ADVERTISEMENT
home / Diet
అందంగా, ఆరోగ్యంగా మారిపోవాలా? అయితే డీటాక్స్ వాటర్ ప్రయత్నించి చూడండి..

అందంగా, ఆరోగ్యంగా మారిపోవాలా? అయితే డీటాక్స్ వాటర్ ప్రయత్నించి చూడండి..

అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోని వారెవరుంటారు? అయితే ఇందుకోసం మనం తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత జీవనశైలి వల్ల మనం తీసుకునే ఆహారం చాలా కలుషితమైపోతోంది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి ఎక్కువైపోయాయి. దీనివల్ల మన శరీరంలో టాక్సిన్లు పేరుకుపోయి..  ఎప్పుడూ అలసటగా అనిపించడం.. చర్మం కూడా కాంతివిహీనంగా మారిపోవడం లాంటి రుగ్మతల బారిన పడుతున్నాం. ఈ సమస్యలన్నింటినీ దూరం చేసుకోవడానికి మన శరీరాన్ని రెగ్యులర్‌గా డీటాక్సిఫై చేయాల్సి ఉంటుంది.

దీనివల్ల శరీరంలోని మలినాలు, టాక్సిన్లన్నీ తొలిగిపోతాయి. ముఖ్యంగా ఇన్‌ఫ్లమేషన్ తగ్గడంతో పాటు.. లివర్ కూడా పూర్తిగా శుభ్రం చేయబడి చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. ఇందుకోసం ఉపయోగపడేదే డీటాక్స్ వాటర్ (Detox water).. నీళ్లలోనే వివిధ రకాల ఆకులు లేదా పండ్లు కలిపి తయారుచేసే ఈ డీటాక్స్ వాటర్ వల్ల ప్రయోజనాలు (Benefits ) బోలెడన్ని.. అవేంటో మనమూ తెలుసుకుందాం..

డీటాక్స్ వాటర్ అంటే ఏంటి?

డీటాక్స్ వాటర్ చేసే ముఖ్యమైన పని.. మన శరీరాన్ని డీటాక్సిఫై చేసి మలినాలను తొలిగించడం. నిజం చెప్పాలంటే.. మన శరీరంలోని టాక్సిన్లు శరీరానికే  హానికరం. ఈ టాక్సిన్లు మనం తినే, తాగే అలవాట్లను ప్రభావితం చేస్తాయి. ఆలస్యంగా పడుకోవడం, వేగంగా నిద్ర లేవడం వంటి అలవాట్ల వల్ల ఇవి తయారవుతాయి. వీటిని తొలిగించడం అత్యవసరం. లేదంటే మన శరీరంలో  సమస్యలు రోజు రోజుకీ పెరిగిపోతాయి. కానీ డీటాక్స్ వాటర్ మనల్ని ఈ ముప్పు నుండి కాపాడుతుంది. డీటాక్స్ వాటర్‌ను రోజూ తాగడం వల్ల.. అన్ని రకాల టాక్సిన్లను దూరం చేసుకోవచ్చు. డీటాక్స్ వాటర్‌లో మన శరీరాన్ని శుభ్రం చేసే కొన్ని రకాల సహజ పదార్థాలను జోడిస్తారు. వీటిని రోజూ తీసుకోవడం వల్ల టాక్సిన్లన్నీ తొలిగిపోయి.. శరీరం ఆరోగ్యంగా మారుతుంది.

ADVERTISEMENT

డీటాక్స్ వాటర్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

సాధారణంగా మనం రాత్రి దాదాపు ఎనిమిది గంటల పాటు నిద్రలో ఉంటాం. ఈ సమయంలో ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు.. నీళ్లు కూడా తాగం. అందుకే డాక్టర్లు ఉదయం లేవగానే నీళ్లు తాగాలని చెబుతుంటారు. అయితే మామూలు నీళ్ల కంటే.. ఈ సమయంలో డీటాక్స్ వాటర్ తాగడం వల్ల.. మరెన్నో అద్భుతమైన ఫలితాలు పొందే వీలుంటుంది. ఉదయాన్నే ఈ నీళ్లను తాగడం వల్ల మనం శక్తిని ఎక్కువగా పొందడం మాత్రమే కాదు.. బరువు కూడా తగ్గే వీలుంటుంది. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..

