8 జనవరి 2020 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

8 జనవరి 2020 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

ఈ రోజు (08 జనవరి, 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పని చేస్తారు. అలాగే మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. అదేవిధంగా మీ భాగస్వామితో కలిసి బయటకెళ్లే కార్యక్రమాలు ఉండవచ్చు. అలాగే మీ కుటుంబం కోసం మీ సమయాన్ని ఎక్కువగా కేటాయించాల్సి వస్తుంది. 

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు మీరు ఒంటరిగా సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. అలాగే అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండండి. కొన్ని విషయాలలో సమయపాలన పాటించండి. మీ సన్నిహితులు మీ సలహాలు, సూచనలను కోరి వస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి.  

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీ పనులన్నీ నత్తనడకన సాగుతాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించి మీరు వేరే ఆలోచనల్లో ఉంటారు. అయినా సరే ప్రస్తుత ప్రాజెక్టు కోసం కష్టపడి పని చేస్తుంటారు. పెండింగ్‌లో ఉన్న పనులను ముందు పూర్తిచేయడం మంచిది. 

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు మీరు ఒకసారి ఒకే అంశంపై ఫోకస్ పెట్టండి. అలాగే ఇతరులకు  మీ పని వేగాన్ని అందుకోవడం కష్టంగా ఉంటుంది. కొన్ని విషయాలలో సంయమనం పాటించండి. కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి. ఇతరుల సమస్యల్లో జోక్యం చేసుకోకండి. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు మీ పని సాదాసీదాగా సాగుతుంది. అలాగే కొందరి వ్యవహార శైలి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీలో దాగి ఉన్న ఫీలింగ్స్ అన్నింటినీ మీ కుటుంబంతో పంచుకోండి. స్నేహితులతో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు ఒత్తిడి కారణంగా.. అనుకున్న పనులన్నింటినీ పూర్తి చేయలేకపోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా అనుకోని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారస్తులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మహిళలు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు.

తుల రాశి (Libra) – ఈ రోజు మీరు క్రియేటివ్ ఆలోచనలకు పెద్దపీట వేస్తారు. అలాగే పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకొనే విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. మహిళలు స్వయం ఉపాధి రంగం పట్ల ఆసక్తిని చూపించే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీకు పని చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వాయిదా పడిన పనులన్నీ పూర్తి చేయాల్సి వస్తుంది.  మీ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి. అలాగే పాత స్నేహితులు, బంధుమిత్రులు మిమ్మల్ని సందర్శిస్తారు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు మీకు చాలా సాధారణంగా ఉంటుంది. మీ దినచర్యలో భాగంగా ఎక్కువశాతం పిల్లలతో, కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఉద్యోగస్తులు కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు. అలాగే వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి.

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీరు కొన్ని అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల పనులు చాలా నెమ్మదిగా సాగుతాయి. ఒకవేళ ఉద్యోగం మార్పు లేదా ప్రమోషన్ గురించి మీరు ఎదురు చూస్తుంటే.. అవి వాయిదా పడే అవకాశం ఉంది. కానీ కుటుంబ జీవితం మాత్రం ఆనందంగా సాగుతుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు మీరు చాలా శ్రద్ధతో పనిచేస్తారు. ఈ క్రమంలో మీ శ్రమకు తగిన ఫలితం కూడా పొందుతారు.  మీ ఆలోచనలను మార్చుకోవడానికి, పునరాలోచించడానికి కొంత సమయం లభిస్తుంది. అలాగే కొన్ని విషయాలలో.. మీరు  మీ తోటి వారి సహాయం తీసుకుంటారు. 

మీన రాశి  (Pisces) – ఈ రోజు మీరు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే ఇతరులు మీరు చేసే పనిని ప్రశంసిస్తారు.  అదేవిధంగా కుటుంబంలో జరిగిన గొడవలతో ఇబ్బంది పడతారు. అలాగే ఇతరుల గురించి మీరు ఒక అభిప్రాయానికి వచ్చే ముందు బాగా ఆలోచించండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.