16 డిసెంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

16 డిసెంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (16 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) - ఈ రోజు ఆలుమగల మధ్య సంబంధాలు పటిష్టంగా మారతాయి. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో పనులు పూర్తవుతాయి. అలాగే పలు వివాదాస్పద కార్యకలాపాలకు దూరంగా ఉండండి. రాజకీయ నాయకులకు అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.

వృషభం (Tarus) - మీరు ఈ రోజు అజాగ్రత్త కారణంగా.. మంచి అవకాశాలను కోల్పోతారు. అలాగే ఆఫీసులో సీనియర్ల నుండి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో  కోపాన్ని నియంత్రించుకోండి. ప్రత్యర్థులు మిమ్మల్ని బహిరంగంగా సవాలు చేస్తారు. 

మిథునం (Gemini) - ఈ రోజు వ్యాపారస్తులు పలు లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లను స్వీకరించే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విదేశీ యాత్రలను ప్లాన్ చేస్తారు. అలాగే పాత స్నేహితులను కలుస్తారు. 

కర్కాటకం (Cancer) - ఈ రోజు ఆఫీసుకు సంబంధించిన వర్క్ షాపులు లేదా సెమినార్లలో పాల్గొంటారు. అలాగే సీనియర్‌లతో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అజాగ్రత్త కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వివాదాస్పద కార్యకలాపాలకు దూరంగా ఉండండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) - ఈ రోజు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. అలాగే ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహితులకు సులభ ధనయోగం ఉంటుంది. 

క‌న్య (Virgo) - ఈ రోజు మీరు సంతోషకరమైన వార్తలను వింటారు. అలాగే కుటుంబంలో ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీ జీవిత భాగస్వామితో ఉత్తమ క్షణాలను గడుపుతారు. అదేవిధంగా సామాజిక సంస్థల నుండి గౌరవాన్ని పొందుతారు.

'డిసెంబరు' నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా 'ప్రత్యేకం' : ఎందుకో తెలుసా..?

తుల (Libra) - ఈ రోజు మీరు శుభవార్తలు వింటారు. అలాగే వ్యాపారంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

వృశ్చికం (Scorpio) - ఈ రోజు మీరు విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది. అలాగే వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాలలో అనుకోని ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరితో ఒకరు నిజాయతీగా ఉండడం మంచిది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు వాణిజ్య విస్తరణకు ప్రణాళికలు రచిస్తారు. అలాగే అనుకోని సందర్భాలలో స్నేహితుల నుండి ప్రయోజనం పొందుతారు. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త వహించండి.

మకరం (Capricorn) -  ఈ రోజు మీకు తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులు తలకు మించిన  బాధ్యతలు స్వీకరిస్తారు. అదేవిధంగా మీ నిర్మాణాత్మక పనిలో పురోగతి ఉంటుంది.

కుంభం (Aquarius) - ఈ రోజు మీరు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. అలాగే సోమరితనాన్ని వీడాల్సిన అవసరం ఉంది. అత్యుత్సాహం అనవసరమైన సమస్యలను సృష్టిస్తుంది. దూర ప్రయాణాలకు స్వస్తి పలకండి. మీ వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.

మీనం (Pisces) - ఈ రోజు మీరు పలు శుభవార్తలు వింటారు. అలాగే వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. మీ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులు మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. సరికొత్త ఆర్థిక వనరులు వ్యాపారానికి ప్రయోజనం చేకూరుస్తాయి. స్నేహితుల నుండి ఖరీదైన బహుమతులు పొందుతారు.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.


ఇక ఇంగ్లీష్హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.