మీ బాయ్ ఫ్రెండ్ 'రాశి'ని బట్టి.. తను మిమ్మల్ని ఎలా ప్రపోజ్ చేస్తాడో తెలుసుకోండి ..!

మీ బాయ్ ఫ్రెండ్ 'రాశి'ని బట్టి.. తను మిమ్మల్ని ఎలా ప్రపోజ్ చేస్తాడో తెలుసుకోండి ..!

(Here's How Your Boyfriend Will Propose To You Based On His Zodiac Sign)

మీరు గత కొన్ని నెలలు లేదా సంవత్సరాలుగా ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ..  మీ ప్రేమను పెళ్లి పీటలెక్కించాలని భావిస్తున్నారా ? లేక ఇప్పటికే ప్రేమలో పడలేదని బాధపడుతున్నారా ? ఏ అమ్మాయి అయినా సరే.. తమ బాయ్ ఫ్రెండ్  లేదా కాబోయే భాగస్వామి తనను ఎలా ప్రపోజ్  చేస్తాడా? అని ఊహించుకోవడం సహజం.

మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే తను రెస్టారెంట్‌లో అందరి ముందు రింగ్ తొడిగి సింపుల్‌గా ప్రపోజ్ చేస్తాడా? లేదా మీ ఇద్దరికీ నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లి.. అక్కడ మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాడా? అని ఇప్పటికే మీరు ఊహించుకోవచ్చు. అయితే రాశుల ప్రకారం కూడా అబ్బాయిలు, అమ్మాయిలకు ప్రపోజ్ చేసే స్టైల్ మారిపోతుందట. ఇది నిజమట.  మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా   మీ బాయ్ ఫ్రెండ్ రాశిని బట్టి..  తను మిమ్మల్ని ఎలా ప్రపోజ్ చేస్తారో తెలుసుకొని ఓ అంచనాకి రండి.

మేష రాశి

ఈ రాశికి చెందిన బాయ్ ఫ్రెండ్ మీకుంటే.. తను మీరు అస్సలు ఊహించని సమయాన్ని ఎంచుకొని మరీ మిమ్మల్ని ప్రపోజ్ చేస్తాడు. ఆ ప్రపోజల్ కూడా చాలా గ్రాండ్‌గా మీరు అనుకోని విధంగా ఉంటుంది. చాలా ఎక్కువమంది మీ చుట్టూ ఉన్నప్పుడు .. అందరి మధ్యలో ఎంతో ప్రత్యేకంగా ఫీలయ్యేలా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తాడు. ఓ పెద్ద షాపింగ్ మాల్‌లో.. మీకోసం ప్రత్యేకంగా ఫ్లాష్ మాబ్ ఒకటి ఏర్పాటు చేసి మరీ.. వారి మధ్య మిమ్మల్ని ప్రపోజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

వృషభ రాశి

తను ప్రేమించిన అమ్మాయిని ప్రపోజ్ చేసే విషయంలో.. ఈ రాశికి చెందిన వ్యక్తులు ముందు నుంచే కాస్త క్లూ ఇస్తూ ఉంటారు. మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి.. కొన్ని రోజుల ముందు నుంచే "నీకు ఎంతమంది పిల్లలు కావాలని ఉంది"..  "నేను భర్తగా ఒక అమ్మాయిని బాగా చూసుకోగలనంటావా?" .. "నీ పెళ్లి ఎలా జరగాలని నీకు ఆశగా ఉంది?" అంటూ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ.. మీరూ తనని ఇష్టపడుతున్నారా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాతే మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి ముందడుగు వేస్తారు.

మిథున రాశి

మిథున రాశికి చెందిన వ్యక్తులు ఒక బంధంలో ఉండేందుకు భయపడుతుంటారు. వారు తమ ఫీలింగ్స్ గురించి బయటకు పెద్దగా చెప్పరు కాబట్టి.. వారి ఫీలింగ్స్‌ని మీరు గుర్తించడం కూడా పెద్ద కష్టమనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నా సరే.. తను మిమ్మల్ని ఎలా ప్రపోజ్ చేయాలి..? అన్న విషయాన్ని నిర్ణయించుకోవడానికే కొన్ని నెలల సమయం తీసుకుంటారు. ఇదంతా చేయడం తనకు ఆలస్యమవుతుందని మీరు అనుకుంటే.. మీరే తనని ప్రపోజ్ చేసేయండి. మీరు మొదటి అడుగు వేయడం వల్ల తనకు ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ తొలగిపోతాయి.

కర్కాటక రాశి

ఈ రాశికి చెందిన వ్యక్తులు మిమ్మల్ని ప్రేమిస్తే.. వారు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటారు. తమ కుటుంబంలో మీరు భాగమయ్యేందుకు.. ముందుగా కుటుంబ సభ్యులందరినీ ఒప్పించి.. వారి అంగీకారంతోనే వారి ముందే మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు.. ఒకరిని ప్రేమించి వారిని పెళ్లి చేసుకోవాలంటే వారిని ఎంతో నమ్మి, ప్రేమిస్తారు. మీరు అంత ప్రత్యేకం అనుకుంటేనే.. మీతో పెళ్లి వరకూ వస్తారు.

సింహ రాశి

మీరు సింహ రాశి వ్యక్తితో ప్రేమలో పడ్డారా?  అయితే ఈ రాశి వ్యక్తులు చాలా అద్భుతమైన ప్రేమికులనే చెప్పచ్చు. వీళ్లు తమ ప్రేమను అందరి మధ్యా వెల్లడిస్తారు. వీరికి అందరి మధ్యా ప్రత్యేకంగా కనిపించడమంటే ఎంతో ఇష్టం. మిమ్మల్ని కూడా అలాగే ప్రత్యేకంగా చూపాలనుకుంటారు. అందుకే పది మంది మధ్యలో ప్రపోజ్ చేయడమే కాదు.. ప్రపోజ్ చేయడానికి ఓ మంచి ప్రదేశాన్ని కూడా ఎంచుకుంటారు. అందుకే మీరిద్దరూ కలిసి వెళ్లిన హాలిడే లేదా ఏదైనా ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని వారు మీకు ప్రపోజ్ చేస్తారని తెలుసుకోండి. 

కన్యా రాశి

కన్యా రాశికి చెందిన వ్యక్తి మిమ్మల్ని ప్రపోజ్ చేయబోతున్నారని.. మీకు ముందుగానే తెలిసిపోతుంది. మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి ముందు.. మీ నుంచి కాస్త దూరంగా ఉండడం చేస్తుంటారు. మీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు దేనికీ రిప్లై ఉండదు. అయితే ఇది మీకు అత్యద్భుతమైన రీతిలో ప్రపోజ్ చేయడానికి.. వారు చేస్తున్న తయారీ మాత్రమే. ఒక్కోసారి ఈ దూరమే మీ ఇద్దరి మధ్య గొడవను కూడా తీసుకురావచ్చు. కానీ తను మీకు ప్రపోజ్ చేయగానే మీరు ఇవన్నీ మర్చిపోతారు.

తులా రాశి

తులా రాశికి చెందిన వారు చాలా క్లాసీగా ప్రపోజ్ చేస్తారు. ఎవరికీ సంబంధం లేకుండా.. మీరిద్దరే ఉన్నప్పుడు అంటే.. మీరు ఇంట్లో లేదా రెస్టారెంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. మీరు తనని కాదంటారేమోనని వారికి లోలోపల భయం ఉంటుంది. అందుకే అందరి మధ్యలో తనని అలా కాదంటే.. అహం దెబ్బతింటుందని మీరొక్కరే ఉన్నప్పుడు చెబుతారు.

వృశ్చిక రాశి

ఈ రాశికి చెందిన వారు రొమాన్స్‌ని ఓ కొత్త లెవెల్ కి తీసుకెళ్తారు. ప్రపోజ్ చేయడానికి ఓ పక్కా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడంతో పాటు.. ప్రపోజల్‌కి తగిన వాతావరణం కూడా క్రియేట్ చేస్తారు. ఇల్లంతా గులాబీ రేకులు, దీపాలు వంటివాటితో అలంకరించడంతో పాటు.. మంచి మ్యూజిక్ కూడా పెట్టి మంచి వాతావరణం క్రియేట్ చేసి మూడ్‌ని సెట్ చేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు.

ధనూ రాశి

ఈ రాశికి చెందిన వారికి అడ్వెంచర్స్ అంటే ఎంతో ఇష్టం. అందుకే వీళ్లు రెస్టారెంట్, పబ్, ఇళ్లు వంటి చోట్ల ప్రపోజ్ చేయరు. ఓ మంచి థీమ్ పార్క్ లేదా అడవి మధ్యలో తను మిమ్మల్ని ప్రపోజ్ చేస్తాడు. ఇదొక్కటే కాదు.. మీరిద్దరూ కలిసి రంగుల రాట్నంలో అత్యంత ఎత్తులో ఉండగా ప్రపోజ్ చేయడం.. అడవిలో జలపాతం ఒడ్డున ఉంగరాన్ని మీ చేతికి తొడగడం వంటి అద్భుతమైన సర్ ప్రైజ్‌లు మీకు అందించాలనుకుంటారు.

మకర రాశి

మకర రాశికి చెందిన వ్యక్తులు అంతా సింపుల్‌గా ఉండాలని కోరుకుంటారు. గ్రాండ్‌గా ఉండడం వారికి నచ్చదు. ప్రపోజ్ చేయడానికి కూడా.. సింపుల్ మార్గాన్ని ఎంచుకుంటారు. మీరిద్దరూ సాధారణంగా మాట్లాడుకుంటున్నప్పుడు లేదా నెట్ ఫ్లిక్స్‌లో మీకు నచ్చిన షో చూస్తున్నప్పుడు.. సడన్‌గా జేబులోంచి రింగ్ తీసి మీకు ప్రపోజ్ చేసేస్తారు.

కుంభ రాశి

ప్రపోజ్ చేయడం అంటే ఎంతో ప్రత్యేకంగా ఉండాలని.. కుంభ రాశికి చెందిన వారు భావిస్తారు. ఈ రాశికి చెందిన బాయ్ ఫ్రెండ్ మీకుంటే మీరు చాలా లక్కీ అనుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటివారు తమ ప్రపోజల్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. మీకోసం కవితలు రాయడం, పాటలు పాడడం, మీ ఇద్దరికి సంబంధించిన గుర్తులను జాగ్రత్తగా దాచి చూపించడం.. ఇలా అన్నీ చేసి ఆఖరిలో రింగు తొడిగి మీకు ప్రపోజ్ చేసేస్తారు.

మీన రాశి

మీకు రొమాంటిక్ కామెడీ సినిమాలంటే ఇష్టమా? అయితే మీన రాశికి చెందిన మీ బాయ్ ఫ్రెండ్‌కి కూడా అలాంటివే ఇష్టం. అయితే ప్రపోజ్ చేయడానికి ముందే.. అతడు మీకు కొన్ని క్లూలు ఇస్తుంటాడు. ఉదయాన్నే ఎర్ర గులాబీల బొకే మీకు అందేలా చేయడం, ఆఫీస్‌కి వెళ్లేసరికి మీ డెస్క్ దగ్గర చాక్లెట్ బాక్స్, సాయంత్రం రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్‌తో పాటు డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసేస్తాడు. 

అయితే మీకు నచ్చిన వ్యక్తి మిమ్మల్ని ఎలా ప్రపోజ్ చేస్తారన్న విషయం అంత ముఖ్యం కాదు. తనకు మీపై ఎంత ప్రేమ ఉందో.. మీ ఇద్దరి మధ్య రొమాన్స్ ఎలా ఉందో అన్నది పట్టించుకోవాల్సి ఉంటుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.