ADVERTISEMENT
home / Home & Garden
క్రిస్మస్‌ని ఎంజాయ్ చేయాలా? అయితే ఈ పనులు తప్పక చేయండి..

క్రిస్మస్‌ని ఎంజాయ్ చేయాలా? అయితే ఈ పనులు తప్పక చేయండి..

Tips to Enjoy Christmas

మన దేశం సర్వ మతాల సమ్మేళనం. ఇక్కడ అందరూ అన్ని పండగలనూ కలిసి మెలిసి జరుపుకుంటారు. మనలో కూడా చాలామందికి క్రిస్టియన్ స్నేహితులు ఉండే ఉంటారు. ఈ రోజు వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు.. ఆ పండగ ఆనందాన్ని వారితో మీరూ పంచుకోవచ్చు. క్రిస్మస్ సందర్భంగా అనేక చోట్ల పిల్లలు, పెద్దలు కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇలాంటి పార్టీలను చేసుకొనే సంప్రదాయం అనేక సంవత్సరాల నుండీ వస్తోంది. ఎందుకంటే ఆనందంలోనే పరమార్థం ఉంది.

అందుకే పండగ వేళ కాస్త ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు వచ్చే ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాల్సిందే. ఈ క్రమంలో మీరు కూడా.. ఈ క్రిస్మస్ సందర్భంగా మీతో పాటు.. మీ స్నేహితులలో కూడా కాస్త ఆనందాన్ని నింపడానికి ఇవి ప్లాన్ చేసేయండి

1. శాంటాగా మారిపోండి.

క్రిస్మస్ అనేది కానుకల పండుగ. శాంటా అందరికీ బహుమతులు అందిస్తారని చాలామంది నమ్మకం. చాలామంది ఈ పండగ సందర్భంగా తమ బహుమతుల కోసం వేచి చూస్తుంటారు. అందుకే మీరే శాంటా క్లాజ్‌గా మారిపోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకే కాదు.. రాత్రిళ్లు మురికి వాడలకు వెళ్లి అక్కడి పిల్లలకు కూడా బహుమతులను అందించండి. దీనివల్ల మీకు చాలా ఆనందం కలుగుతుంది.

ADVERTISEMENT

క్రిస్మస్ పండగకి.. ఈ ట్రెండీ దుస్తులతో కొత్త లుక్ మీ సొంతమవుతుంది

2. అనాథాశ్రమంలో గడపండి.

సాధారణంగా మనం శాంటా లేదా సీక్రెట్ శాంటాగా మారిపోయి.. మన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కొన్ని బహుమతులను అందిస్తుంటాం. కానీ ఇలాంటి బహుమతులు నిజంగా అవసరమయ్యే వారు చాలామందే ఉంటారు. అలాంటివారిలో ముఖ్యమైన వారు అనాథలు. అడిగింది కొనివ్వడానికి వారికి అమ్మా,నాన్న కూడా ఉండరు. కాబట్టి వారికి క్రిస్మస్ సందర్భంగా మంచి బహుమతులను కొనివ్వడంతో పాటు.. క్రిస్మస్‌ను వారితో కలిసి సెలబ్రేట్ చేసుకోండి. 

3. కేక్, కుకీస్, వంటకాలు చేసుకోండి.

సాధారణంగా క్రిస్మస్‌కి రమ్ కేక్, కుకీస్, పేస్ట్రీలు, హాట్ చాక్లెట్ వంటివి తయారుచేస్తుంటారు. ఈ క్రమంలో మీరు, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు మీకిష్టమైన వంటకాలను రడీ చేసేయండి. క్రిస్మస్ స్పెషల్‌గా చేసే వంటకాల్లో చాలా రకాలున్నాయి. వాటిలో మీకు నచ్చిన వాటిని ఎంచుకోండి. కాకపోతే అందులోనే కాస్త వైవిధ్యమైన వంటకాలను ట్రై చేసి మీ క్రిస్మస్‌ని ఎంజాయ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.

4. ‘క్రిస్మస్ ట్రీ’ని అలంకరించండి.

క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేవి కేవలం మూడు మాత్రమే. అవే క్రిస్మస్ కేక్, క్రిస్మస్ ట్రీ మరియు శాంటా క్లాజ్. అందుకే మీరు కూడా క్రిస్మస్ సందర్భంగా.. మీ క్రియేటివ్ ఆలోచనలతో మీ ఇంట్లోని క్రిస్మస్ ట్రీని అందంగా డెకరేట్ చేయండి. దానికింద కొన్ని బహుమతులను కూడా పెట్టండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వారిని కూడా ఈ పనిలో భాగం చేయండి. ఇలా చేయడం  వల్ల వారికి చాలా ఆనందాన్ని అందించినవారవుతారు. దీనివల్ల వారి మీ క్రియేటివిటీ కూడా పెరుగుతుంది.

ADVERTISEMENT

5. ఇంటిని డెకరేట్ చేయండి.

ప్రతి పండగకి ఇంటిని శుభ్రం చేసి.. గదులను అందంగా అలంకరించడం అనేది అందరూ చేసే పనే. మీరు కూడా ఈ క్రిస్మస్‌కి ఇంటి అలంకరణకి పెద్ద పీట వేయండి. అయితే ఎప్పటిలా కాకుండా.. కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయండి. చిన్న చిన్న స్టార్స్, గిఫ్ట్ బాక్సులు, పేపర్ ఫ్లవర్స్.. వీటితో పాటు క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయగా మిగిలిన వస్తువులతో కూడా ఇంటిని డెకరేట్ చేయవచ్చు. దీనికోసం మీ క్రాఫ్ట్ స్కిల్స్‌ని ఉపయోగించండి.

6. స్నేహితులతో పార్టీ చేసుకోండి.

మీ స్నేహితులతో సరదాగా పార్టీ చేసుకోవడం అనేది ఎప్పుడైనా చేసే పనే. కానీ క్రిస్మస్ సందర్బంగా ఆనందంగా గడిపేందుకు చేసుకొనే పార్టీలు చాలా డిఫరెంట్‌గా ఉండాలి. అందుకే ఈ పార్టీలను ఏ హోటల్‌లోనో జరుపుకోకుండా.. మీ ఇంట్లోనే చేసుకోండి.  వీలుంటే లైట్లతో ఇంటిని డిస్కోలా మార్చేయండి.

క్రిస్మస్ పార్టీ కోసం సెలబ్రిటీ మేకప్ లుక్‌లో మెరిసిపోదాం..!

7. క్యాండిల్ లైట్ డిన్నర్..

స్నేహితులతో ఆనందంగా పార్టీ చేసుకున్న తర్వాత.. మీ మనసుకు నచ్చిన వారితో చక్కటి రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయండి. ఇందులో క్రిస్మస్ స్పెషల్ రెసిపీస్ అన్ని ఉండేలా చూసుకోండి. ఇవన్నీ మీరు చేయలేకపోతే.. హోటల్‌కి వెళ్లినా ఫర్వాలేదు.

ADVERTISEMENT

8. క్యాంప్ ఫైర్ వేసుకోండి..

ఇవన్నీ చేసిన తర్వాత మీ ఇంటి వెనుక.. క్యాంప్ ఫైర్ వేసుకొని రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ రాత్రిని ఆనందంగా గడపండి.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్ ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

 

20 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT