పార్టీలో గేమ్స్ ఆడుతున్నారా? అయితే ఈ డేర్ ఛాలెంజ్ ప్రయత్నించండి.

పార్టీలో గేమ్స్ ఆడుతున్నారా? అయితే ఈ డేర్ ఛాలెంజ్ ప్రయత్నించండి.

Funny Truth or Dare Challenges for your friends

ట్రూత్ ఆర్ డేర్.. చాలామంది స్నేహితులు టైమ్ పాస్ కోసం ఆడే ఆట. ఇందులో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. కొందరు ఎప్పుడూ నిజం చెప్పడానికే మొగ్గుచూపితే.. మరికొందరు అడ్వెంచర్‌కి మాత్రమే సిద్ధంగా ఉంటారు. ఎలాంటి డేర్ చేయడానికైనా వెనుకాడరు. డేర్ చేయడంలోనే వీరికి ఒక విధమైన థ్రిల్ కలుగుతుంది. మీకూ ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే.. ఈసారి ట్రూత్ ఆర్ డేర్ ఆడేటప్పుడు.. కొన్ని వెరైటీ ఫన్ డేర్ ఛాలెంజ్‌లను వారికి అందించండి.

అవేంటో మీకు తెలియట్లేదా? అయితే ఈ ఐడియాలను ఓసారి చెక్ చేయండి.  పార్టీ లేదా స్నేహితులతో గెట్ టు గెదర్ ఏదైనా జరిగినప్పుడు.. వివిధ  డేర్ గేమ్స్, ప్రాంక్స్ వంటి ఫన్ ఛాలెంజ్‌లు చేస్తూ.. ఉత్సాహంగా గడపడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియే.  అందుకే, ఈసారి జరిగే పార్టీ లేదా గెట్ టు గెదర్‌లో ఈ ఫన్నీ, రొమాంటిక్ డేర్‌లతో.. కొంచెం కష్టతరమైన టాస్కులు, ఛాలెంజ్‌లను ఇచ్చివారిని సర్ ప్రైజ్ చేయండి.

స్నేహితుల కోసం ఫన్ డేర్ ఛాలెంజ్‌లు

మీ స్నేహితులతో ఫన్నీ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వారికి ఈ ఫన్నీ డేర్ ఛాలెంజ్‌లు ఇవ్వండి.

అర నిమిషంలో గ్లాస్ పాలు తాగేయాలి.

పాలు తాగడం కష్టంగా ఉన్నవారికి ఈ టాస్క్ ఇవ్వండి.. లేదా కాకర కాయ రసం లాంటివి ఏవైనా కూడా ఇవ్వొచ్చు.

మీ క్రష్‌కి ఫోన్ చేసి బయటకు వెళ్లాలని అడగండి.

ఇలాంటి సమయం కోసం అవతలి వ్యక్తి కూడా వేచి చూస్తున్నారేమో తెలుస్తుంది.

మీ హెయిర్ కట్ మార్చుకోండి.

కొందరికి ఇది నిజంగా డేర్ అనే చెప్పాలి.

అద్దంలో చూసుకోకుండా మేకప్ వేసుకోండి.

మేకప్ వేసుకున్న తర్వాత.. సెల్ఫీ తీసుకొని అప్ లోడ్ చేయాలని కూడా చెప్పండి.

చల్లని నీటిలో స్నానం చేయండి.

ఈ చలికాలంలో చల్లని నీటితో స్నానం అంటే.. ఐస్ బకెట్ ఛాలెంజ్ కంటే కష్టమే..

తెలియని వ్యక్తికి మెసేజ్ చేయండి.

ఫేస్‌బుక్‌లో ఎవరో తెలియని వ్యక్తికి మెసేజ్ చేసి.. వారి రిప్లై ఏంటో చూడండి.

చేతులు పెట్టకుండా స్నాక్ తినండి.

ఈ స్నాక్ చాలా మెస్సీగా ఉండేలా చూసుకోండి. ఛీజ్ పిజ్జా లేదా సాస్ వేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి ప్రయత్నించండి.

మీ పక్కింటి డోర్ బెల్ కొట్టి.. చక్కెర అడగండి.

వాళ్లు చక్కెర ఇవ్వకపోతే.. డ్యాన్స్ చేస్తూ ఇంటికి రావాల్సి ఉంటుంది.

ఇబ్బంది కలిగించే డేర్ ఛాలెంజ్‌లు..

తమ స్నేహితులకు ఒక వైపు ఇబ్బంది కలిగిస్తూ.. వారి అగచాట్లను చూసి నవ్వుకోవాలని చాలామంది భావిస్తారు. కాకపోతే.. అవి వారిని మరీ ఇబ్బంది పెట్టకుండా.. ఫన్‌ను అందించేవైతే ఇంకా బాగుంటుంది.

అందరి ముందు బెల్లీ డ్యాన్స్ లేదా పోల్ డ్యాన్స్ చేయాలి.

షకీరాలా అందరి ముందూ డ్యాన్స్ చేస్తే అద్భుతంగా ఉంటుంది కదా..

మీ ఫోన్‌ని మీ స్నేహితులకు ఇవ్వండి. వారు కాంటాక్ట్స్‌లో ఎవరికైనా ఒక మెసేజ్ పంపుతారు.

ఎవరికి ఏం పంపుతారో తెలీదు కాబట్టి.. కాస్త ఇబ్బందే కదా..

మీ ఫేవరెట్ సెలబ్రిటీలా నటించాలి..

అలా నటిస్తూ వీడియో తీసుకొని.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.

మరో వ్యక్తిని వీపుపై మోస్తూ నడవాలి..

కనీసం నిమిషం పాటైనా అలా ఎత్తుకొని నడవాల్సిందే..

మీ పిడికిలిని మొత్తం మీ నోట్లో పెట్టుకోవాలి.

పెట్టుకునే వరకూ ప్రయత్నించాల్సిందే. కనీసం నిమిషమైనా ప్రయత్నించకుండా వదిలేయకూడదు.

మీ ఆల్బమ్‌లో పాత చిత్రాన్ని.. ఇప్పుడు మరోసారి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలి.

మీ స్నేహితులు దాన్ని చూసి ఫన్నీ కామెంట్లు చేస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది.

సులువైన డేర్ ఛాలెంజ్‌లు

కొందరు స్నేహితులు డేర్ అయితే ఎంచుకుంటారు కానీ.. తర్వాత అది చాలా కష్టంగా ఉందని చేయడానికి వెనుకాడతారు. అలాంటివారి కోసం ఈ సులువైన డేర్ ఛాలెంజ్‌లు ..

ఇంగ్లిష్ అక్షరాలను చివరి నుంచి మొదటి వరకూ చెప్పండి.

జెడ్, వై, ఎక్స్, డబ్ల్యూ, వి, యు.. తర్వాత? ఆలోచించాల్సిందే.

మళ్లీ మీ టర్న్ వచ్చే వరకూ డక్ ఫేస్ పెట్టండి.

దీన్ని పెట్టడం సులువే కానీ.. అంత సేపు ఉంచుకోవడం కాస్త కష్టం.

ప్రతి ఒక్కరి గురించి రెండు మాటలు నిజాయతీగా చెప్పాలి.

అందులో ఒకటి మంచిది.. ఒకటి చెడ్డది అయితే బాగుంటుంది.

మరో మూడు రౌండ్ల వరకూ మీ స్నేహితుల దుస్తులు వేసుకోవాలి.

కిక్ కోసం మాత్రమే..

రొమాంటిక్ డేర్ ఛాలెంజ్‌లు..

స్నేహితులతో ఆడేటప్పుడు ఫన్నీగా ఉన్నా ఫర్వాలేదు. కానీ మీ గ్రూపులో ఉండే ఆలుమగలు లేదా ప్రేయసీ, ప్రియులతో  ఆడేటప్పుడు మాత్రం.. వారికి రొమాంటిక్ డేర్ ఛాలెంజ్‌లు ఇవ్వండి.

తన ఒళ్లో పది నిమిషాలు కూర్చోవాలి.

అది ఎంత రొమాంటిక్‌గా ఉంటుందో ఆలోచించండి?

 

ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకోవాలి.

తను ప్రేమించిన అబ్బాయినే.. ఆమె తప్పనిసరిగా ముద్దు పెట్టుకుంటుంది.

కళ్లకు గంతలు కట్టి.. మూడు వస్తువులను ముద్దు పెట్టుకోవాలి.

ప్రపోజ్ చేయడానికి ఇది చాలా మంచి పద్ధతి..

స్నేహితులు అందరిలో.. ఒకరిని కౌగిలించుకోవాలి.

మీ మనసులోని ప్రేమను.. మీ ప్రియమైన వ్యక్తికి తెలియజేసేందుకు ఇది చాలా మంచి పద్దతి.

 

అబ్బాయిల కోసం..

మీ క్రష్ అనుకొని దిండును కౌగిలించుకోండి.

ఆ అమ్మాయి తప్పనిసరిగా సిగ్గుల మొగ్గ అవుతుంది.

మీ క్రష్ వాళ్ల అమ్మకు ఫోన్ చేసి.. తనని ప్రేమిస్తున్నానని చెప్పండి.

తల్లిదండ్రులకు ప్రేమను వ్యక్తం చేసేందుకు ధైర్యం కావాల్సిందే.

ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయండి.

తను ఎవరికి ప్రపోజ్ చేస్తాడో చూడడం చాలా ఫన్నీగా ఉంటుంది.

ఓ రొమాంటిక్ సాంగ్ పాడండి.

ఇది చాలా ఫన్నీగా ఉంటుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.