ADVERTISEMENT
home / Food & Nightlife
హైదరాబాద్ లో ఉన్న ఈ ఫేమస్ బ్రెడ్  – ఆమ్లెట్ సెంటర్ గురించి మీకు తెలుసా?

హైదరాబాద్ లో ఉన్న ఈ ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ గురించి మీకు తెలుసా?

బ్రెడ్ – ఆమ్లెట్.. సులువుగా పూర్తయ్యే ఈ వంటకం బ్రేక్ ఫాస్ట్ గా, సాయంత్రాల స్నాక్ గా తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇటు గుడ్లలోని ప్రోటీన్లు, పోషకాలతో పాటు.. అటు బ్రెడ్ లోని కార్బొహైడ్రేట్లు కూడా అందే ఈ పదార్థం ఓ ఆరోగ్యకరమైన ఆహారం. ఈ బ్రెడ్ – ఆమ్లెట్ ని ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక సెంటర్ల దగ్గర మాత్రం అద్భుతమైన రుచి కోసం దాన్ని ఓసారి ప్రయత్నించాల్సిందే. అలాంటి వాటిలో ముఖ్యమైంది ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్. అయితే హైదరాబాద్ (hyderabad) – సికింద్రాబాద్ జంటనగర వాసులకి ఎంతో సుపరిచితమైన ఈ సామాన్యుడి బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ కి ఇంత స్థాయిలో ఫాలోయింగ్ రావడానికి కారణమేంటి? అసలు ఈ ఫుడ్ సెంటర్ ప్రస్థానం ఏంటి? అనే ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే ఈ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ ప్రాముఖ్యత తెలుస్తుంది.

హైదరాబాదీ ఫేమస్.. నోరూరించే పాయా ఎలా చేయాలో తెలుసుకుందామా?

మరి ఈ ఫేమస్ (famous) బ్రెడ్ – ఆమ్లెట్ (bread-omelette) సెంటర్ గురించి కొన్ని ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం.

* 1983లో అక్బర్ అనే యువకుడు ఈ ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ ని హైదరాబాద్ నగరంలోని కాచిగూడ ప్రాంతంలో ఉన్న మహేశ్వరి థియేటర్ దగ్గర ఒక తోపుడు బండి పైన మొదలుపెట్టడం జరిగింది.

ADVERTISEMENT

* అలా మొదలుపెట్టినప్పుడు, ఆ బండి వద్ద బ్రెడ్ – ఆమ్లెట్ సింగల్ ప్లేట్ ధర రూ 1/- & ఫుల్ ప్లేట్ ధర రూ 2/- ఉండేది.  ప్రస్తుతం ఇక్కడ బ్రెడ్ – ఆమ్లెట్ సింగిల్ ప్లేట్ ధర రూ 20/- కాగా ఫుల్ ప్లేట్ ధర రూ 40/- గా ఉంది.

* ఇక ఈ ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ కాచిగూడ రైల్వే స్టేషన్ కి వెళ్లే సిగ్నల్ లో కాచిగూడ బిగ్ బజార్ కి ముందు ఉంటుంది.

* ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి సుమారు 10 గంటల వరకు ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ అందుబాటులో ఉంటుంది.

* ఈ ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ (famous bread-omelette center) కి జంట నగరాల్లో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మరి ముఖ్యంగా వారు ఏదైనా పని మీద సుల్తాన్ బజార్, కాచిగూడ లేదా నారాయణ గూడ వస్తే తప్పకుండా ఈ బ్రెడ్ – ఆమ్లెట్ రుచి చూడకుండా వెళ్లడం జరగదు.

ADVERTISEMENT

హైదరాబాద్ వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ ఖీర్ టేస్ట్ చేయండి..!

* ప్రస్తుతం అక్బర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారులు ఈ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ ని నిర్వహిస్తున్నారు. రోజు రోజుకి వీరి బిజినెస్ పెరుగుతుండడం విశేషం. దీనికి వారు తయారుచేసే బ్రెడ్  ఆమ్లెట్ ప్రత్యేకమైన రుచి కూడా కారణం అని చెప్పుకోవచ్చు. 

* ఇప్పటికి ఎన్ని ఫుడ్ యాప్స్ వంటివి ఎన్నో అందుబాటులోకి వచ్చినా సరే, నేరుగా ఈ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ వద్దకు వచ్చి ఈ ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ రుచి చూస్తేనే తప్ప దీని ప్రత్యేకత అర్ధం కాదు.

* వీరి బ్రెడ్ – ఆమ్లెట్ చేసే విధానం చాలా సాదాసీదాగానే ఉంటుంది, అయినప్పటికి కూడా రుచి చూస్తే మాత్రం ఏదో తెలియని ఒక మంచి పదార్దాన్ని రుచి చూసిన అనుభవం కలుగుతుంది.

ADVERTISEMENT

* ఇక ఈ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ నిర్వాహకులు మాట్లాడుతూ – తాము ఈ పదార్థం తయారికి ఉపయోగించే నూనె, బ్రెడ్ & గుడ్లు వంటివి వాటిలో ఎక్కడ కూడా నాణ్యత లోపించకుండా.. మంచి నాణ్యత కలిగిన వస్తువులనే వాడుతుంటాము.  దానివల్లే తమ సెంటర్ లో రుచి విభిన్నంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది.

* దాదాపు 37 ఏళ్ళుగా నిరాటకంగా కొనసాగుతున్న ఈ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ ప్రస్తుతం హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న ప్రముఖ ఫుడ్ సెంటర్ లలో ఒకటిగా మారిపోయింది. జంటనగర వాసుల్లో చాలామంది ఫేమస్ బ్రెడ్ -ఆమ్లెట్ సెంటర్ లేదా కాచిగూడ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ అని ఆంటే టక్కున అడ్రస్ తో సహా చెప్పేస్తారు. అంతగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ సెంటర్ ప్రాచుర్యం సంపాదించుకుంది. 

తెలుసుకున్నారుగా.. ఈ ఫెమసైనా ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ గురించి, ఇంకెందుకు ఆలస్యం మీకు వీలు చిక్కినప్పుడు ఈ ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ లో మంచి బ్రెడ్ – ఆమ్లెట్ ని రుచి చూసి వహ్వా అనండి.

హైదరాబాద్ కి షాన్.. “ఉస్మానియా బిస్కెట్స్” చరిత్ర మీకోసం…!

ADVERTISEMENT

 

31 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT