ADVERTISEMENT
home / Astrology
గ్రహణం ఏర్పడే సమయంలో.. దేవాలయాలని ఎందుకు మూసివేస్తారో తెలుసా?

గ్రహణం ఏర్పడే సమయంలో.. దేవాలయాలని ఎందుకు మూసివేస్తారో తెలుసా?

Why are Hindu temples closed during eclipses ?

ఈ సృష్టిలో మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని తెలుసుకునేందుకు మానవుడు ఎన్నో  ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అందుకు ప్రధానమైన కారణం.. తనకి తెలియని అంశాల పట్ల ఎంతో కొంత ఆసక్తి ఉండడం. అలాంటి ఆసక్తులలో ఒకటే.. గ్రహణం గురించి తెలుసుకోవడం.   సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణం ఏర్పడే సమయాల్లో దేవాలయాలని ఎందుకు మూసివేస్తారు? ఇక ఆ గ్రహణ సమయం ముగిశాక దేవాలయాన్ని శుభ్రపరిచి.. సంప్రోక్షలు నిర్వహించిన తరువాతే భక్తులను ఎందుకు అనుమతిస్తారు? లాంటి ప్రశ్నలు స్వతహాగా భక్తులకు రావడం సహజం. మరి మనం కూడా వీటికి సమాధానాలు తెలుసుకుందామా

హైదరాబాద్ కి మణిహారం.. చౌమహల్లా ప్యాలెస్ గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?

గ్రహణాలు రెండు రకాలు. అందులో మొదటిది సూర్య గ్రహణం (Solar Eclipse).. రెండవది చంద్ర గ్రహణం (Lunar Eclipse). ఈ రెండు గ్రహణాల సమయాల్లో కూడా.. మన దక్షిణాదిలో ఆలయాలని మూసివేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం – ఈ గ్రహణాలు ఏర్పడే సమయాల్లో ఆ గ్రహాల నుండి కిరణాలు భూమిని చేరడమే.

ADVERTISEMENT

అలా చేరిన కిరణాలు దేవాలయాలలోని దేవుని ప్రతిమలు లేదా యంత్రాల పైన కూడా ప్రసరించే అవకాశముంది. ఒకవేళ అదే గనుక జరిగితే… వాటి శక్తి తగ్గుతుందనేది ఓ ప్రధానమైన నమ్మకం. ముఖ్యంగా దేవాలయాల్లోని గర్భాలయాలపై ఈ కిరణాల ప్రభావం పడుతుందనేది కూడా ఓ నమ్మకం. స్త్రీల గర్భంతో సాధారణంగా ఈ గర్భాలయాలను పోల్చుతుంటారు. దానికి కారణాలు.. అవి అత్యంత సున్నితమైన భాగాలు కావడమే.

అలాగే గ్రహణం సమయంలో ప్రసరించే కిరణాలలో చెడు శక్తి.. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందట. ఆ శక్తి ఛాయలు పడకూడదనే ఈ సమయంలో దేవాలయాలను మూసివేయడం జరుగుతుంది. అలాగే గ్రహణం సమయాల్లో.. గర్భిణీ స్త్రీలను కూడా ఇంటి బయటకి తీసుకురారు. దీనికి ప్రధాన కారణం.. గర్భంలో ఉన్న శిశువు పై నెగటివ్ ఎనర్జీ పడకూడదనే ఆలోచన మాత్రమే. అయితే ఈ వాదనని ఖండించే వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి నమ్మకాలను.. మూఢనమ్మకాలుగా కొట్టిపారేసేవారు కూడా ఉన్నారు. 

‘పవర్ యోగా’తో.. మనకు కలిగే ప్రయోజనాలెన్నో ..!

అయితే చిత్రమేంటంటే.. మన రాష్ట్రంలోనే గ్రహణం సమయంలో మూసివేయని ఓ ప్రముఖ దేవాలయం కూడా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం చిత్తూర్ జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయం. 

ADVERTISEMENT

ఈ ఒక్క దేవాలయానికే ఎందుకు ఆ ప్రత్యేకత అంటే.. ఇక్కడ శివుడికి రక్షణ కవచంగా నవగ్రహ కవచం ఉండడమే. ఇది గుడికి బయట ఉంటుంది. అలాగే ఈ గుడిలో శివునికి నవగ్రహాలతో ఉన్న బంధం కారణంగా.. గ్రహణం సమయంలో కూడా అభిషేకాలు నిర్వహిస్తుంటారు. అలా చేయడం వల్ల నవగ్రహాల ప్రభావం ఇంకా పెరుగుతుందని భావిస్తుంటారు. అందుకే గ్రహణం సమయంలో దేవాలయాన్ని తెరిచే ఉంచుతారు.

ఇక ఈ ఏడాది సూర్య గ్రహణం విషయానికి వస్తే.. ఈ రోజు ఉదయం 8.03 గంటలకు ప్రారంభమైన ఈ గ్రహణం.. ఉదయం 11.11 గంటలకు ముగిసింది. మూడు గంటలపాటు కొనసాగిన ఈ సంపూర్ణ సూర్య గ్రహణం మన దేశంతో పాటు పలు దేశాలలో కనిపించింది. ముఖ్యంగా ధనురాశి వ్యక్తులు ఈ గ్రహణాన్ని చూడకూడదని.. అలాగే మూల నక్షత్రం వారికి ఈ గ్రహణం అనారోగ్య సంకేతాలు పంపుతుందని పండితులు తెలిపారు. ఈ గ్రహణం సందర్భంగా సువర్ణదానం చేయడం లేదా ఆవు నెయ్యి, నల్ల నువ్వులను బ్రాహ్మణులకు దానంగా ఇస్తే మంచి జరుగుతుందని పలు హిందూ గ్రంథాలు చెబుతున్నాయి.

కొత్త కథలకే.. ప్రేక్షకుల ఓటు : 2019 టాప్ టెన్ టాలీవుడ్ చిత్రాలివే..!                                                                                                   

26 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT