త పెద్ద లేదా చిన్న సైజ్ బ్రా వేసుకోవడం వల్ల చేతుల వద్ద కొవ్వు చేరి లావుగా కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు మిమ్మల్ని అందంగా కనిపించకుండా చేస్తుంది. ఇలాంటి సమస్యను తప్పించుకోవడానికి ప్రతి ఆరు నెలలకోసారి మీకు సరైన ఫిలింగ్ ఉండే బ్రా ని కొనుగోలు చేయడం అవసరం.

2. ఈ యాక్సెసరీస్ తో..

మీరు స్లీవ్ లెస్ వేసుకున్నప్పుడు లావుగా ఉన్న గాజులు లేదా బ్రేస్ లెట్స్ వంటివి వేసుకోవడం మంచిది కాదు. దీనివల్ల చేతులు పొట్టిగా లావుగా కనిపిస్తాయి. అందుకే హెవీ బ్రేస్ లెట్, చక్కటి కఫ్స్ వేసుకోవాలనుకున్నా వాటిని దూరంగా ఉంచండి. వాటి బదులుగా సన్నని యాక్సెసరీస్ ధరించడం వల్ల మీ చేతులు కూడా సన్నగా కనిపిస్తాయి.

ADVERTISEMENT

3. వి నెక్ ప్రయత్నించండి..

డీప్ నెక్ ఉన్న దుస్తులు వేసుకోవడం వల్ల మెడ పొడవుగా.. సన్నగా కనిపించేలా చేస్తుంది. మీ మెడ దగ్గర ఎముకల వైపు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కాబట్టి చేతుల పైన దృష్టి పడకుండా జాగ్రత్త పడవచ్చు. దీనివల్ల చేతులు సన్నగా ఉన్నట్టుగా భ్రమించజేసే వీలుంటుంది.

4. మంచి స్ట్రాప్ కూడా ముఖ్యమే..

మీ చేతులు లావుగా ఉండి స్లీవ్ లెస్ లో ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయి అనుకుంటే స్ట్రాప్ స్లీవ్స్ వేసుకోవడం మంచిది కాదు. స్పగెట్టీ, నూడిల్ స్ట్రాప్ టాప్స్ మీ చేతులు మరింత లావుగా కనిపించేలా చేస్తాయి. వీటిలో చర్మం ఎక్కువగా కనిపించడం వల్ల కూడా అలా జరగవచ్చు. ఇలాంటప్పుడు బోర్డర్ స్ట్రాప్స్ ఉపయోగించడం వల్ల మీ సమస్య పెద్దగా కనిపించదు. ఒకవేళ సన్నగా ఉండే స్లీవ్స్ వేసుకోవాలనుకుంటే మాత్రం దాన్ని ఓ ష్రగ్ తో కప్పడం మంచిది.

ADVERTISEMENT

5. టైట్ హోల్స్ వద్దు..

డ్రస్ చేతులు కాస్త వదులుగా ఉండేలా చూసుకోవాలి. ఒక వేళ ఆర్మ్ హోల్స్ కాస్త టైట్ గా ఉంటే దాని కింద ఉబ్బినట్లుగా కొవ్వు కనిపించడం కామన్ గా మారుతుంది. కాస్త వదులుగా ఉన్న ఆర్మ్ హోల్స్ మీ కదలికలకు ఇబ్బంది లేకుండా.. చేతులు లావుగా కనిపించకుండా కాపాడుతుంది.

6. బాక్సీ షేప్స్ ప్రయత్నించండి.

బాక్సీ షేప్స్ చాలా వెడల్పుగా ఉంటాయి. వాటిలో మరింత లావుగా కనిపిస్తామేమో అని మీరు భావిస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. అది వెడల్పుగా ఉన్నా సరే.. మీ శరీరం సన్నగా ఉన్న ఫీలింగ్ ని తీసుకొస్తాయి. ఇప్పుడు ఇందులోనే ప్రింటెడ్ టీ షర్ట్స్, షర్ట్స్ చాలా అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ఓసారి ప్రయత్నించండి.

7. ఇన్ కట్ స్టైల్స్ తో

స్లీవ్ లెస్ లో మామూలు కట్స్ ప్రయత్నించే బదులు భుజాలను కాస్త ఎక్కువగా చూపించే డీప్ కట్స్ ప్రయత్నించండి. మామూలు కట్స్ మన భుజాలు ఏ భాగంలో అయితే లావుగా ఉంటాయో అక్కడే కట్ ఉండడం వల్ల లావుగా కనిపించే వీలుంటుంది. అదే ఇన్ కట్ స్టైల్ ఎంచుకోవడం వల్ల లావుగా ఉన్న భాగం కంటే కాస్త పై నుంచే చేతులు కనిపించడం వల్ల అవి అంత లావుగా అనిపించవు.

ADVERTISEMENT

8. బటర్ ఫ్లై స్లీవ్స్ ట్రై చేస్తారా?

బటర్ ఫ్లై స్లీవ్స్ అంటే చాలా చిన్నగా ఉండే స్లీవ్స్ వీటిని వేసుకుంటే స్లీవ్ లెస్ వేసుకున్నట్లుగానే ఉంటుంది. కానీ అది చెప్పాలంటే స్లీవ్ లెస్ కాదు. దీనివల్ల కాస్త ఉబ్బిన భాగం కవర్ అయిపోతుంది. తద్వారా మీ చేతులు సన్నగా..అద్భుతంగా కనిపిస్తాయి.

9. స్ట్రాప్ లెస్ అస్సలు వద్దు.

స్ట్రాప్ లెస్ గౌన్లలో రొమ్ము భాగంలో ఉన్న కొవ్వు కూడా పైకి తోసుకు వచ్చినట్లుగా ఉంటుంది. ఇవి సన్నగా ఉండేవారికి తప్ప మిగిలిన వారు వేసుకుంటే కొవ్వుతో ఉబ్బినట్లుగా అనిపించి మీరు ఉన్నదాని కంటే లావుగా అనిపిస్తారు. అందుకే స్లీవ్ లెస్ ప్రయత్నించినా.. స్ట్రాప్ లెస్ స్టైల్స్ నుంచి దూరంగా ఉండడం మంచిది.

10. ఆఖరి నిమిషంలో ఇలా..

వ్యాయామం చేయడం అంటే మనలో చాలా మందికి ఇష్టం లేదు. కానీ అది తప్పనిసరిగా పని చేస్తుంది. స్లీవ్ లెస్ వేసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ముందు కొన్ని పుషప్స్ చేయడం వల్ల చేతులకు రక్త ప్రసరణ బాగా జరిగి అవి కాస్త సన్నగా కనిపించే వీలుంటుంది.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

04 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT