09 జనవరి 2020 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

09 జనవరి 2020 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (9 జనవరి 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీకు ఆందోళనను కలిగించవచ్చు. అలాగే మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే  ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది.   

వృషభం (Tarus) – ఈ రోజు మీ స్నేహితులు మీకు నైతిక మద్దతు ఇస్తారు. అలాగే వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వివాహితులు భాగస్వామితో సరదాగా గడుపుతారు. ఆఫీసులో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అయితే ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ చూపండి. 

మిథునం (Gemini) –  ఈ రోజు నిరుద్యోగుల సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. సృజనాత్మక, మార్కెటింగ్ రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది.  మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీకు సరికొత్త సవాళ్లు ఎదురవుతాయి. అలాగే ఆఫీసులో ఒత్తిడి కూడా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ధననష్టం సంభవించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఏజెంట్లను నమ్మే విషయంలో అప్రమత్తంగా ఉండండి. 

సింహం (Leo) –  ఈ రోజు మీ ఆరోగ్య సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో కూడా వాతావరణం చాలా సరదాగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. ఉద్యోగస్తులు కొన్ని విషయాలలో నిజాయతీగా వ్యవహరించాలి. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఆలుమగలు లేదా ప్రేమికుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి విషయాల్లో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజు మీ పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. కానీ అక్కరకు రాని స్నేహాలను దూరం పెట్టండి. 

ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట 

తుల (Libra) – ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.అలాగే విద్యార్థులు మరింత కష్టపడి చదవాలి. ఉద్యోగస్తులు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. ఇలాంటి సందర్భాల్లోనే సహనంతో, సంయమనంతో వ్యవహరించాలి. వ్యాపారస్తులు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు పలు శుభవార్తలు వింటారు. అలాగే వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది.  వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది. స్నేహితుల నుండి విలువైన బహుమతులను అందుకుంటారు. 

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ప్రేమికులు చాలా ఆనందంగా గడుపుతారు. తమ జీవితానికి సంబంధించి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే  పాత స్నేహాలు కూడా మెరుగుపడతాయి. అలాగే మీ కుటుంబానికి సంబంధించి ప్రధానమైన విషయాలు చర్చకు వస్తాయి.

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..? 

మకరం (Capricorn) – ఈ రోజు  విద్యార్థులు చదువు విషయంలో.. అదనపు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వివాహితులు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది.

కుంభం (Aquarius) –  ఈ రోజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే రుణాలు ఇచ్చేటప్పుడు లేదా తీసుకొనేటప్పుడు వివేకంతో వ్యవహరించండి. అలాగే బ్రోకర్లు లేదా ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండండి. సృజనాత్మక, మార్కెటింగ్ రంగాల్లో వారికి ఈ రోజు లాభసాటిగా సాగుతుంది. 

మీనం (Pisces) – ఈ రోజు నిరుద్యోగులు, విద్యార్థులు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తారు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. అలాగే వివాహితులకు భాగస్వామితో తమ బంధాలు మరింత మెరుగుపడతాయి. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.