ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
చేనేత కళకు పెట్టింది పేరు.. వెంకటగిరి చీరలు

చేనేత కళకు పెట్టింది పేరు.. వెంకటగిరి చీరలు

(Interesting Facts related to Venkatagiri Sarees)

వెంకటగిరి చీరలు… ఈ పేరు వినని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. 17వ శతాబ్దంలో నెల్లూరులోని వెలుగోటి రాజవంశస్థులు చేనేత కళను ఎంతగానో ప్రోత్సహించేవారు. ఆ సమయంలోనే వెంకటగిరి ప్రాంత చేనేత కళాకారులు వినూత్న శైలిలో చీరలను తయారుచేయడంలో తర్ఫీదును పొందారని అంటారు. ప్రస్తుతం వెంకటగిరితో పాటు పాటూరు ప్రాంతంలో కూడా వేలాది కుటుంబాలు నేత పరిశ్రమనే ఉపాధిగా చేసుకుంటూ జీవిస్తున్నాయి. ఈ చీరలను సాధారణంగా చేతితో అల్లడం లేదా యంత్రం ద్వారా తయారుచేయడం చేస్తుంటారు.

మొదటిసారి చీర కట్టుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే..

ఈ చీరల తయారీలో జరీ రూపకల్పన అనేది  ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ చీరలు నేడు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. వెండి చరీ, ఆఫ్ ఫైన్ జరీ మొదలైన డిజైన్లు వెంకటగిరిలో లభిస్తాయి. అంతేకాకుండా ప్రత్యేకమైన జాందనీ వర్కుకి కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. జాందనీ వర్కులో రెండువైపులా ఒకే డిజైన్ కనిపించేలా చీరను తయారు చేయడం ఇక్కడి కార్మికులు ప్రత్యేకత. అన్నింటి కన్నా ముఖ్యంగా.. చెంగావి రంగు చీరలను తయారుచేయడంలో వెంకటగిరి వస్త్ర నిపుణులు ముందుంటారు. 

ADVERTISEMENT

పెళ్లి కూతురుని మరింత.. అందంగా మార్చే పెళ్లి పట్టుచీరలు..!

వెంకటగిరి చీరలకు సంబంధించి కాటన్ ఎంపిక, డై, సైజింగ్, కటింగ్, ఫోల్డింగ్.. ఇలా పద్దతులన్నీ దాదాపు ప్రత్యేకంగానే ఉంటాయి. ఈ చీరలను నేసే ముందు కాటన్‌ను బాగా ఉడికించి.. తర్వాత నానబెట్టి.. ఆ పైన ప్రాసెస్ చేస్తారట. వెంకటగిరి చీరలను పోలిన చీరలే.. ప్రస్తుతం తమిళనాడులోని సెంగుంతపురం, కల్లత్తూర్, అండిమడం, మర్దూర్ ప్రాంతాలలో లభించడం విశేషం. ప్రస్తుతం వెంకటగిరి చీరలు ఆన్‌లైన్‌లో కూడా లభిస్తున్నాయి. ఆప్కో వస్త్రాలలో కూడా ప్రధానంగా ఈ చీరలకు తనదైన మార్కెట్ ఉంది. 

 

 

ADVERTISEMENT

 

2011లో తొలిసారిగా వెంకటగిరి చీరలకు జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ (జిఐ) ట్యాగ్ లభించింది. ప్రస్తుతం వెంకటగిరి సిల్క్, వెంకటగిరి పుట్ట, వెంకటగిరి 100 మొదలైన వెరైటీలలో ఈ చీరలు లభిస్తున్నాయి. అలాగే 1991లో వెంకటగిరిలో చేనేత  పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ఓ శిక్షణా సంస్థను సైతం ప్రభుత్వం ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక చేనేత విద్యాసంస్థగా ఆ సంస్థ వినుతికెక్కింది. అదే ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ సంస్థ. ఈ సంస్థలో నిర్వహించే మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులో స్పిన్నింగ్‌, డైయింగ్‌, ప్రింటింగ్‌, ఫినిషింగ్‌, డిజైన్‌, క్వాలిటీ మొదలైన సబ్జెక్టులను బోధిస్తుంటారు.

బెనారసీ చీర గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?

వెంకటగిరి చీరలను నేసే పద్థతి ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ చీరలు చాలా తక్కువ బరువు ఉంటాయి. కాబట్టి వీటిని ఏ కాలంలోనైనా సులువుగా ధరించే వీలుంటుంది. వెంకటగిరి చీరలు చక్కటి రంగుల్లో చుక్కలు, చిలుకలు, ఆకులు, పువ్వుల డిజైన్లలో ఉంటాయి. బంగారు రంగులో ఉండే ఈ మోటిఫ్స్ చీరకు మంచి లుక్ తెచ్చిపెడతాయి. పెళ్లిళ్ళ సీజన్లప్పుడు ఈ చీరలకు తెలుగు రాష్ట్రాలలో నిజంగానే మంచి డిమాండ్ ఉంటోంది. 

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.                                                                                                                                         

 

 

ADVERTISEMENT

 

 

11 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT