(Hilarious Excuses to get out of Office Work)
మనలో వీకెండ్ అంటే ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి? వారమంతా కష్టపడి పని చేసిన తర్వాత వచ్చే.. ఆ సెలవు అంటే అందరికీ ఇష్టమే. ఆ రోజున ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకోవడానికే తొలి ప్రాధాన్యమిస్తారు. చిత్రమేంటంటే.. వీకెండ్ తర్వాత తిరిగి ఆఫీస్‌కి వెళ్లాలంటే మాత్రం.. చాలామందికి చిరాగ్గా ఉంటుంది. మనందరికీ మన ఉద్యోగం అంటే ఇష్టమే. కానీ అనుకోకుండా దొరికే కొన్ని సెలవులంటే కూడా చాలా ఇష్టం.
కొన్నిసార్లు ఏ కారణం లేకుండా విశ్రాంతి తీసుకోవాలనిపించినా.. మరికొన్ని సార్లు ఏదైనా అనుకోని కారణం వల్ల సెలవు పెట్టాల్సి వస్తుంది. కానీ మీరు కోరుకున్న ప్రతీసారి సెలవు ఇవ్వరు. కాబట్టి ఏదో ఒక అబద్ధం చెప్పడం కామన్. ఈ అబద్ధాలలో భాగంగా వింత వింత కారణాలు చెప్పడం ప్రారంభిస్తాం. అయితే ఇంత చేసినా.. చాలా సార్లు సెలవు దొరకదు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి..? కొన్ని చిత్ర విచిత్రమైన కారణాలు కోసం వెతికేయాలి.. మీకు కూడా ఇలాంటి ఐడియాలు వస్తే కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి.
1. నా కళ్లద్దాలు కనిపించడం లేదు / కళ్లద్దాలు పగిలిపోయాయి.
కళ్లద్దాలు లేనిదే మీకు కనిపించకపోతే.. ఇలాంటి కారణం చెప్పడం వల్ల.. ఎవరూ మిమ్మల్ని పనిచేయమని బలవంతం చేయలేరు కూడా.
2. నా కార్ టైర్ పంక్ఛర్ అయిపోయింది. నేను దారిలో ఆగిపోవాల్సి వచ్చింది.
మెకానిక్ వచ్చి.. మీ టైర్ మార్చేలోపు సగం రోజు కూడా పూర్తవుతుంది. ఇక ఆఫీస్‌కి ఎలా వెళ్లగలరు?
3. నా ల్యాప్ టాప్ పై నీళ్లు పడిపోయాయి..
చిన్నతనంలో కూడా ‘హోం వర్క్ చేశాను కానీ.. బుక్ ఇంట్లో మర్చిపోయానని చెప్పడం అలవాటే కదా..’ ఇది కూడా అలాంటిదే.
ఇన్‌స్టాగ్రామ్ రెజ్యుమెతో.. ఇంటర్వ్యూ లేకుండా జాబ్ సంపాదించేసింది..!
4. మా బంధువులు ఇంటికి వస్తున్నారు.
మీ బాస్, కొలీగ్స్ ఎప్పుడూ వినని బంధువుల పేర్లు చెప్పేయండి. చాలా కాలం తర్వాత వస్తున్నారు కాబట్టి.. మీరు ఆఫీసుకి రావడం కుదరదని అనుకుంటారు.
5. మా పక్కింటివారిని ఎవరో కొట్టారు..
‘ఆమె లేదా అతన్ని హాస్పిటల్‌కి తీసుకొచ్చాను’ అంటే ఎవరైనా వదిలి రమ్మని చెప్పగలరా?
6. నేను నా లైసెన్స్ తెచ్చుకోవడానికి వెళ్లాలి..
లైసెన్స్ లేకుండా ఆఫీస్‌కి వస్తే.. పోలీసులు ఆస్తులు రాయించుకుంటారు మరి..
7. ఈ రోజు నా ఎక్స్‌ని కలిశాను. నా మనసు పాడైంది.
మనసు బాగా లేనప్పుడు పనిచేస్తే ఇక అంతే మరి..
8. నిన్న రాత్రి నేను తాగింది ఇంకా దిగలేదు.
ఇది బాస్‌కి చెప్పడం కాస్త ఇబ్బందే.. కానీ వర్కవుటవుతుంది.
10. మా బాత్రూం కుళాయి ఊడిపోయి.. ఇల్లంతా నీటితో నిండిపోయింది.
ఇది చెప్పాక.. ఇక ఎవరైనా ఆఫీస్‌కి వస్తారని ఊహించుకోగలరా?
11. మా ఫ్రెండ్‌కి యాక్సిడెంట్ అయింది.
ఆఫీస్‌లో వారికి తెలియని ఫ్రెండ్ పేరు చెప్పండి.
12. నిన్న బయట ఫుడ్ తిన్నా. అది పడలేదనుకుంటా. వాంతులవుతున్నాయి.
ఇది చెబితే తప్పనిసరిగా సెలవు దొరుకుతుంది.
13. నేను ఇంటికి తాళం వేయడం మర్చిపోయా.
అమ్మో.. వెంటనే వెళ్లాలి. ఎవరైనా దొంగతనం చేస్తే?
14. నా ఫోన్ / ల్యాప్ టాప్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ అవుతోంది. మా ఇంట్లో వైఫైకి కనెక్ట్ అయింది.
వర్క్ ఫ్రం హోం తప్పకుండా దొరుకుతుంది.
మహిళలూ.. “వర్క్ ఫ్రమ్ హోమ్” చేసేముందు.. ఈ విషయాలు గుర్తుంచుకోండి..!
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్ ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.