ADVERTISEMENT
home / వినోదం
Tollywood Best Songs 2019 : ప్రేక్షకుల మదిని దోచిన.. 20 పసందైన తెలుగు పాటలు మీకోసం ..!

Tollywood Best Songs 2019 : ప్రేక్షకుల మదిని దోచిన.. 20 పసందైన తెలుగు పాటలు మీకోసం ..!

 

Top 20 Tollywood Songs – 2019

పాట అనేది కొంతమందికి ప్రశాంతతనిస్తే, మరికొంతమందిలో హుషారును నింపుతుంది. అలాగే ఇంకొంతమందిలో స్ఫూర్తిని రగిలిస్తుంది. అందుకే మన జనసామాన్యంలో పాటకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అదే సినిమా పాట విషయానికి వస్తే.. ఆ ప్రాధాన్యం పదింతలు అవ్వడమే కాకుండా.. ఎందరికో అది వారి జీవనంలో ఒక భాగంగా మారింది. 

‘ప్రేమించిన వాడితో పెళ్లికి.. 9 ఏళ్ళ పాటు నిరీక్షించిన అనసూయ’.. ఓ అందమైన ప్రేమకథ మీకోసం

ADVERTISEMENT

మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న సినిమా పాటకి సంబంధించి.. 2019 సంవత్సరంలో  ప్రేక్షకుల మనసులను దోచిన మంచి గీతాలను గురించి తెలుసుకుందాం.

1. ప్రియతమా ప్రియతమా – మజిలీ

సమంత – నాగ చైతన్య జంటగా వచ్చిన ‘మజిలీ’ చిత్రంలో .. చైతు గురించి సమంత పాడుకునే పాటగా ఇది మనకి చిత్రంలో కనిపిస్తుంది. ఈ సినిమాకే ఇది హైలైట్ పాట. ఈ పాటకి స్వరాలు అందించింది గోపి సుందర్ కాగా.. రచించింది చైతన్య ప్రసాద్. చిన్మయి ఈ గీతాన్ని ఆలపించారు. 

 

ADVERTISEMENT

2. ప్రేమ వెన్నెల -చిత్రలహరి

ఈ సినిమా టైటిల్ ‘చిత్రలహరి’ అని పెట్టడం ద్వారానే.. ఈ చిత్రంలో మంచి పాటలకు ఆస్కారం ఉందని చెప్పకనే చెప్పాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఇక ఈ మెలోడీ పాటకి దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందించగా.. శ్రీమణి లిరిక్స్ రాయడం జరిగింది. ప్రేమవెన్నెల అనే ఈ పాటని ఆలపించింది సుదర్శన్ అశోక్.

 

3. గ్లాస్ మేట్స్ – చిత్రలహరి

ADVERTISEMENT

ఈ ‘చిత్రలహరి’ చిత్రం నుండే మరో హుషారైన పాటగా.. ఈ ‘గ్లాస్ మేట్స్’ అనే సాంగ్ పాపులర్ అయింది. ముఖ్యంగా బ్యాచిలర్స్ & పార్టీ గ్యాంగ్ ఈ పాటకి ఫిదా అయ్యారు. ఇటువంటి కిక్కిచ్చే పాటని రాసింది చంద్రబోస్ అయితే.. పాడింది రాహుల్ సిప్లిగంజ్, పెంచల్ దాస్ & దేవిశ్రీప్రసాద్.

 

4. అదేంటో గాని ఉన్నపాటుగా – జెర్సీ

ఈ ఏడాది వచ్చిన మంచి సినిమాల్లో జెర్సీ ఒకటి. ఆ ‘జెర్సీ’ చిత్రంలోని మంచి పాటలలో ఈ ‘అదేంటో’ అనే పాట కూడా ఒకటి. హీరో, హీరోయిన్‌‌ల మధ్య సాగిన ప్రేమ ప్రయాణాన్ని..  ఈ పాటలో చక్కగా ఆవిష్కరించడం జరిగింది. ఈ పాటని రాసింది కృష్ణకాంత్ అయితే.. స్వరాలు సమకూర్చింది.. అలాగే పాడింది అనిరుధ్ రవిచందర్.

ADVERTISEMENT

 

5. పదరా పదరా – మహర్షి

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా వచ్చిన ‘మహర్షి’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు. ఆ చిత్ర కథని తెలిపేలా ఉన్న ‘పదరా పదరా’ అనే పాట కూడా.. అంతే స్థాయిలో సూపర్ హిట్ అయింది. ఈ పాటని శ్రీమణి రచించగా.. శంకర్ మహాదేవన్ తన అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశాడు. ఇక ఇంత మంచి పాటకి స్వరాలు అందించింది దేవిశ్రీప్రసాద్.

 

ADVERTISEMENT

6. నాకు నువ్వని – మల్లేశం

ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితాన్ని ఆధారం చేసుకుని తీసిన చిత్రం ‘మల్లేశం ‘. ఈ ‘మల్లేశం ‘ చిత్రంలో భార్యాభర్తల బంధాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించిన పాట ఈ ‘నాకు నువ్వని’. ఈ పాటని రాసింది చంద్రబోస్ కాగా.. సంగీతాన్ని అందించింది మార్క్ రాబిన్. ఇక ఈ పాటని పాడింది రమ్య బెహ్రా & శ్రీకృష్ణ.

 

7. వగలాడి – బ్రోచేవారెవరురా

ADVERTISEMENT

ఇప్పటి కాలమానం పరిస్థితులకి హాస్యాన్ని జోడించి తీసిన చిత్రం బ్రోచేవారెవరురా. ఈ చిత్రంలో హుషారైన ఈ ‘వగలాడి’ అనే పాటకి స్వరాలు అందించింది వివేక్ సాగర్ కాగా.. లిరిక్స్ అందించింది హసిత్ గోలి. ఇక ఈ పాటని వివేక్ సాగర్, బాలాజీ, రామ్ మిరియాల & మనీషా పాడారు.

“ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి.. నెలరోజులు చాలు” – నటి ‘రాశి’ ఆసక్తికర లవ్ స్టోరీ ..!

 

8. ఓ బేబీ – ఓ బేబీ

ADVERTISEMENT

సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ చిత్రంలోని టైటిల్ పాట చాలా హుషారుగా.. అదే సమయంలో ఆమె పాత్రని వివరించేలా ఉంటుంది. ఇదే పాట ఎంతోమందిని ఆకట్టుకోవడం విశేషం. ఇక ఈ పాటని రాసింది లక్ష్మి భూపాల కాగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మిక్కీ జె మేయర్ స్వరాలు అందించారు.

 

9. నింగిలోని పాలపుంత – దొరసాని

1980ల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులని ఆధారంగా చేసుకొని తీసిన చిత్రం దొరసాని. ఈ చిత్రంలోని పాటలన్నీ చాలా బాగుంటాయి. అందులోని ఒక పాటే – ‘నింగిలోని పాలపుంత’. ఈ పాటకి స్వరాలను ప్రశాంత్ విహారి అందించగా.. గోరెటి వెంకన్న రచించారు. ఇక ఈ పాటకి అనురాగ్ కులకర్ణి తనదైన రీతిలో ప్రాణం పోశారు. 

ADVERTISEMENT

 

 

10. దిమాక్ ఖరాబ్ – ఇస్మార్ట్ శంకర్

రామ్ – పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన పక్కా మాస్ మసాలా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ  చిత్రంలో దాదాపు అన్ని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అందులో చాలా వైవిధ్యంగా సాగిన పాటే – దిమాక్ ఖరాబ్.   ఈ పాటని కాసర్ల శ్యామ్ రచించగా… మణిశర్మ స్వరాలను అందించారు. మరి ఇంతటి హుషారైన పాటని పాడింది – కీర్తన శర్మ, సాకేత్.

ADVERTISEMENT

 

11. ఉండిపో – ఇస్మార్ట్ శంకర్

ఇదే ‘ఇస్మార్ట్ శంకర్’లో ఒక మంచి మెలోడీ పాట కూడా ఉంది. ఆ పాటే ‘ఉండిపో’. ఈ పాటని రచించింది భాస్కరభట్ల కాగా.. ఆలపించింది అనురాగ్ కులకర్ణి & రమ్య బెహ్రా.

 

ADVERTISEMENT

12. నీ నీలి కన్నులోన – డియర్ కామ్రేడ్

విజయ్ దేవరకొండ.. రష్మిక మంధాన నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలోని ఈ ‘నీ నీలి కన్నులోన’ అని సాగే ఈ మెలోడీ పాటని ఆలపించింది గౌతమ్ భరద్వాజ్ కాగా.. రెహ్మాన్ లిరిక్స్ రాశారు. ఇక ఈ పాటకి స్వరాలను అందించింది మాత్రం జస్టిన్ ప్రభాకరన్.

 

13. కడలల్లె వేచే కనులే – డియర్ కామ్రేడ్

ADVERTISEMENT

డియర్ కామ్రేడ్ చిత్రంలో ‘కడలల్లె వేచే కనులే’ పాట కూడా చాలామంది మనసుని హత్తుకుంది. ఇక ఈ పాటని రెహ్మాన్ రచించగా.. సిడ్ శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్రన్‌లు ఆలపించారు. ఇక ఈ పాటకి కూడా జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూర్చారు.

 

14. గ్యాంగ్ లీడర్ – గ్యాంగ్ లీడర్

నాని ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో.. ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ థీమ్ ప్రేక్షకులని బాగా అలరించింది. ముఖ్యంగా ఈ థీమ్ సాంగ్ ప్రేక్షకులకి బాగా చేరువైంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకి ట్యూన్ కట్టడమే కాకుండా.. హీరో నానితో కలిసి ఆడి పాడారు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.

ADVERTISEMENT

 

15. హొయినా – గ్యాంగ్ లీడర్

ఇదే ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో ఒక మంచి మెలోడీని అందించాడు అనిరుధ్. ఇక ఈ పాటని అనంత శ్రీరామ్ రచించగా.. ఇన్నో గెంగా ఆలపించారు,

 

ADVERTISEMENT

16. జర్రా జర్రా – గద్దలకొండ గణేష్

ఈ సంవత్సరం వచ్చిన మాస్ పాటల్లో.. ‘జర్రా జర్రా’ గీతం తొలి స్థానంలో నిలుస్తుందంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే భాస్కరభట్ల రచించిన ఈ పాటకి.. ప్రేక్షకులని కట్టిపడేసేలా ట్యూన్ కట్టాడు మిక్కీ జె మేయర్. ఇక అనురాగ్ కులకర్ణి & ఉమా నేహాల గానం ఈ పాటని మరోస్థాయికి తీసుకువెళ్ళింది.

 

17. ఎల్లువొచ్చి గోదారమ్మ – గద్దలకొండ గణేష్

ADVERTISEMENT

1982లో ‘దేవత’ చిత్రంలో శోభన్ బాబు & శ్రీదేవిల పై తెరకెక్కించిన ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ పాటను.. మరలా 37 ఏళ్ళ తరువాత ‘గద్దలకొండ గణేష్’లో ట్రై చేశారు. స్వర్గీయ వేటూరి సుందర రామ్మూర్తి సాహిత్యం ఈ పాటకు ప్రాణం పోసిందనే చెప్పవచ్చు. అయితే అప్పట్లో రాసిన పాత సాహిత్యాన్ని ఏమాత్రం కూడా మార్చకుండా.. ఉన్నది ఉన్నట్టుగానే రీమిక్స్ చేయడం గమనార్హం. దీనితో ఆరోజుల్లో పాట విన్నప్పుడు కలిగిన భావనే.. ఇప్పుడు కూడా కలిగింది. ఇక ఈ పాటని ఇప్పుడు మిక్కీ జె మేయర్ రీమిక్స్ చేయగా.. ఎస్పీ బాలు, సుశీలలు పాడడం విశేషం

18. సైరా – సైరా నరసింహా రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన చిత్రం ‘సైరా’ నరసింహా రెడ్డి. ఈ చిత్రంలోని టైటిల్ ట్రాక్ ఎంతో కీలకమైంది. ఇంతటి కీలకమైన పాటని స్వరకర్త అమిత్ త్రివేది చాలా చక్కగా ట్యూన్ చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకి తగ్గట్టుగా సాగిన కంపొజిషన్‌లో.. గాయనీమణులు సునిధి చౌహన్, శ్రేయ ఘోషల్‌లు పాటను చాలా చక్కగా ఆలపించారు. ఈ పాట సినిమా మొత్తం కూడా వినిపిస్తూ.. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

 

ADVERTISEMENT

19. సామజవరగమన – అల వైకుంఠపురంలో

వాస్తవానికి ఈ ‘అల వైకుంఠపురంలో’ చిత్రం 2020 సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కనుక ఈ సినిమాలోని పాటలు 2019 కి చెందినవి కావు. అయినప్పటికి ఈ పాట 2019లోనే విడుదలై ప్రజాదరణ పొందిన కారణంగా.. ఈ జాబితాలో చోటు కల్పిస్తున్నాం. ఇక ఈ పాట దాదాపు ఈ సంవత్సరానికి సంబంధించి.. టాప్ 3 సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సిడ్ శ్రీరామ్ గానం, తమన్ స్వరాలు కలగలిసి ఈ పాటని టాప్‌లో నిలబెట్టేశాయి.

 

20. రాములో రాముల – అల వైకుంఠపురంలో

ADVERTISEMENT

ఇదే చిత్రంలో మరొక మాస్ & క్లాస్ కలగలిసిన పాట ‘రాములో రాముల’. ఈ పాటని అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడగా.. కాసర్ల శ్యామ్ రచించారు. మొత్తానికి ఈ పాట ఇప్పుడు ఒక ట్రెండీ పాటగా.. రాబోయే రోజుల్లో జనాలని ఊపేసేలా ఉందనే చెప్పవచ్చు. వచ్చే ఏడాది విడుదలయ్యే చిత్రంలోని పాటలు అయినా.. ఈ ఏడాదే వీటి సత్తా ఏంటో చూపించేశాయి.

 

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

ఇవి.. 2019వ సంవత్సరంలో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన.. టాప్ 20 సాంగ్స్ 

ADVERTISEMENT

జీవిత – రాజశేఖర్ లవ్ స్టోరీ తెలుసుకుంటే క్రేజీ అనాల్సిందే

11 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT