ADVERTISEMENT
home / Food & Nightlife
మన ఇంట్లోనే.. అతి సులభంగా ‘న్యూ ఇయర్ కేక్’ చేసేద్దామా..?

మన ఇంట్లోనే.. అతి సులభంగా ‘న్యూ ఇయర్ కేక్’ చేసేద్దామా..?

Special New Year Cake Recipe

న్యూ ఇయర్  వస్తుందనగానే.. మనలో కూడా ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది.   డిసెంబర్ 31 తేదిన.. రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు కేక్  కట్ చేసి న్యూ ఇయర్‌ని జరుపుకోవడమనేది చాలామందికి సర్వసాధారణం. అలాగే న్యూ ఇయర్‌ వేళ బేకరీలలో కేక్స్‌కి కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్‌కి తగ్గట్టుగానే న్యూ ఇయర్ స్పెషల్ అంటూ.. ధరలని అమాంతం పెంచేస్తుంటారు. 

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలంటే.. ఈ 15 బెస్ట్ స్పాట్స్‌‌కి వెళ్లాల్సిందే..!

ఇలాంటి సందర్భాలలో కొత్త సంవత్సరం వేళ.. కేక్ కట్ చేయాలా..? వద్దా అనే మీమాంసలో పడే వారి కోసం.. ఇంట్లోనే అతి సులభంగా.. అతి తక్కువ ఖర్చుతో న్యూ ఇయర్ కేక్‌ని తయారుచేసే విధానాన్ని చెబుతున్నాం.  మరి ఇంటిలోనే స్వయంగా కేకులను ఓవెన్ లేకుండానే చేసుకునే ప్రక్రియని అందిస్తున్నాం.

ADVERTISEMENT

ముందుగా కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు …

* మైదా పిండి – 1 కప్పు

* గుడ్లు – 3

* చక్కెర – 3/4 కప్పు

ADVERTISEMENT

* బేకింగ్ పౌడర్ – 1.5 టీ స్పూన్

* వంట సోడా – 1/2 టీ స్పూన్

* ఉప్పు – 1/2 టీ స్పూన్

* నూనె – 1/2 కప్పు

ADVERTISEMENT

* వెనిలా ఎసెన్స్ – 1/2 టీ స్పూన్

* పాలు – 1/2 కప్పు

* డ్రై ఫ్రూట్స్ – 1 కప్పు

* టూటీ ఫ్రూటీస్ – 1 కప్పు

ADVERTISEMENT

ఇవి కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు. వీటి సహాయంతో మనం ఇంట్లోనే కేక్‌ని తాయారు చేసుకోగలం. 

కేక్ తయారీ విధానం –

ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని.. అందులో 1/4 కిలో ఉప్పు లేదా ఇసుకతో కుక్కర్ లోపలి భాగం మొత్తం  పరుచుకోవాలి. అలా పరుచుకున్న తరువాత.. ఆ కుక్కర్ ని దాదాపు 10 నుండి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పైన ఉంచాలి.

ఇక మరోవైపు ఒక గిన్నెలో.. 1 కప్పు మైదా పిండి, ఒకటిన్నర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ మూడు ఒకదానితో మరొకటి  బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

మరొక గిన్నెలో 3 గుడ్లని పగులగొట్టి అందులో వేసుకున్న తరువాత.. అందులోకి అర టీ స్పూన్ ఉప్పు.. అర కప్పు నూనె, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 కప్పు చక్కర, అర కప్పు పాలు వేసుకుని.. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.

దీనంతటిని మిక్స్ జార్‌లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేస్తే.. చక్కటి పేస్ట్‌లా మారిపోతుంది.

హైదరాబాద్‌లో క్రిస్మస్ & న్యూ ఇయర్ ‘కేక్స్’కి.. ఈ బేకరీలు ప్రత్యేకం

ఈ పేస్ట్‌లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా, బేకింగ్ పౌడర్, వంట సోడాల మిశ్రమాన్ని నెమ్మదిగా వేసుకుంటూ వెళ్లాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తంగా చూస్తే.. రెండు కలిసి తయారైన మిశ్రమం చిక్కగా ఉండాలి తప్ప.. ఎక్కడా కూడా ముద్దలుగా ఉండకుండా చూసుకోవాలి. దీనిని కేక్ బ్యాటర్ అంటారు.

