06 జనవరి 2020 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

06 జనవరి 2020 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

ఈ రోజు (06 జనవరి 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి చూపిస్తారు. అలాగే నిరుద్యోగులు సోమరితనాన్ని వీడి.. ఇంకా బాగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకు ఈ రోజు ప్రతికూలమైన ఫలితాలు ఎదురు కావచ్చు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి.

వృషభం (Tarus) – ఈ రోజు మీరు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. అదేవిధంగా వ్యాపారస్తులకు పాత బాకీలు వసూలవుతాయి. సినిమా, మార్కెటింగ్ మొదలైన రంగాలకు చెందిన వ్యక్తులకు ఈ రోజు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు బదిలీలు సంభవించే అవకాశం ఉంది. 

మిథునం (Gemini) – ఈ రోజు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అపరిచితుల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. నిరుద్యోగులు నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని వీడాలి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. అలాగే ప్రత్యర్థుల నుండి సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తారు. అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. వివాహితులు పలు శుభకార్యాలకు హాజరవుతారు.

సింహం (Leo) – ఈ రోజు మీ కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. అలాగే ప్రేమికులకు ఈ రోజు అద్భుతమైన రోజు. వ్యాపార రంగంలోని వ్యక్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. అలాగే విద్యార్థులు తాము కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆలుమగల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు.

క‌న్య (Virgo) –  ఈ రోజు మీరు చాలా బిజీగా గడుపుతారు. అలాగే కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. మహిళలు స్వయం ఉపాధి రంగంపై ఆసక్తి పెంచుకుంటారు. అలాగే  కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఉద్యోగస్తులకు  అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి. 

ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి పలకాలి. అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పలు సంఘటనలు ఎదురుకావచ్చు. ఇలాంటి సమయంలోనే సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవాలి. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్థిరాస్తుల రంగంలో సేవలందించే వ్యక్తులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి.  మీరు నిజాయతీగా చేసే కొన్ని పనుల వల్ల.. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. అలాగే కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. 

ధనుస్సు (Saggitarius) –  ఈ రోజు మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరగవచ్చు. కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఆఫీసులో ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. అలాగే వాహన వినియోగంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..? 

మకరం (Capricorn) –  ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచండి. అలాగే మీ  ఖర్చులు కూడా పెరుగుతాయి. కొందరు వ్యక్తులు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి సమయాల్లో వివేకంతో వ్యవహరించండి. ఎలాంటి వాదోపవాదాలకు దిగవద్దు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. 

కుంభం (Aquarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంది. అలాగే పాత రుణాలు కూడా తిరిగి వసూలయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా తమ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగస్తులు కొంచెం కష్టపడితే.. కెరీర్ పరంగా తాము అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశముంది. 

మీనం (Pisces) –   ఈ రోజు  మీకు అన్ని విధాలుగా బాగా కలిసొచ్చే రోజు. మీ కుటుంబ సంబంధాలు బలపడతాయి. అలాగే వ్యాపార లావాదేవీలు కూడా లాభసాటిగా సాగుతాయి. ముఖ్యంగా మీ ఆర్థిక సంబంధాల్లో మార్పు కనిపిస్తుంది. కొన్ని ఊహించని వార్తలు సైతం వింటారు.

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం 

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.