19 డిసెంబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

19 డిసెంబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (19 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) -  ఈ రోజు మీ ప్రేమికులు అనుకోని చిక్కులలో పడతారు. అలాగే మీ తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. పోటీ పరీక్షలలో విద్యార్థులు కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు.

వృషభం (Tarus) -  ఈ రోజు మహిళలకు  కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. అలాగే ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు కొత్త వాణిజ్య ఒప్పందాల ద్వారా ప్రయోజనం పొందుతారు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.

మిథునం (Gemini) - ఈ రోజు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. మీ ప్రవర్తన కొందరికి బాధను కలిగించవచ్చు. అదేవిధంగా అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండండి. వివాహితులు పలు శుభవార్తలు వింటారు. 

కర్కాటకం (Cancer) -  ఈ రోజు మీరు మీ పాత మిత్రులను కలుస్తారు. అలాగే కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. కోర్టు కేసులు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వివాహితులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పరీక్షలలలో.. అలాగే నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) -  ఈ రోజు మీరు వృత్తి జీవితంలో అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే వ్యాపార ఒప్పందాలు రద్దు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాలలో మీరు అప్రమత్తంగా ఉండాలి. అలాగే కోర్టు కేసులు, ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. 

క‌న్య (Virgo) - ఈ రోజు మీరు అనుకోని ఇబ్బందులలో పడతారు. వివాహితులు పలు శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. మీ ప్రత్యర్థులు తమ ఓటమిని అంగీకరిస్తారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. 

'డిసెంబరు' నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా 'ప్రత్యేకం' : ఎందుకో తెలుసా..?

తుల (Libra) - ఈ రోజు మీకు ఆఫీసులో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. అలాగే కొత్త వాణిజ్య ఒప్పందాలు రద్దు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. ఆర్థిక విషయాలలో మీకు మీ జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. 

వృశ్చికం (Scorpio) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాగే ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు అనుకోని ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు మీరు అనుకోని ప్రేమ వ్యవహారాలలో చిక్కుకుంటారు. అలాగే వివాహితులు తమ  భాగస్వామితో సంబంధాలను మెరుగుపరచుకుంటారు. కొన్ని విషయాలలో మీకు మీ సోదరుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు సీనియర్ల సహకారం లభిస్తుంది. 

మకరం (Capricorn) -  ఈ రోజు విద్యార్థులు అనుకోని అవకాశాలను పొందుతారు. అలాగే యువతకు మంచి ఉద్యోగ ఆఫర్లు లభిస్తాయి. ప్రత్యర్థులతో మీ విభేదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. కొన్ని విషయాలలో అనుభవజ్ఞుల సలహాలను తీసుకోండి. రాజకీయ నాయకులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు.

కుంభం (Aquarius) -  ఈ రోజు మీరు వ్యాపార విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి. అలాగే వివాహితులకు కుటుంబ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా పనికిరాని వాదనలకు దూరంగా ఉండడం మంచిది. 

మీనం (Pisces) - ఈ రోజు మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అలాగే అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. వివాహితుల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.


ఇక ఇంగ్లీష్హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.