తెలుగువారి అందాల చందమామ అనగానే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చే పేరు కాజల్ అగర్వాల్ (Kajal aggarwal). అందమైన రూపం, ఆకట్టుకునే అభినయం మాత్రమే కాదు.. అందరి చూపునీ ఇట్టే ఆకర్షించే స్టైలిష్ లుక్స్, ఫ్యాషన్స్ కూడా ఈ అమ్మడి సొంతం. హాట్ లుక్స్‌తో సెగలు పుట్టించాలన్నా, కూల్ లుక్స్‌తో హుందాగా మెరిసిపోవాలన్నా అది ఈ భామకే చెల్లింది.
ముఖ్యంగా ఏ అవుట్ ఫిట్ ధరించినా.. దానిని ఎంతో ఆత్మవిశ్వాసంతో క్యారీ చేస్తూ ఆ డ్రస్ అందాన్ని పదింతలయ్యేలా చేస్తుంది కాజల్. కావాలంటే ఆమె స్టైల్ ఫైల్ నుంచి తీసుకున్న కొన్ని ఫ్యాషన్స్‌ను మీరూ చూడండి. ట్రెండీగా కనిపిస్తూ, సౌకర్యవంతంగా అనిపించే ఫ్యాషన్ అంటే.. చాలామంది అమ్మాయిలకు ముందుగా గుర్తుకొచ్చేది జంప్ సూట్స్.
వీటిని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ వార్డ్ రోబ్‌లో భాగం చేసుకుని పలు సందర్భాల్లో ధరించి మెరిసిపోయారు కూడా. అయితే వారందరిలోనూ కాజల్ శైలి కాస్త భిన్నమనే చెప్పచ్చు. కావాలంటే మీరే చూడండి.. ఫుల్ హ్యాండ్స్, కాలర్ నెక్ ఉన్న ఎరుపు రంగు జంప్ సూట్‌లో ఎలాంటి యాక్సెసరీస్ ఉపయోగించకుండానే ఎర్రని గులాబీలా భలే అందంగా మెరిసిపోతోంది కదూ.
View this post on InstagramWearing @integumentofficial styling @archamehta hair @divya.naik25 makeup @vishalcharanmakeuphair
బ్లాక్ కలర్ అంటే ఇష్టపడని అమ్మాయి ఉంటుందా?? అందుకే తప్పనిసరిగా ఏదో ఒక అవుట్ ఫిట్ ఈ కలర్‌లో ఉండేలా జాగ్రత్తపడుతుంది ప్రతి అమ్మాయి. అయితే కొందరు ప్లెయిన్ కలర్స్‌నే కాంబినేషన్ తరహాలో ధరించి మెరిసిపోతే.. ఇంకొందరు మిక్స్ అండ్ మ్యాచ్ తరహాలో వీటిని ధరిస్తూ ఉంటారు. కాజల్ అగర్వాల్ కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. ప్లెయిన్ బ్లాక్ కలర్ టాప్‌కు, ఫ్లోరల్ ప్రింటెడ్ బాటమ్, మ్యాచింగ్ ఫుట్ వేర్, బెల్ట్.. వంటివి జత చేసి సింపుల్‌గానే స్టైలిష్‌గా కనిపిస్తోంది కదూ.
View this post on Instagram@archamehta @divya.naik25 @vishalcharanmakeuphair. thank you for the 📸 @goharography
లాంగ్ లేదా మినీ.. పొడవు ఎంతైనా సరే.. ప్రతి అమ్మాయి వార్డ్ రోబ్‌లోనూ స్కర్ట్స్ తప్పకుండా ఓ భాగమవుతాయి. అయితే వీటిని కూడా అందరిలానే ధరిస్తే ఇక అందులో మన మార్క్ ఏం కనిపిస్తుంది చెప్పండి?? అందుకే కాజల్‌లా కాస్త భిన్నంగా ధరించేందుకు ప్రయత్నించండి. డెనిమ్ క్లాత్‌తో రూపొందించిన స్కర్ట్ అండ్ టాప్‌కు డిఫరెంట్ షేడెడ్ లెదర్ లేయర్‌తో జత చేసి కూల్ గ్లాసెస్‌తో హాట్ లుక్స్‌తో ఎలా కనిపిస్తోందో చూడండి.
View this post on Instagram
కలర్ కాంబినేషన్స్‌లో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అన్నా.. మనల్ని బోల్డ్‌గా కనిపించేలా చేస్తూ.. బ్యూటీఫుల్‌గా మెరిపించాలన్నా అది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌కే సాధ్యం. అయితే దీనిని కూడా ఎవరికి వారు భిన్నమైన శైలుల్లో ధరిస్తూ ఉంటారు. కాజల్ ధరించిన ఈ స్లీవ్ లెస్ అవుట్ ఫిట్ చూడండి.. వదులుగా ఉంటూనే వావ్ అనిపించే లుక్‌ని కూడా ఇస్తోంది కదూ. అందుకే కాజల్ కూడా సింపుల్ హెయిర్ స్టైల్ ఒక్కటి మ్యాచ్ చేసి స్టైలిష్ బ్యూటీ అనిపించుకుంది.
View this post on Instagram@ritikamirchandani I love my pretty present 💝 merci beacoup 😘 #vishescomedhru
ట్రెడిషనల్‌గా కనిపించాలి.. అలాగే ఫ్యాషనబుల్ గానూ మెరిసిపోవాలి. ఈ మాటలు వినగానే చాలామంది ముందుగా ఎంపిక చేసుకునేది శారీ లేదా అనార్కలీ. కానీ ఇప్పుడు అవి కూడా కామన్‌గా మారిపోయాయి. మరేం చేయాలంటారా?? అయితే కాజల్‌ని ఫాలో అయితే సరి.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న స్లిట్టెడ్ మోడల్‌లో రూపొందించిన పేస్టల్ షేడ్ చుడీదార్‌లో ఎంత అందంగా మెరిసిపోతోందో మీరే చూడండి..
అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే ప్రకాశవంతమైన కలర్స్‌లో బ్లూ కూడా ఒకటి. అలాంటి బ్లూ కలర్‌ని వేరే కలర్స్‌తో మిక్స్ చేసి ధరిస్తే ఎలా ఉంటుందో తెలుసా?? ఇదుగో.. మన కాజల్ అగర్వాల్‌ని చూస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది. రాయల్ లుక్‌తో చాలా హుందాగా మనల్ని మెరిపించడమే కాదు.. అంతే స్టైలిష్‌గానూ మనం కనిపించేలా చేస్తుంది.
View this post on Instagram#nofilter @archamehta @vishalcharanmakeuphair @divya.naik25 @kishorekotumphotography
సాధారణంగా అమ్మాయిలు చాలా సున్నిత మనస్కులు కాబట్టి.. వారిని పూలతో పోలుస్తూ ఉంటారు. అలాంటి అందమైన పూలనే డ్రస్‌గా ధరిస్తే ఎలా కనిపిస్తుందో మీరే చూడండి.. పీచ్ కలర్ రఫెల్డ్ లాంగ్ గౌన్ పై ఉన్న పూలని చూడండి.. కాజల్ అందాన్ని మరింత పెంచుతున్నాయని అనిపిస్తోంది కదూ..
View this post on Instagram
డ్రస్సింగ్ చాలా సింపుల్‌గా ఉండాలి.. అలాగే మనల్ని స్టైలిష్‌గానూ మెరిపించాలి. మన మార్క్ ఏంటో ఆ ఫ్యాషన్‌లో కొట్టొచ్చినట్టు కనిపించాలి. ఇలా అమ్మాయిలకు తమ తమ ఫ్యాషన్స్ గురించి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అలాగే కాజల్ కూడా.. డెనిమ్ క్లాత్‌తో తయారుచేసిన టాప్, బాటమ్‌కు తెలుపు రంగు ప్రింటెడ్ ఓవర్ కోట్ జత చేసి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. మీరూ ఇలా మీదైన శైలిలో భిన్నమైన ఫ్యాషన్స్‌తో మెరుపులు మెరిపించడానికి ప్రయత్నించండి మరి..
ఇవన్నీ కాజల్ అగర్వాల్ స్టైల్ ఫైల్‌లో కొన్ని టాప్ ఫ్యాషన్స్ మాత్రమే. ఈ అమ్మడి ఇన్ స్టాగ్రామ్‌లో ఇంకా చాలా ఫ్యాషన్స్, ఫొటోలు ఉన్నాయి. కావాలంటే మీరే ఓసారి చూసేయండి..
ఇవి కూడా చదవండి
లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటోన్న.. అందాల చందమామ కాజల్ అగర్వాల్..!
బాపూ గారి బొమ్మ ప్రణీత ఫ్యాషన్స్ ఫాలో అవ్వండి.. మీరూ భలేగా మెరిసిపోండి..!