కాబోయే తల్లులు అమితంగా ఇష్టపడే.. అల్ట్రా సౌండ్ నెయిల్స్ గురించి మీకు తెలుసా?

కాబోయే తల్లులు అమితంగా ఇష్టపడే.. అల్ట్రా  సౌండ్ నెయిల్స్ గురించి మీకు తెలుసా?

తల్లి కావడం అనేది ప్రతి మహిళ కోరుకునే ఓ వరం. పెళ్లైన తర్వాత తానో బిడ్డకు తల్లవుతున్నానని తెలిసిన మరుక్షణం నుంచే తన బిడ్డ గురించి ఎన్నో కలలు కనడం ప్రారంభిస్తుంది. నిస్వార్థంగా ప్రేమను పంచుతూ పుట్టబోయే బిడ్డను ఎంతో అపురూపంగా చూసుకోవాలని తహతహలాడుతూ ఉంటుంది ప్రతి తల్లి. అయితే ఇలా గర్భం దాల్చిన తర్వాత చాలామంది మహిళలు తమ బ్యూటీ రొటీన్‌కు కాస్త దూరంగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా నెయిల్ ఆర్ట్స్, నెయిల్ పాలిష్.. వంటివి అనుసరించడం ఎంతకంతే అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు కాబోయే తల్లులు కూడా నెయిల్ ఆర్ట్స్ వేసుకునేందు మొగ్గుచూపుతున్నారు. ఎందుకంటే వాటిలో కొత్తగా ప్రాచుర్యం సంపాదించుకుంటున్న ట్రెండ్ అలాంటిది మరి.. ఇంతకీ ఆ ట్రెండ్ ఏంటంటే..

 

Instagram

అల్ట్రా సౌండ్ నెయిల్స్..

సాధారణంగా కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది? ఆ బిడ్డ రూపు రేఖలు, శరీర భాగాలు, వాటి కదలికలు.. వంటివన్నీ ఎలా ఉన్నాయి.. అని తెలుసుకోవడానికి వైద్యులు ఉపయోగించేది అల్ట్రా సౌండ్ స్కాన్. ఈ స్కాన్ చేసిన తర్వాత మన చేతికి కూడా ఆ కాపీ ప్రింటవుట్ ఇస్తారు. అయితే దానిని మెడికల్ ఫైల్‌లో భద్రంగా దాచుకొని అప్పుడప్పుడూ చూసుకుంటూ తల్లులు మురిసిపోవడం సహజమే. మరి, వాటినే తీపి గుర్తులుగా మార్చుకుంటూ.. మిమ్మల్ని మీరు స్టైలిష్‌గా కూడా మలుచుకోగలరంటే నమ్ముతారా? నిజమండీ.. గోళ్లను అందంగా తీర్చిదిద్దే నెయిల్ ఆర్ట్స్ ట్రెండ్స్‌లో కొత్తగా వస్తోందీ ట్రెండ్. అదే- అల్ట్రా సౌండ్ నెయిల్స్ (Ultrasound nails). అంటే అల్ట్రా సౌండ్ స్కాన్ చేసిన కాపీని చేతి గోళ్ల మీద అందంగా పెయింట్ చేసుకోవడం. ఇంతకీ ఈ ట్రెండ్ ఎక్కడ, ఎలా మొదలైంది? తెలుసుకుందాం రండి..

Instagram

అలా మొదలైంది..

కౌంటీ దుర్హమ్‌కి చెందిన బ్యుటీషియన్ సారా క్లార్క్ ఈ ట్రెండ్‌ను ప్రారంభించారు. అయితే దీనిని మొదలుపెట్టే సమయానికి అదొక ట్రెండ్‌గా మారుతుందని ఆమె కూడా ఊహించలేదు. తన వద్దకు వచ్చే ఒక క్లయింట్‌కు అల్ట్రా సౌండ్ స్కాన్ కాపీ ఆధారంగా నెయిల్ ఆర్ట్ వేసి.. దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సారా. ఈ ఫొటో పెట్టిన కాసేపటికే అది వైరల్‌గా మారడంతో పాటు.. అలాంటి నెయిల్ ఆర్ట్ మాకూ కావాలంటూ ఎంతోమంది ఆమెను కోరారట. అయితే వారిలో కొందరు గర్భవతులు కాగా; ఇంకొందరు మాత్రం ప్రెగ్నెన్సీలో ఉండగా పలు కారణాల రీత్యా కడుపులోనే తమ బిడ్డలను పోగొట్టుకున్నారు. వారి గుర్తుగా తమకు ఈ నెయిల్ ఆర్ట్ వేయాలంటూ సారాను సంప్రదించారట.

Instagram

మిశ్రమ స్పందన..

ఏదైతేనేం.. ప్రస్తుతం ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది. అయితే దీనికి కొందరు స్వాగతం పలుకుతుంటే.. ఇలాంటి ట్రెండ్స్ కూడా ఉంటాయా అంటూ ఇంకొందరు నోరెళ్లబెడుతున్నారు. మరికొందరు.. అసలు ఈ పోకడలేంటి..? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మిశ్రమ స్పందనల నడుమ కూడా.. చాలామంది మహిళలు తమ గోళ్లను ఈ నెయిల్ ఆర్ట్‌తో తీర్చిదిద్దుకునేందుకు ఎక్కువగానే ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే అమెరికాలో కొన్ని ఎంపిక చేసిన బ్యూటీ పార్లర్స్‌లో ఈ నెయిల్ ఆర్ట్‌ని వేస్తున్నారు.

ఏంటీ?? మీకూ ఈ నెయిల్ ఆర్ట్‌ని ప్రయత్నించాలని ఉందా? అయితే మీకు మీరే స్వయంగా గోళ్లపై అందంగా పెయింట్ చేసుకోవడానికి ప్రయత్నించండి లేదా మీ బ్యుటీషియన్‌కి ఈ ట్రెండ్ గురించి చెప్పి మీ చిన్నారి ముద్రను చేతి గోళ్లపై అందంగా చిత్రీకరించమని వారిని కోరండి.

గోళ్లను అందంగా మార్చే.. ఈ విభిన్నమైన నెయిల్ పాలిష్‌లు మీ దగ్గర ఉండాల్సిందే..!

ఈ అద్బుతమైన మేకప్ ఉత్పత్తులు కేవలం రూ.100 లోపే కొనేయొచ్చు తెలుసా?

నెయిల్ పాలిష్‌తో నెయిల్ ఆర్ట్ మాత్రమే కాదు.. ఈ పనులు కూడా చేయొచ్చు..

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి... అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి                 

పగిలిన మడమలా? ఇలా చేసి కాళ్ల పగుళ్లు సులభంగా తగ్గించుకోవచ్చు..మీ చర్మ తత్వం ఎలాంటిదో మీకు తెలుసా? ఇలా చేసి సులభంగా తెలుసుకోండిఅందమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి..