ఈ రోజు (27 డిసెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం
మేష రాశి (Aries) – ఈ రోజు మీరు చాలా సంతోషంగా గడుపుతారు. మీ సమస్యలు అన్నీ ఒక పరిష్కార దశకు వస్తాయి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీరు మీ భాగస్వామి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి.
వృషభ రాశి (Tarus) – ఈ రోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆఫీసులో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పెండింగ్ పనులను పూర్తి చేయడం మంచిది. విద్యార్థులు మరింత కష్టపడి చదవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.
మిథున రాశి (Gemini) – ఈ రోజు మీరు కొందరు వ్యక్తుల వల్ల ప్రభావితులవుతారు. అలాగే కొన్ని చిత్రమైన సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. ముఖ్యంగా దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వివాహితులు శుభకార్యాలకు హాజరవుతారు.
కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా గడుపుతారు. పాత క్లైంట్ల నుంచి కొత్త ఆర్డర్లు లభిస్తాయి. ఈ రోజు మీ వ్యాపారస్తులు తమ ప్రాజెక్టులను విస్తరించేందుకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. అలాగే అక్కరకు రాని స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
సింహ రాశి (Leo) – ఈ రోజు మీరు బద్ధకాన్ని వీడాలి. లేదా అనుకోకుండా వచ్చే అవకాశాలు చేజారిపోతాయి. ముఖ్యంగా విద్యార్థులు నిర్లక్ష్యాన్ని వీడాలి. మీకు మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కన్య రాశి (Virgo) – ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా పని చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వివాహితులు శుభవార్తలు వింటారు. అలాగే దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే పాత పనులన్నింటినీ పూర్తి చేసిన తర్వాతే.. కొత్తవి ప్రారంభించడం వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి.
తుల రాశి (Libra) – ఈ రోజు మీరు పలు విషయాలలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని పనులను ఇతరులు చెప్పినట్లు చేసుకుపోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. అలాగే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. కనుక జాగ్రత్తగా ఉండండి.
వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీరు అనుకోని ఇబ్బందులకు గురవుతారు. కొన్ని విషయాలలో మీరు మీ తల్లిదండ్రులు లేదా భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. అలాగే నిరుద్యోగులు మరింత కష్టపడాలి. కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడితే.. అనుకోని అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు రాశి (Saggitarius) – ఈ రోజు మీరు కొన్ని విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ లక్ష్యం ఏంటనే దానిపై మీకు పరిపూర్ణ అవగాహన ఉండాలి. విద్యార్థులు కొన్ని విషయాలలో నిర్లక్ష్యాన్ని వీడాలి. వివాహితులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (Capricorn) – ఈ రోజు మీరు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగరూకతతో వ్యవహరించాలి. సినిమా, మార్కెటింగ్ రంగాల వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభ రాశి (Aquarius) – ఈ రోజు మీరు అనుకోని సమస్యలలో చిక్కుకుంటారు. మీ పనులు కూడా వాయిదా పడే అవకాశముంది. విద్యార్థులకు కళలు లేదా క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వివాహితులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం.
మీన రాశి (Pisces) – ఈ రోజు మీరు వ్యక్తిగత జీవితానికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. అలాగే పెండింగ్ పనులు మళ్లీ వాయిదా పడతాయి. కుటుంబ సమస్యలు కూడా పరిష్కార దశకు వస్తాయి. విద్యార్థులు కొన్ని విషయాలలో తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవడం మంచిది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.