సెక్సువల్ రొమాన్స్‌కి.. గొడవలు ఎప్పుడూ అడ్డంకి కాదు ..! | POPxo

సెక్సువల్ రొమాన్స్‌కి.. గొడవలు ఎప్పుడూ అడ్డంకి కాదు ..!

సెక్సువల్ రొమాన్స్‌కి.. గొడవలు ఎప్పుడూ అడ్డంకి కాదు ..!

How to make up with Sex after a fight between Couple

గొడవలనేవి ప్రతి జంట మధ్య సాధారణంగా జరిగేవే. ఇరువురి మధ్య సయోధ్య అనేది ఎంత వేగంగా కుదురుతుందో.. గొడవలు కూడా అంతే వేగంగా జరుగుతుంటాయి. మొత్తానికి తీపి, చేదు గుళికల మిళితమే దాంపత్య బంధమని చెప్పచ్చు. అయితే ఎప్పుడూ గొడవలు పడుతుండడం కంటే.. వాటిని ఎంత వేగంగా పరిష్కరించుకుంటే అంత మంచిది. అప్పుడే బంధం అందంగా మారుతుంది. ఇలాంటి బంధం గనుక ఏర్పడితే.. ఎంత పెద్ద గొడవ అయినా సరే.. తక్కువ సమయంలోనే అది సమసిపోతుంది. దానికి చాలా  చిట్కాలు ఉన్నాయి. ఈ రొమాంటిక్ చిట్కాలు మీ ఇద్దరి మధ్య కోపాన్ని తగ్గించి.. మిమ్మల్ని మరింత దగ్గర చేస్తాయి.

సెక్స్ సమయంలో ఇలా మాట్లాడితే చాలు.. మూడ్ రెట్టింపవుతుంది..!

గాఢమైన ముద్దుతో..

అనేక జంటలు గొడవ జరిగిన తర్వాత.. ఒకరికొకరు 'సారీ' చెప్పుకొని పెట్టుకునే ముద్దు.. చాలా హాట్‌గా ఉంటుందట. దీనివల్ల దంపతులు లేదా ప్రేమికులు ఆనందాన్ని పొందడం మాత్రమే కాదు.. ఇద్దరి మధ్య ఏవైనా మనస్పర్థలు ఉంటే వాటిని కూడా తొలిగించుకుంటారు. మీ భాగస్వామితో మీకు ప్రతిసారీ గొడవ జరుగుతోందా..? అలాంటప్పుడు మీకు ఆ గొడవను కొనసాగించాలని అనిపించకపోయినా లేదా మీరు ఏదైనా తప్పు చేశాక దానికి 'సారీ చెప్పాలని భావించినా'.. మీ భాగస్వామిని గట్టిగా ముద్దు పెట్టేసుకోండి. ఇలా ముద్దు పెట్టాక.. వారి మూడ్ తప్పక మారుతుంది. గొడవను పక్కన పెట్టేసి.. మీతో రొమాన్స్ అనే యుద్ధానికి సిద్ధమవుతారు.

డర్టీ టాక్ మంచిదే..

మీరు మీ భాగస్వామి పట్ల కోపంగా ఉన్నారా? అలాగే తనతో గొడవ పడాలని మీకు అనిపించడం లేదా? అయితే వారితో డర్టీ టాక్ ప్రారంభించేయండి. కేవలం మాటలతోనే ఈ ప్రయోగాన్ని చేయండి. ఎలాంటి చేతలు లేకుండా.. కేవలం మాట్లాడేందుకు ప్రయత్నించండి. కొన్ని నాన్ వెజ్ జోక్స్ వేయడంతో పాటు.. తన పై చిలిపి జోకులు, ప్రశంసలు లాంటివి కూడా ట్రై చేయవచ్చు. అయితే ఇక్కడ మీ గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా చూసుకోవాలి. అవతలి వారిని కించపర్చకూడదు. ఇలాంటి సెక్స్ టాక్  వల్ల.. అవతలి వారు గొడవ విషయం మర్చిపోయి మూడ్ మార్చుకుంటారు.

బయట అయితే ఇలా..

మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు.. కార్‌లోనే మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందనుకోండి. అప్పుడు ఆ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇంటికి వెళ్లేవరకూ ఆగాల్సిన అవసరం లేదు. కార్‌లోనే కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. కార్‌లోనే తనకు సున్నితంగా ముద్దు పెట్టడానికి ట్రై చేయండి. అలాగే మీ స్పర్శతో తనకు మూడ్ వచ్చేలా కూడా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల.. మీ భాగస్వామి గొడవ విషయం మరిచిపోయి.. వాతావరణాన్ని హాట్‌గా మార్చేస్తారు. అయితే దీనికి మీ పరిసరాలు కూడా సహకరించాలి. ఎంతైనా బిజీగా ఉండే రోడ్డులో వెళ్తూ.. ముద్దు పెట్టుకోవడం సరికాదు కదా.

సెక్స్ తర్వాత ఈ మాటలు చెబితే.. మీరిద్దరూ మరింత దగ్గరవుతారట..!

కోపంలోని ప్రేమ

కొన్ని సార్లు మీరు చాలా కోపంగా ఉంటారు. కానీ మీలోని కోపాన్ని మీరు మాటలతో బయటకు చెప్పలేరు. ఇలాంటప్పుడు కేవలం మాటలతో కాకుండా.. అద్భుతమైన రొమాంటిక్ టచ్ ద్వారా.. మీ కోపాన్ని మీ భాగస్వామి అర్థం చేసుకునేలా చేయవచ్చు. ఇక్కడ మీ ఎక్స్‌ప్రెషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే మీరు ఏ స్థాయిలో రొమాంటిక్ యుద్ధానికి సిద్దమవుతున్నారన్న దాన్ని బట్టి  కూడా.. ఎదుటి వ్యక్తి మీ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకునే వీలుంటుంది.

హ్యాపీ హార్మోన్లతో..

కోపం లేదా గొడవ తర్వాత ఇద్దరూ దగ్గరైతే.. కేవలం మీ ఇద్దరి మనసులకు మాత్రమే కాదు.. హార్మోన్లకు కూడా మంచిదని మీకు తెలుసా? మీ ఇద్దరికీ ఒకరంటే మరొకరికి అమితమైన ప్రేమ ఉంటే.. ఇద్దరి మధ్య కోపం ఎక్కువ సమయం ఉండదు. కోపం ఎక్కువ సమయం ఉండకపోతే.. గొడవ సులువుగా పరిష్కారమైనట్లే. ఆ ఆనందం వల్లే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఈ సమయంలో.. మీరూ తన ప్రేమలో పూర్తిగా మునిగిపోయి వాటిని ఎంజాయ్ చేసేయండి.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

 

Read More from Lifestyle
Load More Lifestyle Stories