బరువు తగ్గడం..

సాధారణంగా శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వల్ల.. బరువు వేగంగా తగ్గే వీలుంటుందని వైద్యులు చెబుతుంటారు. మామూలు నీళ్లకు బదులు డీటాక్స్ వాటర్ తాగడం వల్ల టాక్సిన్లు  తగ్గుముఖం పట్టి..  బరువు తగ్గే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. ఈ నీళ్లు శరీర మెటబాలిజాన్ని పెంచుతాయి. అలాగే క్యాలరీలను వేగంగా కరిగేలా చేస్తాయి. రోజంతా ఎలాంటి ఇబ్బందీ లేకుండా లైట్‌గా ఫీలయ్యేలా మనల్ని సిద్ధం చేస్తాయి. ద్రాక్ష వంటి పండ్లలో ఉండే ఎంజైమ్స్.. శరీరాన్ని చక్కెరలు ఉపయోగించుకునేలా చేసి మెటబాలిక్ రేటును పెంచుతాయి. తద్వారా బరువు తగ్గుతుంది.

ADVERTISEMENT

జీర్ణశక్తి మెరుగుపడుతుంది

మన శరీరంలో జీర్ణక్రియ వేగంగా జరగాలంటే.. తగినన్ని నీళ్లు అవసరమన్న విషయం మనకు తెలిసిందే. ఈ నీళ్లు మన జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలు ఎదురు కాకుండా చూస్తాయి. నిమ్మరసం వంటి వాటితో చేసిన డీటాక్స్ వాటర్‌లో.. ఆస్కార్బిక్ ఆమ్లం ఉండడం వల్ల మన జీర్ణ క్రియ ఆరోగ్యంగా కొనసాగుతుంది. అలాగే.. ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల.. మన ఆహారంలోని వ్యర్థ పదార్థాలు శరీరం నుంచి వేగంగా బయటకు వెళ్లిపోతాయి.

రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది..

శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే వ్యాధులు మనల్ని సులువుగా దరిచేరవు. అందుకే డీటాక్స్ వాటర్‌ను తాగుతూ రోగ నిరోధక వ్యవస్థను బలంగా మార్చుకోవాలి. పండ్లు, కూరగాయలు రోగ నిరోధక శక్తిని బలంగా మారుస్తాయి. ముఖ్యంగా ‘విటమిన్ సి’ ఉత్పత్తులను తరచూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. డీటాక్స్ వాటర్.. మన శరీరంలోని టాక్సిన్లు, వ్యర్థ పదార్థాలు, ఫ్రీ రాడికల్స్‌ని తొలిగించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

లివర్ నుండి టాక్సిన్లను తొలగిస్తాయి.

మన శరీరంలో లివర్ (కాలేయం) చేసే పని ఏమిటో తెలుసా ? శరీర వ్యవస్థలన్నింటినీ శుభ్రపరిచి  వ్యర్థ పదార్థాలు, టాక్సిన్లు, ఫ్రీ రాడికల్స్ మొదలైనవాటిని పారద్రోలడం.  కానీ నేడు అనేకమంది ప్రస్తుత జీవనశైలి కారణంగా ఎన్నో చెడు అలవాట్లకు బానిసలైపోయారు. తినే ఆహారం నుంచి జీవించే విధానం వరకూ ప్రతి ఒక్కటి.. మన శరీరంలో టాక్సిన్లకు చోటు కల్పిస్తూ.. లివర్ పై ఒత్తిడిని పెంచుతున్నాయి. లివర్‌ని టాక్సిన్ల నుంచి దూరంగా ఉంచడం.. అలాగే రెగ్యులర్‌గా ఈ టాక్సిన్లను తొలిగించడం ఎంతో అవసరం. ఈ డీటాక్స్ వాటర్ మన శరీరం నుంచి టాక్సిన్లను తొలగిస్తుంది.

ADVERTISEMENT

దీనివల్ల మనం తీసుకున్న ఆహారం, జీవన శైలి వల్ల శరీరం పై పడిన ప్రభావం చాలా వరకూ తగ్గుతుంది. ముఖ్యంగా కీర దోస, నిమ్మరసం పిండిన డీటాక్స్ వాటర్ వల్ల.. లివర్ చాలా వేగంగా శుభ్రపడి మలినాలు బయటకు వెళ్లిపోతాయి. రోజూ డీటాక్స్ వాటర్ తాగిన వారి లివర్.. మిగిలిన వారితో పోల్చితే ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని చాలా పరిశోధనల్లో తేలింది.

శక్తి స్థాయులు పెరుగుతాయి.

మన శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల.. మన మూడ్ పై, మన ఎనర్జీ లెవెల్స్ పై ఎంతో ప్రభావం పడుతుంది. అంతేకాదు.. అప్పుడప్పుడూ తల నొప్పి కూడా వస్తుంటుంది. డీటాక్స్ వాటర్ తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో వాపులు, నీరు పేరుకుపోవడం వంటి రుగ్మతలన్నీ తగ్గుతాయి. ఇది లివర్‌ని కూడా శుభ్రం చేస్తుంది కాబట్టి.. అది శక్తివంతంగా మారే వీలుంటుంది. రోజూ ఉదయాన్నే ఈ నీటిని తీసుకోవడం వల్ల.. రోజంతా ఫ్రెష్‌గా, లైట్‌గా అనిపిస్తుంది. అలాగే రోజంతా చాలా ఎనర్జిటిక్‌గా కూడా ఉంటారు.

డీటాక్స్ వాటర్ వల్ల సౌందర్య ప్రయోజనాలు

కేవలం ఆరోగ్య పరంగానే కాదు.. చర్మం అందంగా మెరిసేందుకు కూడా డీటాక్స్ వాటర్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. డీటాక్స్ వాటర్ తీసుకోవడం ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే.. చర్మంలో ఓ విభిన్నమైన మెరుపును గమనించవచ్చు. దీనివల్ల ఉన్న మరిన్ని ప్రయోజనాలేంటంటే..

ADVERTISEMENT

చర్మాన్ని యవ్వనంగా మెరిసేలా చేస్తుంది.

రోజూ డీటాక్స్ వాటర్ తాగడం వల్ల.. చర్మం చాలా యూత్ ఫుల్‌గా కనిపిస్తుంది. చర్మంలోని మలినాలన్నీ తొలగిపోవడం వల్ల ముడతలు తగ్గి మనం కూడా యంగ్‌గా కనిపిస్తాం.

చర్మం బిగుతుగా మారుస్తుంది.

కొంత వయసు వచ్చిన తర్వాత.. చాలా మందికి ఎదురయ్యే సమస్య చర్మం వదులుగా మారిపోవడం. అయితే డీటాక్స్ వాటర్‌ని రోజూ తాగడం వల్ల.. మీ ముఖంపై వయసు ఛాయలు కనిపించవు. మీ ముఖం పై ఉన్న చర్మం మాత్రమే కాదు.. శరీరమంతా కూడా  చర్మం బిగుతుగా మారి మెరుస్తూ ఉంటుంది.

యాంటీ ఏజింగ్

విటమిన్ సి ఎక్కువగా ఉన్న డీటాక్స్ వాటర్ రోజూ తీసుకోవడం వల్ల.. చర్మం పొడిబారిపోకుండా ఉంటుంది. విటమిన్ సి టాక్సిన్లను తొలగించడంతో పాటు చర్మం పొరలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మంపై ఉన్న మలినాలన్నీ తొలగించి ముడతలు పడకుండా చూస్తుంది.

ADVERTISEMENT

చర్మ ఛాయను పెంచుతుంది.

చర్మం ఆరోగ్యంగా మారి.. తెల్లగా మెరిసిపోవాలని చాలామంది కోరుకుంటారు. దీనికోసం బ్యూటీ పార్లర్‌లలో చికిత్సలు కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ రోజూ డీటాక్స్ వాటర్ తాగడం వల్ల.. ఇలాంటివి అవసరం లేకుండానే మీ చర్మం రంగు మారుతుంది. ట్యాన్, నల్ల మచ్చలు వంటివన్నీ తొలగిపోయి మీ చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

మొటిమలు, మచ్చలు తగ్గిస్తుంది.

చర్మంపై మురికి, టాక్సిన్లు, మలినాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల.. చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి తయారవుతాయి. ఇవి కొన్నాళ్లకు తగ్గినా.. నల్లని మచ్చలు అలాగే ఉండిపోతాయి. అయితే డీటాక్స్ వాటర్‌ని తరచూ తాగడం వల్ల.. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. ఇవి టాక్సిన్లను కూడా దూరం చేస్తాయి. తద్వారా ముఖంపైనే కాదు.. చర్మంపై కూడా ఎక్కడా మొటిమలు రాకుండా ఉంటాయి. అలాగే మచ్చలను కూడా తగ్గించుకోవచ్చు.

ADVERTISEMENT

డీటాక్స్ వాటర్ తయారీ విధానం

డీటాక్స్ వాటర్‌ను కొనుగోలు చేసి మాత్రమే తాగాలని రూలేమీ లేదు.  దీనిని  ఇంట్లో కూడా సులువుగా తయారుచేసుకునే వీలుంంది. అయితే అందుకు మంచి నీళ్లతో పాటు కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, హెర్బ్స్ కావాల్సి ఉంటుంది. డీటాక్స్ వాటర్‌ని మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం రండి..

మామూలుగా డీటాక్స్ వాటర్ తయారు చేయాలంటే కావాల్సిన వస్తువులు రెండు. అందులో ఒకటి.. మనకు నచ్చిన పండ్లు, కూరగాయలు, లేదా హెర్బ్స్. వీటిని శుభ్రంగా కడుక్కొని.. కావాలంటే ముక్కలు కట్ చేసుకోని పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని వేడి లేదా చల్లని నీటితో కలుపుకోవాలి. వేడి నీళ్లు అయితే.. ముందుగానే నీటిని వేడి చేసుకొని పదార్థాలను కలుపుకోవాలి. చల్లని నీరు కావాలంటే.. ఇవన్నీ కలిపిన తర్వాత.. ఒకటి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో పెడితే సరిపోతుంది.

నిమ్మరసం, కీర దోసతో..

కావాల్సినవి
నిమ్మకాయ – ఒకటి
కీర దోస – ఒకటి

ADVERTISEMENT

తయారీ
ముందుగా నిమ్మ కాయను సన్నని స్లైసుల్లా కట్ చేసుకోవాలి. తర్వాత దాని రసాన్ని తీసి పెట్టకోవచ్చు. కీర దోసను కూడా సన్నని చక్రాల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ రెండిటినీ నీటిలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కావాలంటే.. కొన్ని పుదీనా ఆకులను కూడా కలుపుకోవచ్చు. పుదీనాతో దీనిని మిక్స్ చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. ఇవన్నీ వేసి ఫ్రిజ్‌లో పెట్టి.. రెండు మూడు గంటల తర్వాత తాగాలి. ఇందులో ఉప్పు, చక్కెర అస్సలు వాడకూడదు.

ప్రయోజనాలు
నిమ్మకాయల్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు.. అందంగా మెరిసేలా చేస్తుంది. కాలుష్యం వల్ల మన చర్మంతో పాటు.. శరీరంలోకి చేరిన మలినాలను తొలగిస్తుంది. కీర దోస లివర్‌ని శుభ్రం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది.

వివిధ రకాల హెర్బ్స్ తో..

కావాల్సినవి
నీళ్లు – లీటర్
తులసి, రోజ్ మేరీ, థైమ్, పుదీనా ఆకులు – ఒక్కొక్కటి రెండు రెబ్బలు

ADVERTISEMENT

తయారీ
ఈ ఆకులన్నింటినీ బాగా శుభ్రం చేసి కాడల నుంచి తొలగించి.. ఆ తర్వాత కాస్త నలిపినట్లుగా చేసి నీటిలో వేయాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి ఆరు గంటల పాటు చల్లబడనివ్వాలి. ఆపై ఈ నీటిని వడకట్టి తాగవచ్చు.

ప్రయోజనాలు
ఎప్పుడూ పండ్లతో తయారుచేసిన నీళ్లు తాగడం వల్ల.. బోర్ కొట్టిన వారికి ఇది కొత్త రుచిని అందిస్తుంది. తులసి, పుదీనా, రోజ్ మేరీలు కలిసి ఓ విభిన్నమైన రుచిని జోడిస్తాయి. పైగా వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని మెరిసేలా చేసి శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తాయి.

ద్రాక్ష, నిమ్మ కాయ..

కావాల్సినవి
నల్ల ద్రాక్ష – పదిహేను
నిమ్మరసం – ఒకటి
నీళ్లు – లీటర్

ADVERTISEMENT

తయారీ
నిమ్మ కాయను సన్నని స్లైసులుగా కట్ చేసుకోవాలి. అలాగే ద్రాక్ష పండ్లను కూడా మధ్యలోకి కట్ చేసి గింజలుంటే తీసేయాలి. ఇప్పుడు ఈ రెండింటినీ నీటితో నిండిన జార్‌లో పోసి గంట సేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత నేరుగా తాగేయొచ్చు.

ప్రయోజనాలు
నిమ్మరసంలోని గుణాలు మన లివర్‌ని శుభ్రం చేయడంతో పాటు.. చర్మాన్ని మెరిపిస్తాయి. ద్రాక్ష మంచి రుచిని అందించడంతో పాటు యవ్వనంగా మెరిసేలా చేస్తుంది.

గులాబీ రెక్కలు, సోంపుతో..

కావాల్సినవి
గులాబీ రెక్కలు – ఇరవై
సోంపు – రెండు టీస్పూన్లు
నీళ్లు – ఒక లీటర్

ADVERTISEMENT

తయారీ
ముందుగా నీళ్లను ఓ గాజు గ్లాసులో పోసి.. అందులో గులాబీ రెక్కలు, సోంపు వేసి ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇలా కొన్ని గంటలు ఉంచిన తర్వాత తీసి.. అలాగే తాగేయొచ్చు.

ప్రయోజనాలు
గులాబీ రెక్కలు ఒత్తిడిని తగ్గిస్తాయి. మూడ్ ని ఆహ్లాదంగా మార్చడంతో పాటు జీర్ణక్రియను కూడా వేగంగా మారుస్తాయి. సోంపు గింజలు జీర్ఱ క్రియను వేగవంతం చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, కార్డియో ప్రొటెక్టివ్, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

నారింజ, అల్లం..

కావాల్సినవి
అల్లం – చిన్న ముక్క (తురుముకోవాలి)
నారింజ ముక్కలు – పదిహేను
నీళ్లు – లీటర్

ADVERTISEMENT

తయారీ
ముందుగా అల్లాన్ని సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. నారింజ తొనలను కూడా.. మీదున్న చర్మాన్ని తొలగించి చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. ఈ రెండింటినీ లీటర్ నీటిలో వేసి బాగా కలిపి.. రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఆ తర్వాత అలాగే తాగేయాలి.

ప్రయోజనాలు
నారింజ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు.. డీఎన్ఏ డ్యామేజ్‌ని కూడా తగ్గిస్తుంది. అందుకే ఈ రెండూ కలిపిన డీటాక్స్ వాటర్ తాగడం వల్ల..  వ్యాధులను నివారించవచ్చు.

తులసి, పండ్లు కలిపి..

కావాల్సినవి
మామిడి లేదా బత్తాయి ముక్కలు – పది
తులసి ఆకులు – పది
నీళ్లు – లీటర్

ADVERTISEMENT

తయారీ
తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పండ్ల ముక్కలను.. నీటిలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత తులసి ఆకులను కాస్త నలిపినట్లుగా చేసి వేసుకోవాలి. తర్వాత ఈ నీటిని ఫ్రిజ్‌లో పెట్టుకొని.. గంట పాటు ఉంచి తీసి తాగవచ్చు.

ప్రయోజనాలు
మామిడి, నారింజ, బత్తాయి, స్ట్రాబెర్రీ వంటి పండ్లు.. మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా తోడ్పడతాయి. అంతేకాదు ఇవి మన రక్తపోటును అదుపులో ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఇన్సులిన్ సమస్య ఉన్నవారు కూడా వీటిని తీసుకోవచ్చు. ఇక తులసి ఆకుల్లో ఎన్నో రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరం నుంచి టాక్సిన్లను దూరం చేయడంతో పాటు.. క్యాన్సర్ సెల్స్‌ని నాశనం చేయడంలో కూడా తోడ్పడతాయి.

తరచూ అడిగే ప్రశ్నలు

ADVERTISEMENT

1. డీటాక్స్ వాటర్ శరీరంలోని వాపును ఎలా తగ్గిస్తుంది?

వాటర్ రిటెన్షన్ సమస్య ఎక్కువగా ఉన్నవారిలో పాదాలలో వాపు.. నీరు పట్టడం లాంటి సమస్యలను గమనిస్తుంటాం. కొన్ని సార్లు సమస్య తీవ్రంగా ఉంటే చేతులు కూడా వాస్తాయి. ఇలాంటి వారు కీర దోస, స్ట్రాబెర్రీలు మిక్స్ చేసిన డీటాక్స్ వాటర్‌ని రోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా రోజూ తీసుకోవడం వల్ల.. వారి శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోవడం మాత్రమే కాదు.. వాపుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

2. డీటాక్స్ వాటర్‌ని ఎలాంటివారు తీసుకోకూడదు?

డీటాక్స్ వాటర్ అన్నది సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిందే కాబట్టి.. దాదాపు అందరూ దీన్ని తీసుకోవచ్చు. అంతేకాదు.. ఈ వాటర్ సాధారణమైన నీటికి కొన్ని పండ్లు, కూరగాయల మిశ్రమాన్ని కలపడం వల్ల తయారయ్యే ద్రవం మాత్రమే. మామూలు నీళ్లు తాగడం వల్ల కూడా డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. కానీ  డీటాక్స్ వాటర్ వల్ల ఈ ప్రక్రియ వేగవంతం అవడంతో పాటు.. నీళ్లు తాగడం బోర్ కొట్టదు. అంతేకాకుండా ఆయా పండ్లు, కూరగాయల్లోని విటమిన్లు, మినరల్స్ అన్నీ మన శరీరానికి లభిస్తాయి.

3. బరువు తగ్గించడంలో,, డీటాక్స్ వాటర్ ఎంత వరకూ పని చేస్తుంది?

నిమ్మరసంలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరం నుండి టాక్సిన్లను తొలిగించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు.. బరువు తగ్గించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు కివీ, స్ట్రాబెర్రీలలో కూడా ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ మూడు కలిపి తయారుచేసిన డీటాక్స్ వాటర్‌ను రోజూ తాగడం వల్ల.. మెటబాలిజం పెరగడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది.

4. డీటాక్స్ వాటర్‌ని ఎప్పుడు తాగాలి? దానికి ఆహారానికి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి?

సాధారణంగా డీటాక్స్ వాటర్‌ని ..రోజూ ఉదయాన్నే నిద్ర లేవగానే తాగడం మంచిది. నిద్ర లేవగానే మన పొట్ట ఖాళీగా ఉండడం వల్ల.. డీటాక్స్ వాటర్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లను మన శరీరం వేగంగా తీసుకునే వీలుంటుంది. డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత.. కనీసం అరగంట గ్యాప్ ఇచ్చి ఆహారం తీసుకోవడం వల్ల.. శరీరానికి పోషకాలు అందడంతో పాటు టాక్సిన్లన్నీ తొలగిపోయే వీలుంటుంది.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

02 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT