10 జనవరి 2020 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

10 జనవరి 2020 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (10 జనవరి, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే వ్యాపారస్తులు కాస్త ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది.  వివాహితులకు తమ భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులు వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు ప్రేమికుల సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అలాగే ఆలుమగలు తొలుత పొరపొచ్చాలు వచ్చినా తర్వాత కలిసిపోతారు. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంటుంది. వివాహితులు దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు క్రీడలు లేదా కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని విషయాలలో  మీకు మీ స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. 

కర్కాటక రాశి (Cancer) –  ఈ రోజు మీరు కొన్ని ఊహించని పరిణామాలను ఎదుర్కొంటారు. అలాగే కొందరు వ్యక్తులు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీ జీవిత భాగస్వామితో మరింత గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. అలాగే పాతమిత్రులు మిమ్మల్ని కలుస్తారు. 

సింహ రాశి (Leo) –  ఈ రోజు ప్రేమికుల మధ్య అపార్థాలు చోటుచేసుకొనే అవకాశం ఉంది. అలాగే అవివాహితులు శుభవార్తలు కూడా వింటారు. ఉద్యోగస్తుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రమోషన్లు దక్కడం లేదా బదిలీలు సంభవించే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరి పట్ల మరొకరు నిజాయతీతో వ్యవహరించడం మంచిది. విద్యార్థులు ఇంకా కష్టపడి చదవాలి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే కొత్తదంపతులు దూర ప్రాంతాలను సందర్శిస్తారు. అదేవిధంగా ఖరీదైన బహుమతులను కూడా అందుకుంటారు.  కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీరు తీసుకొనే కొన్ని నిర్ణయాలు..  వ్యాపారానికి ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఆలుమగల మధ్య కూడా మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. 

ధను రాశి (Saggitarius) -  ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించండి. అలాగే ఆఫీసులో ఆడిట్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక పెండింగ్ పనులను పూర్తి చేయండి.  వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగులు వేయండి.  విద్యార్థులు ఇంకాస్త కష్టపడి చదవాలి

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు ప్రేమికుల సంబంధాలు పటిష్టంగా మారతాయి. అలాగే మీ స్నేహితుల సహాయంతో వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) -  ఈ రోజు నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. అలాగే వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.  సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలో పురోగమనం ఉంటుంది. విద్యార్థులు కొన్ని విషయాలలో నిర్లక్ష్యాన్ని వీడాలి. 

మీన రాశి (Pisces) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యాపారం నెమ్మదిగా సాగడం వల్ల.. ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. అలాగే రుణాలు తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల నుండి అన్ని విధాలుగా సహాయ, సహకారాలు పొందుతారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.