తక్కువ బడ్జెట్‌లో.. ఫ్రెండ్స్‌తో కలిసి 'న్యూ ఇయర్' పార్టీ చేసుకుందామా..?

తక్కువ బడ్జెట్‌లో..  ఫ్రెండ్స్‌తో కలిసి 'న్యూ ఇయర్' పార్టీ చేసుకుందామా..?

New Year Celebration/Party Plans

చాలామంది న్యూ ఇయర్ వేడుకలను.. సంవత్సరం మొత్తం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని భావిస్తారు. అందుకే ఈ వేడుకలను చాలా ప్రత్యేకంగా జరుపుకొనేందుకు ప్లాన్ చేస్తారు. డిసెంబర్ ప్రారంభంలోనే ప్రతి ఒక్కరూ.. ఈ ప్లానింగ్ ప్రక్రియను మొదలుపెడతారు. మీరు కూడా అంతేనా..? కానీ ఈ న్యూ ఇయర్‌కి ఎలా వెల్‌కమ్ చెప్పాలో.. ఎక్కడ పార్టీ చేసుకోవాలో ఇంకా నిర్ణయించుకోలేదా? అయితే ఈ  ఐడియాలు మీకోసమే ..!

1. దగ్గరి స్నేహితులతో పీజే పార్టీ..

పైజామా పార్టీలంటే ఇష్టం లేనిది ఎవరికి? ఫ్యాషనబుల్ అవుట్ ఫిట్స్, హై హీల్స్ వంటివన్నీ లేకపోయినా సరే.. సౌకర్యంగా నచ్చిన వ్యక్తులతో కలిసి గడిపే సౌకర్యం ఇందులో ఉంటుంది. అందుకే మీ దగ్గరి స్నేహితులతో పైజామా పార్టీ చేసుకోండి.

2. మీ స్నేహితులతో హోటల్‌కి వెళ్లండి..

మీరు మరీ ఎక్కువ దూరం వెళ్లలేకపోయినా.. మీ సిటీ నుంచి కాస్త దూరంలో ఏదైనా హోటల్ లేదా రిసార్ట్ బుక్ చేసుకొని అక్కడ పార్టీ చేసుకోండి.

3. ఆఖరి సూర్యాస్తమయం చూడండి.

ఈ సంవత్సరం ఆఖరి సూర్యాస్తమయం చూసేందుకు సాగర తీరానికో.. ట్యాంక్ బండ్ ఒడ్డుకో చేరుకోండి. మంచి ఫొటోలు కూడా దిగండి.

4. సైలెంట్ డిస్కో పార్టీ చేసుకోండి.

ఇది చాలా విభిన్నంగా ఉంటుంది. ఎప్పుడూ చేయలేదు కాబట్టి.. కొత్తగా కూడా ఉంటుంది. ఓసారి ప్రయత్నించి చూడండి. ఇందులో స్పీకర్‌కి బదులుగా.. బ్లూ టూత్ కనెక్టెడ్ హెడ్ ఫోన్స్‌లో పాటలు వింటూ డ్యాన్స్ చేస్తారు.

5. బ్రేక్ ఫాస్ట్ పార్టీ చేసుకోండి.

రాత్రి పార్టీలను వదిలేసి బాగా నిద్రపోండి. ఉదయాన్నే తొందరగా లేచి బ్రేక్‌ఫాస్ట్ పార్టీతో మీ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి.

6. న్యూ ఇయర్ డిన్నర్ చేయండి

మీ స్నేహితులతో కలిసి డిన్నర్ చేస్తూ.. నచ్చిన డ్రింక్ తాగుతూ సెలబ్రేట్ చేసుకుంటే ఆ మజా వేరుగా ఉంటుంది కదా. మరి, మీరూ ఓసారి ప్రయత్నించండి.

7. న్యూ ఇయర్ డే పార్టీ ప్రయత్నించండి

సాధారణంగా కొత్త సంవత్సరం రాత్రి పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేసి.. ఉదయం మాత్రం సింపుల్‌గా గడిపేస్తారు చాలామంది. కానీ సంవత్సరంలో మొదటి రోజు.. మీకు నచ్చిన వ్యక్తులతో నచ్చిన విధంగా గడపడం కంటే ఆనందం ఏముంటుంది చెప్పండి? అంటూ డే పార్టీ కూడా చేసుకోండి.

8. ఒంటరిగా ఎంజాయ్ చేయండి.

కొత్తగా పెళ్లైన జంటలకు ప్రపంచాన్ని మర్చిపోయి.. కేవలం తామే ఒంటరిగా ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. అందుకే మీరే ఇంట్లో ఉండిపోయి ముద్దులతో, రొమాన్స్‌తో ఈ కొత్త సంవత్సరానికి రొమాంటిక్‌గా వెల్ కమ్ చెప్పండి.

9. అమ్మానాన్నలతో గడపండి.

నిజం చెప్పాలంటే.. మనలో అమ్మానాన్నలతో న్యూ ఇయర్ పార్టీ చేసుకునేవారు చాలా తక్కువే. వారితో కూడా సమయం గడపడం అవసరం. ఇది వారికే కాదు.. మీక్కూడా ఆనందాన్ని అందిస్తుంది. అందుకే వారితో పార్టీ చేసుకోండి.

10. మూవీ మారథాన్..

కొత్త సంవత్సరం వేళ పార్టీ తప్పనిసరి అని భావించని వారు కూడా ఉంటారు. నచ్చిన వారితో కలిసి ఎంజాయ్ చేయాలని అనుకునే వారి కోసమే ఇది. చక్కగా మీకు నచ్చిన సినిమాలు చూస్తూ.. నచ్చిన భోజనం చేస్తూ గడపండి.

11. డిష్ పార్టీ చేసుకోండి.

సాధారణంగా పాట్ లక్ పార్టీలు మనకు అలవాటే. న్యూ ఇయర్‌ని కూడా ఇలాగే గడపండి. ముందుగానే ప్లాన్ చేసుకొని.. ఒక్కొక్కరూ ఒక్కో వంటకం చేసి తీసుకువచ్చి.. టెర్రస్ లేదా గార్డెన్ ఏరియాలో కూర్చొని.. ఫన్ గేమ్స్ ఆడుకొని కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే సమయానికి.. కేక్ కోసి సెలబ్రేట్ చేసుకోండి. ముఖ్యంగా ఒకే కాలనీలో ఉండే వారు లేదా అపార్ట్‌మెంట్ స్నేహితులకు ఇది చక్కగా నప్పుతుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.