కృతి కర్బందా, పులకిత్ సమ్రాట్ తమ బంధం గురించి ఏం చెబుతున్నారంటే..

కృతి కర్బందా, పులకిత్ సమ్రాట్ తమ బంధం గురించి ఏం చెబుతున్నారంటే..

కృతి కర్బందా( kriti kharbanda).. పవన్ కల్యాణ్ నటించిన తీన్మార్ సినిమాతో పేరు సాధించిన ఈ అందాల నటి తెలుగులో ఒంగోలు గిత్త, బ్రూస్ లీ వంటి చిత్రాలతో మంచి పేరు సాధించింది. తాజాగా హిందీలో వరుస చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు సాధిస్తోందీ అందాల నటి. ఇటీవలే హౌస్ ఫుల్ 4 సినిమాలోనూ నటించి ఆకర్షించింది ఈ నటి. ప్రస్తుతం పులకిత్ సమ్రాట్ (pulkit samrat)సరసన నటించిన పాగల్ పంతీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఎప్పటి నుంచో పులకిత్ సమ్రాట్ తో తాను డేటింగ్ చేస్తున్నానని వస్తున్న వార్తలకు సమాధానం ఇచ్చింది కృతి. వీరిద్దరు గతంలో వీరే కీ వెడ్డింగ్ చిత్రంలో కలిసి నటించినప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి.

తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన పాగల్ పంతీ సినిమా నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మేం ఇద్దరం డేటింగ్ చేస్తున్నాం అని పుకార్లు పుట్టించేవాళ్లను నేను తప్పుబట్టలేను. మేమిద్దరం కలిసి ఉంటే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. మా ఇద్దరి మధ్యా మంచి కెమిస్ట్రీ కూడా ఉంది. ఇవన్నీ చూసి మేమిద్దరం డేటింగ్ చేస్తున్నాం అని ఎవరైనా అనుకుంటారు. వాళ్లను నేను తప్పుబట్టను. కానీ అది నిజం కాదు. పులకిత్ నాకెంతో ప్రత్యేకం. ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాడు కూడా. మేమిద్దరం చాలా క్లోజ్.. ఎంతగా అంటే మేమిద్దరం మాట్లాడుతుంటే ఒకరి మాటలు ఒకరు పూర్తి కాకముందే అర్థం చేసుకోగలుగుతాం. తను మనసులో ఏం ఆలోచిస్తున్నాడో కూడా నేను చెప్పగలను. మేమిద్దరం అంత క్లోజ్ అయ్యాం. అంత బాగా మాట్లాడుకుంటాం. ప్రస్తుతం మేమిద్దరం ఒకరికొకరు ఏం చెప్పుకోకపోయినా అర్థం చేసుకోగలుగుతాం. గత సంవత్సరంలో తను ఎంతగానో మారిపోయాడు. తను ప్రస్తుతం ఉన్న తీరును చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. తను ఎంతో మంచి వ్యక్తి. నాకో మంచి స్నేహితుడు. అంటూ చెప్పడం విశేషం.


సల్మాన్ సోదరి శ్వేతా రొహిరా ను పెళ్లాడిన పులకిత్.. పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నాడు. దీనికి నటి యామీ గౌతమ్ తో తన ఎఫైర్ కారణం అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత వీరే కీ వెడ్డింగ్ షూటింగ్ సమయంలో కలిసిన కృతి, పులకిత్ మధ్యలో స్నేహం మొదలైందట. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి చాలాసార్లు బయట కనిపించడం, ఒకరి స్నేహితులతో మరొకరు సమయం గడపడం, బాలీవుడ్ పార్టీల్లోనూ ఇద్దరూ కలిసి కనిపించడం వల్ల వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని వార్తలొచ్చాయి. దీనిపై పులకిత్ స్పందిస్తూ.. నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నట్లే ఉన్నాను. అయితే మధ్యలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల నాలో చాలా వరకూ మార్పు వచ్చింది. నా కష్టకాలంలో నా కుటుంబంతో పాటు కృతి నాకు తోడు నిలిచింది. నేను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కృతి కారణం అని వివరించాడు పులకిత్. ఇప్పుడు వారందరి వల్లే తాను ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నానంటూ చెప్పుకొచ్చాడీ హీరో.

వీరిద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడం మాత్రమే కాదు.. ఒకరి పుట్టిన రోజులకు, ప్రత్యేకమైన రోజులకు మరొకరు సోషల్ మీడియా ద్వారా విష్ చేసుకోవడం కూడా అభిమానులను వీరి మధ్యలో ఏదో ఉందని.. వీరు డేటింగ్ చేస్తున్నారని అనుకునేలా చేసింది. ఇటీవలే కృతి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె విష్ చేస్తూ మన మధ్య ఇంకా ఎన్నో క్రేజీ రిక్షా రైడ్స్, బౌలింగ్ పోటీలు, ఫుట్ బాల్ మ్యాచ్ లు, షూటింగ్స్ కావాలని కోరుకుంటున్నా అని పులకిత్ రాయడం విశేషం. దీంతో పాటు తన కోసం ప్రత్యేకంగా ఓ అద్భుతమైన సీ ఫుడ్ ఈటరీ లో డిన్నర్ టేబుల్ బుక్ చేశాడట. ఆమెతో పాటు తన స్నేహితులు, కజిన్స్ అక్కడికి చేరుకున్న తర్వాత పులకిత్ ఆమె కోసం స్పెషల్ గా పుట్టిన రోజు సర్ ప్రైజ్ ఏర్పాటు చేసిన విషయం తనకు తెలిసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పిందీ అందాల భామ. మరి, ఇది ప్రేమ కాకుండా మరొకటి అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? కానీ వీరిద్దరూ డేటింగ్ గురించి మాత్రం నర్మగర్భంగా వివరిస్తూ ఒకరికొకరు ప్రత్యేకం అని చెబుతున్నారే తప్ప.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? కేవలం మంచి స్నేహితులు మాత్రమేనా? అన్న విషయాన్ని మాత్రం బయటపెట్టకపోవడం విశేషం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.