2020 లో మీ ఆనందం కోసం.. ఈ 20 మాటలు తప్పక చెప్పుకోండి.. | POPxo

2020 లో మీ ఆనందం కోసం.. ఈ 20 మాటలు తప్పక చెప్పుకోండి..

2020 లో మీ ఆనందం కోసం.. ఈ 20 మాటలు తప్పక చెప్పుకోండి..

ప్రతి సంవత్సరాన్ని మనం కొత్త ఆశలు, అంచనాలు, ఊహలతో ప్రారంభిస్తాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుండాలని భావిస్తాం. కానీ గత సంవత్సరంతో పోలిస్తే.. (Year) ఈ సంవత్సరంలో ఎలాంటి మార్పు లేకపోతే? కొత్త సంవత్సరం కూడా గతంలో మాదిరిగానే ఎలాంటి అంచనాలు లేకుండా సాగితే..? తలచుకుంటేనే భయంగా ఉంది కదా..! కానీ మనందరం మనుషులం కాబట్టి.. అలాగే జీవితం సాగిపోతుందని గుర్తుంచుకోవాలి. అయితే మన జీవితం ఎలా ఉన్నా.. మన విలువను మనం గుర్తించేందుకు మనకు మనం కొన్ని విషయాలను చెప్పుకోవాల్సి ఉంటుంది.

కొన్ని సార్లు మనకు మనం చెప్పుకునే ఈ మాటలు..మనలో ఎంతో ఆనందాన్ని (happiness) పెంచుతాయి. అయితే మనకు మనం ఎన్నిసార్లు సర్దిచెప్పుకున్నా.. మనకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. మన జీవితం ఎలా సాగినా మనం స్పెషల్ అని గుర్తుచేయడానికి ఓ స్నేహితురాలో.. తల్లిదండ్రుల్లో, తోబుట్టువులో.. లేక ఎవరో తెలియని ఓ వ్యక్తి ఉంటే బాగుంటుంది అనిపించడం సహజం. అందుకే మీకు తోడుగా మేమున్నాం. ఈ పేజీని బుక్ మార్క్ చేసుకొని మీరు డల్‌గా ఫీలైనప్పుడు చదువుకోండి. ఓ స్నేహితురాలు మీకు గుర్తుచేసినట్లు.. ఈ విషయాలన్నీ మేం మరోసారి మీకు గుర్తుచేస్తాం.

1. మీరు స్ట్రిక్ట్ డైట్ చేయాల్సిన అవసరం లేదు.

మీరు ఎలా ఉన్నా సరే.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం.. మీ శరీరాన్ని మీరు ఇష్టపడడం నేర్చుకోవాలి. మార్పులు అవసరం లేదు.

2. మీరు చాలా అందంగా ఉన్నారు.

అద్దంలో మీ ముఖాన్ని చూసి ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నా మీరు అందంగా ఉన్నట్లే..

3. అన్ని సజావుగా జరుగుతాయి.. కాస్త సమయం పడుతుందంతే..

2019 లో ముందు ఇబ్బంది పడినా.. ఆఖరికి అంతా సెట్ అయినట్లు ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది.

4. అలాంటివారిని వదిలించుకోండి.

మన జీవితంలో మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. 2019 లో చేయలేదు కాబట్టి.. ఇప్పుడు తప్పక చేయాల్సిందే.

5. రిజల్యూషన్స్ పాటించకపోవడం మరీ పెద్ద తప్పు కాదు..

మీరు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి. దానికి కొత్త సంవత్సరం రిజల్యూషన్ మాత్రమే తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. అందుకే మీరు కొత్త సంవత్సరం రిజల్యూషన్‌ను పాటించకపోవడాన్ని పెద్దగా పట్టించుకోకండి.

6. వీలైనంత ఎక్కువ ప్రయాణాలు చేయండి.

టూర్స్‌కి వెళ్లడం వల్ల అనుభూతులు మిగులుతాయి. ఇవి ఎప్పటికీ మధురానుభవాలుగా మిగిలిపోతాయి.

7. నెమ్మదిగా సాధించినా ఫర్వాలేదు.

ఫలానా వాళ్లు ఈ వయసుకల్లా సాధించారని.. మీరు కూడా సాధించాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ జరుగుతున్న విషయాలు మీరేంటో నిరూపించలేవు.

8. ద్వేషం పెంచుకోకండి.

ఇతరులు ఏదైనా తప్పు చేస్తే.. వారిని క్షమించడం అలవాటు చేసుకోండి. ఇది వారికోసం కాదు.. మీ సంతోషం కోసమే అని గుర్తుంచుకోండి.

9. కొత్తగా ప్రయత్నించండి.

మీరు అందరి కంటే ఎంతో విభిన్నం. ప్రత్యేకం. అందుకే కొత్తగా ప్రయత్నించండి.

10. ఇతరులతో పోల్చుకోవద్దు.

ప్రతి ఒక్కరి ప్రయాణం విభిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేరుకునే చోటు వేరుగా ఉంటుంది.

11. మీకోసం సమయం కేటాయించుకోండి.

ఎందుకంటే ఈ ప్రపంచంలో మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి మీరే. మీకు మీరు ప్రాధాన్యం ఇచ్చుకోవడం ఎంతో అవసరం.

ఒక్క లంగా ఓణీ.. ఐదు రకాలుగా.. ఈ పండక్కి సందడి చేసేయండి..

12. మీకు నచ్చిన వాళ్లతోనే గడపండి.

మీకు నచ్చినవాళ్లతో గడపడం అనేది ప్రపంచంలోనే మనకు అత్యంత ఆనందాన్ని అందిస్తుంది. వాళ్లు మీకు జీవితంలో ఎదిగేందుకు తోడ్పడతారు.

13. ప్రతి ఒక్కరినీ ఇంప్రెస్ చేయాల్సిన పనిలేదు.

మీ జీవితంలో అందరికంటే మీకు మీరే ముఖ్యమైనవారు. అందుకే ప్రతి ఒక్కరికీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.

14. కృతజ్ఞతా భావం కలిగి ఉండండి.

దీనివల్ల మీకు చాలా ప్రయోజనాలు దక్కుతాయి.

15. బలహీనంగా ఉండడం తప్పు కాదు..

అదే మనల్ని మనుషుల్లా జీవించేలా చేస్తుంది.

16. నో చెప్పడం అలవాటు చేసుకోండి.

కొన్ని సార్లు 'నో' చెప్పడం వల్ల మన జీవితం మారిపోతుంది.

17. మీ మాజీ బాయ్ ఫ్రెండ్ మీ వ్యక్తిత్వాన్ని చాటలేడు.

మీ గతం ఎలాంటిదో దానిపై మీ వర్తమానం లేదా మీ వ్యక్తిత్వం ఆధారపడి ఉండదు.

మీరు కూడా టామ్ బాయ్‌లా ఉంటారా? అయితే ఈ లక్షణాలు మీకూ ఉంటాయి

 

18. చిన్న చిన్న గెలుపులను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి.

అలా చేయడం వల్ల మీరు జీవితంలో చాలా ముందుకు వెళ్లేలా మీకు మోటివేషన్ దక్కుతుంది.

19. మీ గురించి మీరు మంచి విషయాలు చెప్పుకోండి.

ఇందులోని ప్రతి పదం మీలోని మంచిని చాటేలా ఉండాల్సిందే.

20. కొత్త సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైంది.

ఇంకా మీ జీవితంలో చాలా మంచి విషయాలు జరుగుతాయి. వేచి చూడండి.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

Read More from Lifestyle
Load More Lifestyle Stories