23 డిసెంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు మీకోసం)

23 డిసెంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు మీకోసం)

ఈ రోజు (23 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) - ఈ రోజు మీకు మీ తోబుట్టువులతో సంబంధాలు మరింత పటిష్టమవుతాయి. మీ కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. వృత్తిపరమైన భాగస్వామ్యాలు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఆఫీసులో సీనియర్ల నుండి మద్దతు ఉంటుంది. రాజకీయాల్లో క్రియాశీలత పెరుగుతుంది.

వృషభం (Tarus) - ఈ రోజు కొత్త వాణిజ్య  ఒప్పందాలు పూర్తవుతాయి. రాజకీయ రంగంలోని వ్యక్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.  వివాహితులకు భాగస్వామి మద్దతు ఉంటుంది. అలాగే దూర ప్రాంతాలను సందర్శిస్తారు.

మిథునం (Gemini) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విలువైన వస్తువులను పోగొట్టుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వాహనాల నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా జీవిత భాగస్వామితో కలిసి పలు శుభకార్యాలలో పాల్గొంటారు.

కర్కాటకం (Cancer) -  ఈ రోజు  మీ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులు వాదనలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) - ఈ రోజు మీకు మీ భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే ప్రేమికుల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు కొన్ని నిరాశాజనకమైన వార్తలు వింటారు. అలాగే అపరిచితుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆఫీసులో సీనియర్‌లతో అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. 

క‌న్య (Virgo) -  ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలు వింటారు. అలాగే ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలో పురోగతి ఉంటుంది. కొత్తగా వాణిజ్య రంగంలోకి అడుగుపెట్టేవారికి.. వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. 

'డిసెంబరు' నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా 'ప్రత్యేకం' : ఎందుకో తెలుసా..?

తుల (Libra) - ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ఆహారపు అలవాట్ల విషయంలో శ్రద్ధ తీసుకోండి. వివాహితులు కొన్ని అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల.. కుటుంబంలో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. అపరిచితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 

వృశ్చికం (Scorpio) - మీ పరిసరాలు ఈ రోజు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. అలాగే కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. తల్లిదండ్రులకు పిల్లల బాధ్యత నెరవేరుతుంది. వ్యాపారస్తులు రాజకీయ ప్రయోజనాలను పొందుతారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలో పురోగతి ఉంటుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు విద్యార్థులు నిర్లక్ష్యాన్ని వీడాలి. లేకపోతే అనుకోని ఇబ్బందులలో పడతారు. అలాగే వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు కొన్ని విషయాలలో.. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు వెళ్లాలి. 

మకరం (Capricorn) -  ఈ రోజు మీరు అనుకోని సమస్యలలో చిక్కుకుంటారు. అలాగే వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. వివాహితులు పలు శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. అలాగే జీవిత భాగస్వామితో.. మీ సంబంధాలు మెరుగుపడతాయి. 

కుంభం (Aquarius) - ఈ రోజు మీరు అజాగ్రత్త కారణంగా.. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో  సీనియర్‌లతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వ్యాపారస్తులకు ఆర్థిక నష్టం కలుగుతుంది. నిరుద్యోగులు ఆశాజనకమైన ఫలితాలు రాకపోయినా.. ఆశావాదంతో ముందుకు వెళ్లాలి. 

మీనం (Pisces) - ఈ రోజు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. అలాగే వివాహితులు తమ భాగస్వామి దగ్గర కొన్ని విషయాలను దాపరికం లేకుండా చెప్పేయడమే మేలు. లేదంటే భవిష్యత్తులో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. అలాగే నిరుద్యోగులు తమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి.. ఇదే సరైన సమయం. 


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.


ఇక ఇంగ్లీష్హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు