2019 Tollywood’s most successful actress – Raashi Khanna
ఏ సినీ పరిశ్రమలోనైనా హీరోలతో పోల్చితే… ఒక వయసుకి వచ్చాక హీరోయిన్స్‌కి దక్కే కెరీర్ అవకాశాలు చాలా తక్కువ. అందుకే ‘దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే సూత్రానికి తగ్గట్లుగా తమ కెరీర్‌ని ప్లాన్ చేసుకుంటుంటారు నటీమణులు. అయితే తాము కోరుకున్న కెరీర్ సాఫీగా సాగాలంటే మాత్రం.. అందుకు సరైన హిట్స్ కూడా తోడవ్వాలి. అలాగే లక్ కూడా కలిసిరావాలి. అయితే వందలాది నటీమణులలో.. ప్రతీ సంవత్సరం ఆ లక్ కలిసొచ్చేది కొందరికి మాత్రమే.
కొత్త కథలకే.. ప్రేక్షకుల ఓటు : 2019 టాప్ టెన్ టాలీవుడ్ చిత్రాలివే..!
2019లో కూడా అలా టాలెంట్‌తో పాటు.. లక్ కూడా కలిసొచ్చిన నటి ఒకరున్నారు. ఆమే రాశి ఖన్నా. సరైన హిట్స్ తన ఖాతాలో పడడంతో.. రాశి ఖన్నా ఈ సంవత్సరానికే మోస్ట్ సక్సెస్ ఫుల్ కథానాయికగా ప్రజల చేత శభాష్ అనిపించుకోగలిగింది. అయితే ఆమె ఈ సంవత్సరం చేసింది రెండు చిత్రాలే అయినప్పటికి.. ఆ రెండూ కూడా.. డిసెంబర్ నెలలో ఒక వారం వ్యవధిలోనే విడుదలకావడం విశేషం.
వెంకీ మామ (Venky Mama) చిత్రంలో రాశి పోషించింది కమర్షియల్ హీరోయిన్ పాత్రే అయినప్పటికీ.. ప్రతిరోజూ పండగే (Prathiroju Pandage) చిత్రంలో మాత్రం యాంజెల్ ఆర్న అలియాస్ టిక్ టాక్ సూపర్ స్టార్ పాత్రతో మంచి మార్కులే కొట్టేసింది. టిక్ టాక్ క్వీన్‌గా ఆమె పండించిన హాస్యం బాగా పండింది. మరీ ముఖ్యంగా – ‘నాక్ … నాక్ … నాకొద్దు’ అంటూ చెప్పిన డైలాగ్.. అదే కాకుండా ‘ఓన్లీ వన్స్ … ఫసక్’ అంటూ మోహన్ బాబు డైలాగ్‌ని చెప్పిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
సాయి ధరమ్ తేజ్ – రాశి ఖన్నా ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం.. పబ్లిక్ టాక్ మీకోసం..
ఇక ఈ రెండు చిత్రాలు వరుసగా హిట్ కావడంతో రాశి ఖన్నాకి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయని వినికిడి. ప్రస్తుతం ఆమె రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నటిస్తోంది. క్రాంతి మాధవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ టైటిల్‌ను బట్టి కథేమిటో.. రాశిఖన్నా పాత్రేమిటో మనం ఇట్టే ఊహించవచ్చు. 2020లో ఈ చిత్రం హిట్ అయితే.. రాశి రేంజ్ నిజంగానే ఎక్కడికో వెళ్లిపోతుంది.
ఇప్పటికే ఒక మంచి అభినేత్రిగా రాశికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఇక లక్కీ స్టార్ అనే హిట్ ట్యాగ్ కూడా జత కడితే.. ఆమెకు మరింత పేరొచ్చే అవకాశం ఉంది.
ఇక 2019లో తనదైన శైలిలో సత్తా చాటిన మరో సక్సెస్ ఫుల్ హీరోయిన్ సమంత. ఈమె నటించిన మజిలీ, ఓహ్ బేబీ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించాయి. అలాగే ఈమె ఇప్పటికే తెలుగు పరిశ్రమలో.. నటీమణుల పరంగా సూపర్ స్టార్ స్టేటస్ అందుకున్న సంగతి తెలిసిందే.
చివరిగా … 2019లో మంచి విజయాలతో ఫేమ్ పరంగా.. టాప్ స్థానంలో నిలిచిన నటి ‘రాశి ఖన్నా’ మాత్రమే అని చెప్పేయచ్చు. 2020లో ఆమె కెరీర్ దిగ్విజయంగా దూసుకుపోవాలని మనమూ కోరుకుందాం.
నన్ను ఒక వేశ్యగా చూసారు : తన మనసులోని బాధను బయటపెట్టిన నటి కల్కి కొచ్లిన్