ADVERTISEMENT
home / Humour
చిన్న విషయానికే మీకు ఏడుపు వచ్చేస్తుందా? అయితే ఇది మీ కోసమే..

చిన్న విషయానికే మీకు ఏడుపు వచ్చేస్తుందా? అయితే ఇది మీ కోసమే..

(Things Only Girls Who Cry Easily Will Understand)

భగవంతుడు మనకు ఇచ్చిన వరం.. మన ఫీలింగ్స్. నవ్వు, ఏడుపు, కోపం.. ఇలా ప్రతి సందర్భానికీ ఏదో ఒక ఎమోషన్ బయటకు చూపించగలగడమే నిజమైన జీవితం. కానీ మనలో కొందరు మాత్రం అస్సలు ఎందుకో తమ ఎమోషన్స్ బయటకు చూపించరు. మరికొందరేమో.. కాస్త ఎక్కువగానే ఎమోషనల్ అవుతారు. అందులో.. భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం అనేది ఎక్కువ మందికి వచ్చే ఎమోషన్. ఇక కొందరు చిన్న చిన్న విషయాలకే ఎమోషనల్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు తమ ఏడుపును కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు. కానీ చేసుకోలేరు. చిన్న చిన్న విషయాలకు కూడా కన్నీళ్లు తన్నుకొచ్చేస్తాయి. మీరూ ఇలాంటివారేనా? అయితే మేం ఇప్పుడు చెప్పే మాటలు వింటే.. మీరు తప్పకుండా ఫీలవుతారు.

1. కోపం కన్నీళ్లుగా మారి బయటకొస్తుంది..

ADVERTISEMENT

మీకు చాలా తొందరగా కోపం వస్తుంది. ఇలాంటప్పుడు చిరాకుతో పాటు ఏదో అసహనం కూడా మిమ్మల్ని లోలోపల నలిపేస్తుంది. దీంతో ఎంత వద్దనుకున్నా ఏడుపు తన్నుకువచ్చేస్తుంది. ఇలాంటప్పుడు ఎవరైనా మీతో ఏదైనా మాట్లాడితే చాలు.. వాళ్ల తల పగలగొట్టాలనిపిస్తుంది.

2. ప్రతి సందర్భానికి కన్నీళ్లు..

మీకు ప్రతి సందర్భానికి.. దానికి తగినట్లుగా కన్నీళ్లు వచ్చేస్తాయి. సంతోషకరమైన వార్త విన్నప్పుడు లేదా మనసుకు బాధనిపించే సంఘటన జరిగినప్పుడు.. అంతేకాదు ఏదైనా ఉద్వేగభరితమైన సన్నివేశం చూస్తున్నప్పుడు కూడా కన్నీళ్లు వాటంతట అవే వచ్చేస్తాయి. 

ADVERTISEMENT

3. “నువ్వు చాలా ఎక్కువ ఏడుస్తావ్” అనే మాట కామన్..

ఏడుపు అనేది మీ జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా మారిపోతుంది. అయితే ఆ కన్నీళ్లు మీకు మంచే చేస్తాయి. ఏడవడం వల్ల మీ మనసులోని బాధంతా.. ఒకేసారి కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్లిపోతుంది. అది ఒకరకంగా మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది.  అలాంటప్పుడు ఇతరులు మిమ్మల్ని ఏడవమని ఒంటరిగా వదిలేస్తారు. లేదా మీరు ఏడుపు ఆపేలా మిమ్మల్ని బుజ్జగిస్తారు. అయితే ఏది జరిగినా సరే.. ప్రతి ఒక్కరూ మీతో “నువ్వు చాలా ఎక్కువగా ఏడుస్తావు” అనే మాట అనడం మాత్రం కామన్.

4. సెండాఫ్‌లు అంత సులువేం కాదు..

మీ సన్నిహితులు ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారంటే.. మీకు కొన్ని రోజుల ముందు నుంచే బాధగా ఉంటుంది.  ఇక వారు వెళ్లే సమయానికి.. మీరు ఎంత వద్దనుకున్నా కన్నీళ్లు వాటంతట అవే తన్నుకు వచ్చేస్తాయి. కేవలం మీ సన్నిహితులు వెళ్లిపోతున్నప్పుడు మాత్రమే కాదు.. చాలా సంవత్సరాల తర్వాత నచ్చిన వారిని చూసినా మీకు కన్నీళ్లు వచ్చేస్తాయి.

ADVERTISEMENT

5. ఎక్కడైనా ఏడ్చేయగలరు..

చాలామంది ఎవరూ లేనప్పుడు లేదా తమకు నచ్చిన వ్యక్తుల మధ్య మాత్రమే ఏడవడానికి ఇష్టపడతారు. ఇతరులు ఉన్నప్పుడు తమ ఏడుపును కంట్రోల్ చేసుకుంటారు. కానీ మీరు మాత్రం.. మీ ఏడుపును ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేరు. పబ్లిక్ ప్రదేశాల్లోనూ ఏమాత్రం ఇబ్బంది లేకుండా, సిగ్గు పడకుండా ఏడ్చేయగలరు. మన ఫీలింగ్స్ బయటకు చూపించడంలో సిగ్గెందుకు..? అని కూడా చెబుతుంటారు.

6. వాటర్ ప్రూఫ్ మస్కారా మీ కోసమే..

ADVERTISEMENT

మీరు ఎప్పుడు ఏడుస్తారో మీకే తెలీదు. అందుకే వీలైనంత తక్కువ మేకప్ వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అందులోనూ వాటర్ ప్రూఫ్ మేకప్ అంటే మీకెంతో ఇష్టం. ముఖ్యంగా మస్కారా, ఐలైనర్ వంటి.. ఐ మేకప్ వాటర్ ప్రూఫ్ ఉండడం ఎంతో అవసరం.

7. కొన్ని అంశాలు మిమ్మల్ని ఏడిపించేస్తాయి..

వాట్సాప్‌లో ఫార్వార్డ్ అయిన ఓ వీడియో మిమ్మల్ని ఏడిపించేస్తుంది. బయట రోడ్డుపై గాయాలతో బాధపడే అందమైన బుజ్జి కుక్కపిల్లను చూస్తే దాని పరిస్థితి తలచుకొని.. మీరు కూడా కన్నీళ్లు (Tears) పెట్టుకుంటారు. ఇలా చాలా అంశాలకు మిమ్మల్ని ఏడిపించే వీలుంటుంది. కొన్ని సార్లు ఈ సంఘటనలను పదే పదే తలచుకొని కూడా.. మీరు ఏడుస్తుంటారు. ఆ ఏడుపును.. కంట్రోల్ కూడా చేసుకోలేరు.

ADVERTISEMENT

8. కన్నీళ్లు కంట్రోల్ అవ్వవు

మీరు ఎంతగా ప్రయత్నించినా సరే.. మీ ఎమోషన్స్ అస్సలు కంట్రోల్ అవ్వవు. అయితే దీని అర్థం.. మీరు మీ మనసులోని భావాలను దాచలేరని కాదు. మీ మనసులో ఎన్నో ఫీలింగ్స్ దాగి ఉంటాయి. వాటిని అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తుంటారు.

9. సినిమా చూసినా ఏడుపు కంట్రోల్ కాదు 

ADVERTISEMENT

అది రొమాంటిక్ అయినా.. లేక థ్రిల్లర్ అయినా.. సెంటిమెంటల్ సీన్ ఏ సినిమాలో వచ్చినా సరే.. మీరు కన్నీళ్లు పెట్టుకోవడం మాత్రం తప్పనిసరి. దానిని మీరు కంట్రోల్ చేసుకోలేరు.

10. స్నేహం చేయడంలో ముందుంటారు..

బాధలో ఉండడం అంటే ఏంటో మీకు తెలుసు. కాబట్టి ఆ బాధ ఇతరులకు వస్తే.. వారిని మీరు ఓదార్చడంలో ముందుంటారు. అంతేకాదు.. మీరు ఇతరులతో స్నేహం చేయడంలోనూ ముందుంటారు.

ADVERTISEMENT

11. గొడవ సమయంలోనూ కన్నీళ్లు వచ్చేస్తాయి..

మీరు మీ భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు.. అంతెందుకు… ఇంకెవరితోనైనా గొడవ పెట్టుకోవాల్సి వస్తే.. అటు గొడవ పెట్టుకుంటూనే ఇటు ఏడ్చేయడం మీకు అలవాటు. గొడవ సమయంలో మీకు కన్నీళ్లు ఆగవు. వారిని తిట్టాలి.. కొట్టాలి అనుకుంటారు. కానీ మీ కన్నీళ్ల వల్ల అవేవీ సాధ్యం కాదు.

12. చెడు విషయాలు చెప్పడానికి భయపడతారు.

ఏదైనా చెడు విషయం జరిగితే.. ఇతరులు మీకు చెప్పడానికి కాస్త ఆలోచిస్తారు. మరీ అవసరం అయితే తప్ప.. మీకు చెప్పరు. మీరు ఏడ్చేస్తారని వారికి తెలుసు. అదే మీరు ఉండగా.. ఇలాంటివి ఏవైనా జరిగితే అందరూ మిమ్మల్ని ఓదార్చేందుకు సిద్ధమైపోతారు. మీరు కూడా కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు. కానీ మీ కన్నీళ్లు మహా అయితే.. ఓ రెండు మూడు నిమిషాలు మాత్రమే కంట్రోల్ అవుతాయి.

ADVERTISEMENT

13. నువ్వెందుకు ఏడుస్తున్నావ్? అంటే సమాధానం?

మీ దగ్గర అన్ని ప్రశ్నలకు సమాధానం ఉండచ్చు. కానీ ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. ఒకవేళ ఉన్నా.. వారు ఆ ప్రశ్న అడిగే సమయానికే మీరు ఏడుస్తుంటారు కాబట్టి.. ఈ ప్రశ్న మిమ్మల్ని మరింత ఎక్కువగా ఏడిపిస్తుంది. కాబట్టి వారికి మీరు సమాధానం చెప్పలేరు. కొన్ని సార్లు మీరు ఎందుకు ఏడుస్తున్నారో.. కాసేపటికి మీరే మర్చిపోతారు. అయితే ఏడుపు మాత్రం ఆగదు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

18 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT