26 డిసెంబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

26 డిసెంబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (26 డిసెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు మీరు మీ  ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే వ్యాపారస్తులు నూతన ఒప్పందాలు చేసుకొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అలాగే వివాహితులు అనుకోని సమస్యలను ఎదుర్కొంటారు. అవి మీ సహనాన్ని పరీక్షించవచ్చు.  విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల పట్ల ఆసక్తి చూపిస్తారు.

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు మీరు దూర ప్రయాణలు చేసే అవకాశం ఉంది. అలాగే  ఉద్యోగస్తులకు ఆఫీసు పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అయితే అక్కరకు రాని స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

మిథున రాశి (Gemini) – ఈ రోజు ప్రేమికుల సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ ప్రవర్తన కొందరిని బాధపెట్టే అవకాశం ఉంది. అలాగే ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యత ఉంటుంది. రాజకీయ నాయకులకు అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. 

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. మీ భాగస్వామి సలహాలు కూడా తీసుకోండి. ఆఫీసులో ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరగవచ్చు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

సింహ రాశి (Leo) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అలాగే నూతన ఒప్పందాలను చేసుకుంటారు. వివాహితులు ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి.  

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో తెలియజేయడానికి ఇదే సరైన సమయం. అలాగే బాధలో ఉన్నప్పుడు.. మిత్రులు చెప్పే మాటలు మీకు ఉపశమనం కలిగిస్తాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

తుల రాశి (Libra) – ఈ రోజు వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులు తమ నిర్లక్ష్యం కారణంగా కొన్ని పనులను వాయిదా వేసుకుంటారు. ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం మంచిది. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే నిరుద్యోగుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులకు తమ భాగస్వామ్యంలో కొంత అస్థిరత ఏర్పడుతుంది. కొన్ని విషయాలలో.. ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. అవివాహితులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. 

ధను రాశి (Saggitarius) - ఈ రోజు ప్రేమికులకు శుభదినం. తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులకు ముఖ్య ఒప్పందాలు రద్దయ్యే అవకాశం ఉంది. అలాగే అధిక శ్రమ కారణంగా.. శారీరక ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.  మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. కొన్ని విషయాలలో కోపాన్ని నియంత్రించుకోండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొందరి వ్యక్తుల వల్ల ప్రభావితులవుతారు. అలాగే స్థిరాస్తుల కొనుగోల విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై.. మీకు ఎనలేని ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో మరింత కష్టపడాలి. మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఒంటరితనాన్ని ఫీలవుతారు. అలాగే కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం పొందుతారు. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల పట్ల ఆసక్తి చూపిస్తారు. 

మీన రాశి (Pisces) –  ఈ రోజు నిరుద్యోగులకు శుభదినం. కొంచెం కష్టపడితే.. అనుకోని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. విద్యార్థులు పలు మేధోపరమైన ఆలోచనలు చేస్తారు. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.