ADVERTISEMENT

 

ఇక తయారైన కేక్ బ్యాటర్‌లోకి టూటీ ఫ్రూటీస్ వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి కేక్ తయారీ పూర్తయ్యాక.. దానిని చూస్తే.. అది మొత్తం కూడా ఈ టూటీ ఫ్రూటీస్‌తో నిండిపోయి చాలా కలర్ ఫుల్‌గా కనపడుతుంది.

ఇప్పుడు కేక్‌ని బేక్ చేయడానికి.. ఓ ప్రత్యేకమైన కేక్ పాత్రని తీసుకోవాలి. అందులో కొద్దిగా నూనె చుక్కలు వేసుకుని.. ఆ నూనెతో కేక్ పాత్ర లోపలి భాగాన్ని మొత్తం పూతలాగా పూయాలి. అలా పూతలాగా పూసిన తరువాత.. కొద్దిగా మైదా పిండిని కూడా తీసుకోవాలి. దానికి ఒక పూత మాదిరిగా చల్లుకోవాలి. కేక్ బేక్ అయిన తరువాత దానిని పాత్రలో నుండి బయటకి తీయడానికి సులువుగా ఉండడం కోసమే.. ఇలా పిండిని చల్లడం జరగుుతుంది. అలాగే కేక్ ఆ పాత్రకి అతుక్కోకుండా ఉంటుంది కూడా.

ADVERTISEMENT

ఇప్పుడు కేక్ బ్యాటర్‌ని.. ఆ కేక్ పాత్రలో పోసుకోవాలి. బ్యాటర్ మొత్తాన్ని కేక్ పాత్రలో పోసుకున్న తరువాత.. ఎక్కడా కూడా చిన్న రంధ్రాలు లేకుండా చూసుకోవాలి. ఇక ఆ బ్యాటర్ పై రకరకాల డ్రై ఫ్రూట్స్ ముక్కలను  టాపింగ్స్‌గా కూడా వేసుకోవచ్చు. ఇక అప్పటికే వేడి చేసి ఉంచిన కుక్కర్ లోపలున్న ఇసుక లేదా ఉప్పు పైన.. ఒక ప్లేట్ పెట్టుకుని దాని పైన ఈ కేక్ పాత్రని ఉంచుకోవాలి.

ఇక కేక్ పాత్రని లోపల పెట్టేసాక.. మనం కుక్కర్ మూతని పెట్టేయాలి. అయితే కుక్కర్‌కి విజిల్ మాత్రం పెట్టకూడదు. కుక్కర్ మూత పెట్టేసిన తరువాత.. ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో మంట పెట్టాలి. ఆ తరువాత మరొక 30 నిమిషాల పాటు .. మీడియం ఫ్లేమ్‌లో బేక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత 40 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. కుక్కర్ మూత తీసి చూస్తే.. మనకి కేక్ సిద్దమై ఉంటుంది. ఇక ఆ కేక్ పాత్రని జాగ్రత్తగా కుక్కర్ నుండి బయటకి తీసి.. ముఖ్యంగా ఆ కేక్ పాత్ర నుండి మరింత జాగ్రత్తగా ఒక ప్లేట్‌లో బోర్లిస్తే.. మనకి సర్వ్ చేసుకోవడానికి కేక్  సిద్దమైనట్లే!!

ఇదీ మన ఇంటిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా.. త్వరగా కేక్‌ని చేసుకునే ప్రక్రియ. మరింకెందుకు ఆలస్యం.. ఈ న్యూ ఇయర్‌కి మీ స్వహస్తాలతో చేసిన కేక్‌ని కట్ చేసి ఆనందంగా గడపండి.

ADVERTISEMENT

కొత్త సంవత్సరం వచ్చేస్తున్న వేళ.. మీరూ కొత్త నిర్ణయాలు తీసేసుకోండి..!

Image: Shutterstock.com

20 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT