New Year Special : కొత్త సంవత్సరం వేళ చేసే.. ఇలాంటి విచిత్రమైన పనులను మీరు చూసుండరు !

New Year Special : కొత్త సంవత్సరం వేళ చేసే.. ఇలాంటి విచిత్రమైన పనులను మీరు చూసుండరు !

6 Weird Ways to Welcome New Year

న్యూ ఇయర్ వచ్చేస్తుందంటే చాలు. ఎన్నో కొత్త ఆలోచనలు,  కోరికలు,  ప్రణాళికలు.. మనల్ని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అదే సమయంలో.. మనం కూడా ఎంతో ఆసక్తితో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి రెడీ అవుతుంటాం. ఈ సందర్భంగా.. మనకు తోచిన రీతిలో ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటాం. డిసెంబర్ 31 తేదిన రాత్రి 12 గంటలైతే చాలు.. ఊరూ, వాడా.. అంతా సంబరాలలో మునిగి తేలుతుంది. ఇదే క్రమంలో మనకు నచ్చిన విధంగా మనం కూడా కొత్త ఏడాదికి ఆహ్వానం  పలికేస్తాం. 

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలంటే.. ఈ 15 బెస్ట్ స్పాట్స్‌‌కి వెళ్లాల్సిందే..!

కొంతమంది కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి చేసే సన్నాహాలు చాలా వెరైటీగా ఉండాలని భావిస్తారు. కానీ అవి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా లేదా అసహనానికి గురి చేయకుండా ఉంటే బెటర్. కానీ అందరూ అలాగే ఆలోచించరు కదా.  ఈ ప్రపంచంలో కొన్ని దేశాలలో.. చాలా అసహజమైన పద్దతుల ద్వారా కూడా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారట. ఇవి చాలా వెరైటీగా ఉన్నప్పటికీ.. కొన్ని ఎబ్బెట్టుగా కూడా ఉంటాయి.

అటువంటి అసహజమైన పద్దతులలో కొన్ని..

* పాత డైరీలని కాల్చేయడం

మనలో చాలామందికి తమ దినచర్య లేదా తమ జీవితంలో జరిగే సంఘటనలను వాటి ప్రాధాన్యతని బట్టి.. డైరీలో రాసుకోవడం అలవాటు.  అయితే అసహజమైన పద్దతిలో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే వారు.. తాము సంవత్సరం పొడుగునా రాసిన డైరీని డిసెంబర్ 31వ తేదిన కాల్చేస్తారట. అవును.. రాత్రంతా కూర్చుని తీరిగ్గా డైరీలోని ఒక్కో పేజీని చింపేసి.. వాటిని కాల్చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వారి వ్యక్తిగత రహస్యాలు బయటపడవని వారి నమ్మకం. అదే సమయంలో జరిగిపోయిన చెడుని మర్చిపోయి.. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కూడా ఈ చర్య సంకేతమని చెబుతుంటారు. 

* ప్రాంక్ కాల్స్ చేసి భయపెట్టడం

సాధారణంగా డిసెంబరు 31 తేదిన.. రాత్రి 12 అయిందంటే చాలు.. మన స్నేహితులకి లేదా బంధువులకి ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతుంటాం. అయితే కాస్త అసహజంగా ఆలోచించే వారికి.. ఇలా రొటీన్‌గా విషెస్ చెప్పడం ఇష్టముండదు. అందుకే ఏదో ఒక నంబర్ డయల్ చేసి.. వారిని భయానికి గురిచేస్తారు. లేదా ఏదో చెడు వార్తని వారి చెవిన పడేస్తారు. ఆ తర్వాత.. ఆ కాల్ మాట్లాడిన వారు భయపడడం చూసి వీరు ఆనందిస్తారట. 

* బైక్ లేదా కార్ టైర్ పంక్చర్ చేయడం

మనం ఉదయం లేవగానే ఏదైనా పని మీద బయటకి వెళ్లాలని భావిస్తాం. కానీ అదే సమయంలో మన వాహన టైర్ పంక్చర్ అయినట్లు తెలిస్తే.. చాలా చిరాగ్గా ఉంటుంది కదా. కానీ జనవరి 1వ తేదీన ఇలాంటి పనులు చేసి.. మనల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు రెడీగా ఉంటారు. కొన్ని దేశాలలో కొత్త సంవత్సరం వేళ..  తమకు తెలసిన  వారి బైక్స్ లేదా కార్లని టార్గెట్ చేస్తూ ఇలా పంక్చర్ చేయడం చాలా సాధారణమైన విషయమట. ఇలా చేసి ఇతరుల న్యూ ఇయర్ మూడ్‌ని పాడు చేయాలన్నది వీరి ప్రధాన ఉద్దేశ్యమట!

కొత్త సంవత్సరం వచ్చేస్తున్న వేళ.. మీరూ కొత్త నిర్ణయాలు తీసేసుకోండి..!

* వాలెట్‌ని దాచేయడం

న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా పార్టీలకి వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. కానీ పార్టీలోకి మన ప్రియమైన వారితో ఎంటరయ్యాక.. మన పాకెట్‌లో ఉండాల్సిన వాలెట్ కనపడకపోతే.. మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. న్యూ ఇయర్ సందర్భంగా తుంటరి పనులు చేసే వ్యక్తులు.. తమ స్నేహితులు ఇలా బయటికి వెళుతున్నప్పుడు వారికి తెలియకుండా వారి వాలెట్‌ని దాచేస్తుంటారు. ఆ తర్వాత వారు పడే ఇక్కట్లను చూసి మనసారా నవ్వుకుంటారు. 

* న్యూ ఇయర్ కేక్‌ని పాడు చేయడం

ఇది మరీ చీప్ ట్రిక్. న్యూ ఇయర్ అంటే ఠక్కున గుర్తొచ్చేది కేక్ ఒక్కటే. ప్రతి ఒక్కరు కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేస్తుంటారు. అందుకే రుచికరమైన కేకులకు ఆర్డర్ ఇస్తారు. కానీ న్యూ ఇయర్ సందర్భంగా కొందరు ఆకతాయిలు.. కేక్ తయారు చేసేటప్పుడు కావాలనే.. బేకింగ్ సోడాని ఎక్కువ మోతాదులో కలిపేస్తారట. దాంతో కేక్ రుచి చేదుగా మారిపోతుంది. ఇక రుచికరమైన కేక్‌ని ఆస్వాదించాలని భావించే వారి ఆశలన్నీ అడియాసలే అవుతుంటాయి. 

* న్యూ ఇయర్ గ్రీటింగ్ కాకుండా డెత్ యానివర్సరీ గ్రీటింగ్

ఇది మరీ టూ మచ్ పద్ధతి. న్యూ ఇయర్‌ని పురస్కరించుకుని చాలామంది స్నేహితులకు.. బంధువులకి గ్రీటింగ్ కార్డులను పంపిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం ఇలాంటి  గ్రీటింగ్స్‌ని పంపించే విషయంలో కూడా చాలా అసహజంగా ఆలోచిస్తారు. ఎదుటి వారిని ఆట పట్టించడానికి మామూలు గ్రీటింగ్ కార్డులకు బదులు.. డెత్ యానివర్సరీ కార్డులను మెయిల్ చేస్తారు. ఆ కార్డులను చూసాక ఎదుటి వారి రియాక్షన్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. 

చూశారా.. న్యూ ఇయర్ వేళ.. కొందరు ఆకతాయిలు చేసే చేష్టలు ఎంత విపరీతంగా ఉంటాయో. కనుక మీరూ పారా హుషార్..! 2020 లో మీరు ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం.

హైదరాబాద్‌లో క్రిస్మస్ & న్యూ ఇయర్ 'కేక్స్'కి.. ఈ బేకరీలు ప్రత్యేకం

Image: Pixabay