12 జనవరి 2020 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

12 జనవరి 2020 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (12 జనవరి 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కొత్త పరిచయాలు పెరుగుతాయి. అలాగే ప్రముఖ వ్యక్తుల నుండి ఆహ్వానాలు అందుతాయి. అదేవిధంగా స్థిరాస్తి వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. వివాహితులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగుల శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. 

వృషభం (Tarus) - ఈ రోజు ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయవుతారు. అలాగే వివాహితులు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులు ఆర్ధికాభివృద్ధి సాధిస్తారు. ప్రేమికులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు వివాదాల నుంచి బయటపడతారు. 

మిథునం (Gemini) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. అలాగే వ్యాపారస్తులు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అలాగే కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 

కర్కాటకం (Cancer) - ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ప్రయాణాలు సంభవిస్తాయి. అలాగే కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులతో ఏర్పడిన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్వయంఉపాధి రంగంవైపు అడుగులు వేసే నిరుద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు.  అలాగే వివాహితులు పలు శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారస్తులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే ఉద్యోగస్తులు పెండింగ్ పనులను పూర్తిచేయడం మంచిది. 

క‌న్య (Virgo) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. అలాగే వ్యాపారస్తుల ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. 

'డిసెంబరు' నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా 'ప్రత్యేకం' : ఎందుకో తెలుసా..?

తుల (Libra) - ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు.  అలాగే విద్యార్థులు కళలు, క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. 

వృశ్చికం (Scorpio) - ఈ రోజు ప్రేమికులకు శుభదినం. తమ జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు కొన్ని వివాదాలకు  దూరంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. వివాహితులు కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు మీరు వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే నిరుద్యోగులు ఇంకాస్త కష్టపడాలి. మీ జీవితాన్ని ప్రభావితం చేసే సంఘటనలు జరగవచ్చు. కొన్ని విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

మకరం (Capricorn) -  ఈ రోజు మీరు శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఆలుమగల మధ్య చిన్న చిన్న గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. 

కుంభం (Aquarius) -  ఈ రోజు మీరు కొన్ని విచిత్రమైన సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల పట్ల ఆసక్తి చూపిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితానికి సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆఫీసులో ఉద్యోగులకు అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. 

మీనం (Pisces) - ఈ రోజు మీరు అనూహ్యమైన సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే కొన్ని వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది. 


2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి... అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి