ADVERTISEMENT
home / Food & Nightlife
డైట్‌లో  ఉన్నారా? అయితే ఈ తక్కువ క్యాలరీ వంటలు ప్రయత్నించండి..

డైట్‌లో ఉన్నారా? అయితే ఈ తక్కువ క్యాలరీ వంటలు ప్రయత్నించండి..

(Tasty Low calorie Recipes)

చాలామంది కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే.. బరువు తగ్గడాన్ని ఒక రిజల్యూషన్‌గా పెట్టుకుంటారు. కొత్త డైట్ (Diet) పాటించాలని భావిస్తారు. కేవలం ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. తక్కువ కాలరీలు గల పదార్థాలపైనే మొగ్గు చూపిస్తారు. కానీ అవి రుచిగా లేకపోతే మాత్రం.. మళ్లీ కథంతా మొదటికొస్తుంది.

ఆరోగ్యకరమైన పదార్థాలతో రుచికరమైన వంటలు చేయడం ఎలాగో తెలీక.. తమ డైట్ రిజల్యూషన్‌ని పక్కనే పెట్టే వారు కూడా చాలామందే ఉంటారు. అయతే ఈ డైట్ అసలు రుచిగా ఉండదని ఎవరు అన్నారు ? ఇక్కడ మనం రుచి గురించి రాజీ పడాల్సిన అవసరం లేదు. ఇటు ఆరోగ్యంతో పాటు.. ఇటు రుచిని కూడా సమపాళ్లలో అందించే వంటలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిలో ప్రొటీన్ అధిక మోతాదులో ఉండడం వల్ల.. వీటి వల్ల మీరు సులువుగా బరువు తగ్గే వీలు కూడా ఉంటుంది. మీ రోజువారీ ప్రొటీన్ స్థాయికి చేరుకునేందుకు.. ఇక పౌడర్ల పైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మరి, ఈ వంటలు చేయడం ఎలాగో తెలుసా..?

పనీర్ మేథీ రోటీ

ADVERTISEMENT

కావాల్సినవి

లో ఫ్యాట్ పనీర్ – అర కప్పు
మెంతి ఆకులు – ఐదు టేబుల్ స్పూన్లు
గోధుమ పిండి – ముప్పావు కప్పు
నూనె – అర టీస్పూన్
లో ఫ్యాట్ పెరుగు – టేబుల్ స్పూన్
కారం – అర టీస్పూన్
పసుపు – చిటికెడు
ఇంగువ – చిటికెడు
చక్కెర – అర టీస్పూన్
ఉప్పు – తగినంత

తయారీ

ఒక బౌల్‌లో అన్ని పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. మెత్తగా చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టి.. పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఆరు సమాన భాగాలుగా చేసుకొని చపాతీల్లా చేసుకోవాలి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ మీద కొద్దిగా నూనె వేసుకొని వీటిని కాల్చుకోవాలి. ఇందులో ఒక్కో రోటీ 79 క్యాలరీలు ఉంటుంది. కాబట్టి మీ క్యాలరీల లెక్క ప్రకారం దీన్ని తీసుకోండి.

ADVERTISEMENT

ఆనియన్ సూప్

కావాల్సినవి

ఉల్లిపాయలు – నాలుగు
వెన్న – అర టీస్పూన్
ఆలివ్ ఆయిల్  – కొంచెం స్ప్రే చేస్తే చాలు
వైట్ వైన్ – మూడు టేబుల్ స్పూన్లు
చికెన్ స్టాక్ – నాలుగు కప్పులు
ఉప్పు, మిరియాల పొడి – తగినంత
వెల్లుల్లి పేస్ట్ – టీస్పూన్
ఛీజ్ వేసి బేక్ చేసిన టోస్ట్

తయారీ

ADVERTISEMENT

లావుపాటి అడుగు ఉన్న ఓ ప్యాన్ తీసుకొని.. అందులో వెన్న వేశాక ఆలివ్ ఆయిల్ స్ప్రే చేయాలి. తర్వాత వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తక్కువ మంటపై ఇరవై నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వైట్ వైన్ వేసుకోవాలి. బంగారు రంగులోకి మారిన తర్వాత అందులో చికెన్ స్టాక్ వేసుకోవాలి. కావాలంటే వెజిటెబుల్ స్టాక్ కూడా ఉపయోగించవచ్చు. ఇది మరిగిన తర్వాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి.. ఛీజ్ కూడా వేశాక బేక్ చేసిన టోస్ట్‌తో పాటు సర్వ్ చేసుకోవాలి. ఈ సూప్ ఒక కప్పు తీసుకుంటే దాని నుంచి 271 క్యాలరీలు లభిస్తాయి.

క్వినోవా రిసోట్టో

కావాల్సినవి

క్వినోవా – కప్పు
ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూన్
ఉల్లిపాయ – ఒకటి
వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్
పుట్ట గొడుగులు – పది
వైట్ వైన్ – కప్పు
చికెన్ స్టాక్ – ఒకటిన్నర కప్పు
ఉప్పు, మిరియాల పొడి – తగినంత
ఛీజ్ – రెండు టేబుల్ స్పూన్లు

ADVERTISEMENT

తయారీ

క్వినోవాను నీటిలో కడిగి నానబెట్టుకోవాలి. పుట్టగొడుగులను వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్‌లో ఆలివ్ ఆయిల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. తక్కువ మంట పై వేయించుకోవడం వల్ల ఇవి మాడిపోకుండా ఉంటాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత.. అందులో పుట్టగొడులు, వైట్ వైన్ వేయాలి. ఇవి కాస్త వేగిన తర్వాత  అందులో క్వినోవా వేసి ఉడకనివ్వాలి. కాస్త ఉడికిన తర్వాత అందులో ఉప్పు వేయాలి. ఆ తర్వాత చికెన్ స్టాక్ అందులో పోసి.. క్వినోవా ఉడికే వరకూ ఉంచుకోవాలి. చివరిగా మిరియాల పొడి వేసి దింపుకోవాలి. ఈ రిసోటో ఒక కప్పు తీసుకుంటే.. అందులో 280 క్యాలరీలు ఉంటాయి.

ఓట్స్ మూంగ్ దాల్ టిక్కీ

కావాల్సినవి

ADVERTISEMENT

పెసర పప్పు – అర కప్పు
ఓట్స్ – అర కప్పు
పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు – మూడు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు – అర టీస్పూన్
చాట్ మసాలా – రెండు టీస్పూన్లు
కారం – రెండు టీస్పూన్లు
గరం మసాలా – పావు టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ – టీస్పూన్
కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
నూనె – రెండు టీస్పూన్లు

తయారీ

ముందుగా దీనికోసం కప్పు నీళ్లలో పెసర పప్పును వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత నీళ్లు తీసేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌తో పాటు ఓట్స్ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిగిలిన పదార్థాలన్నింటినీ కలిపి పన్నెండు సమానమైన భాగాలుగా చేసుకోవాలి. ఈ భాగాలను టిక్కీల్లా వత్తుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ మీద కొద్ది కొద్దిగా నూనె వేస్తూ వీటిని కాల్చుకోవాలి. మధ్యలో మూత పెట్టడం వల్ల సులువుగా టిక్కీ ఉడికిపోతుంది. బంగారు రంగులోకి వచ్చిన తర్వాత గ్రీన్ చట్నీ లేదా చింత పండు చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇందులో ఒక్కో టిక్కీ‌కి 54 క్యాలరీలు లభిస్తాయి.

ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే.. మీరే కిచెన్ క్వీన్ ..!

ADVERTISEMENT

దహీ చనా కర్రీ

కావాల్సినవి

నానబెట్టిన శనగలు – కప్పు
జీలకర్ర – అర కప్పు
ఆవాలు – పావు కప్పు
బిర్యానీ ఆకులు – రెండు
ఎండు మిర్చి – రెండు
ఇంగువ – చిటికెడు
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ – టీస్పూన్
కారం – టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
పెరుగు – కప్పు
శనగ పిండి – మూడు టేబుల్ స్పూన్లు
కొత్తి మీర – నాలుగు టేబుల్ స్పూన్లు
నూనె – రెండు టీస్పూన్లు
ఉప్పు – తగినంత

తయారీ

ADVERTISEMENT

ముందుగా ఓ ప్రెషర్ కుక్కర్ ప్యాన్‌లో నూనె వేసి.. అందులో జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకు, ఎండు మిర్చి, ఇంగువ వేసి అవన్నీ చిటపటమనే వరకూ వేచి చూడాలి. తర్వాత అందులో శనగలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, రెండు కప్పుల నీళ్లు పోసి.. ప్రెషర్ కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఆగాలి. శనగలు ఉడికిన తర్వాత.. మూత తీసి అందులో పెరుగు పోయాలి. తర్వాత శనగల్లో అది బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత నాలుగైదు నిమిషాల పాటు ఉడికించి.. బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కొత్తి మీర వేసి గార్నిష్ చేసి దింపుకోవాలి. ఈ కూర నలుగురికి సరిపోతుంది. ఇందులో ఆరు వందల క్యాలరీలు ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి 150 క్యాలరీలు లభిస్తాయన్నమాట.

మీకు ఆమ్లెట్స్ అంటే ఇష్టమా..? అయితే టాప్ 10 రెసిపీలు ట్రై చేయండి

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

08 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT