2020 లో RRR కాకుండా.. ఆసక్తి రేపుతున్న చిత్రాలివే..!

2020 లో RRR కాకుండా..  ఆసక్తి రేపుతున్న చిత్రాలివే..!

ప్రతి సంవత్సరం..మనం ఆ ఏడాది విడుదలయ్యే కొన్ని చిత్రాల గురించి ఆసక్తితో ఎదురు చూస్తుంటాం. అలా విడుదల కాబోయే ఆర్.ఆర్.ఆర్ చిత్రం (rrr movie) పై ఇప్పటికే ఎంతోమంది అంచనాలతో పాటు ఆసక్తిని కూడా పెంచుకున్నారు. అయితే.. తాజాగా ఆ సినిమా విడుదల తేదిని మార్చి చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ & కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 8 జనవరి 2021 న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 

"ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి.. నెలరోజులు చాలు" - నటి 'రాశి' ఆసక్తికర లవ్ స్టోరీ ..!

ఈ క్రమంలో RRR విషయాన్ని కొంచెం సేపు పక్కన పెడితే.. ఈ ఏడాది విడుదల కాబోయే మరికొన్ని చిత్రాల (movies) గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిత్రాల గురించిన ప్రకటన ఇప్పటికే వెలువడడంతో.. అలాగే అవి 2020లో ఏదో ఒక సమయంలో విడుదల కావడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఆ చిత్రాలు ఏంటి? అసలు ఆ చిత్రాలు ప్రేక్షకులలో కేవలం ప్రకటనల ద్వారానే ఎందుకు ఆసక్తిని పెంచగలిగాయి అనే వివరాలను (details) ఇప్పుడు తెలుసుకుందాం..

అల్లు అర్జున్ - సుకుమార్

అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో రాబోతున్న మూడవ చిత్రం ప్రస్తుతం సెట్స్ మీదకు వెళ్లింది. ఆర్య, ఆర్య 2 చిత్రాల తరువాత వీరి నుండి రాబోతున్న మూడవ చిత్రం పట్ల సహజంగానే ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే వీరిద్దరి కలయికను అభిమానులు చాలా ప్రత్యేకంగా చూస్తారు. దీనికి బలమైన కారణం.. వీరిద్దరూ స్నేహితులు కావడమే. అలాగే వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు కూడా ఎంతో వైవిధ్యంగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో బన్నీ చేసిన 'అల వైకుంఠపురంలో' చిత్రం సంక్రాంతికి విడుదలై.. హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీని తరువాత సెట్స్ మీదకు వెళ్లిన సుకుమార్ - అల్లు అర్జున్  అర్జున్‌ల చిత్రం.. 2020 చివరికల్లా ప్రేక్షకుల ముందుకి వస్తుందని అందరు ఆశిస్తున్నారు.

పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ 'ఫైటర్'

విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కలయికలో రూపొందబోతున్న చిత్రం 'ఫైటర్'. 'ఇస్మార్ట్ శంకర్'తో మరోసారి తన డైరెక్షన్ సత్తా ఏంటో చూపించిన దర్శకుడు పూరి జగన్నాధ్... ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథతో మన ముందుకు వచ్చాడు.  ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన కిక్ తో 'ఫైటర్' అనే కథని సిద్ధం చేశాడట.  ఇందులో హీరోగా విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. అసలు ఈ ఇద్దరు ఫైటర్స్‌లానే ఉంటారు వారి నిజ జీవితాల్లో. అటువంటిది వీరు ఇటువంటి ఒక కథతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారంటే అది పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని ఇప్పటికే ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి వినిపిస్తున్న మరో వార్త ఏంటంటే ఈ సినిమా ఏకకాలంలో తెలుగు - హిందీ భాషల్లో తెరకెక్కబోతుందట.  అలాగే ఈ సినిమాకి కరణ్ జోహార్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించబోతున్నారు అని తెలిసింది. అయితే ఈ వార్తల పైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది.

'ప్రేమించిన వాడితో పెళ్లికి.. 9 ఏళ్ళ పాటు నిరీక్షించిన అనసూయ'.. ఓ అందమైన ప్రేమకథ మీకోసం


పవన్ కళ్యాణ్ - పింక్ రీమేక్

సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతాను అని చెప్పి.. పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌కి ఒకరకమైన షాక్ ఇచ్చాడనే చెప్పాలి. అటువంటిది మరలా ఆయన ఒక సినిమా చేయబోతున్నాడు అని తెలిసి.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో ఒక తెలియని ఉత్సాహం వచ్చింది.  హిందీలో అమితాబ్ బచ్చన్ & తాప్సి పన్ను ప్రధాన పాత్రలో నటించిన 'పింక్' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు బోని కపూర్ & దిల్ రాజు ముందుకి రావడం జరిగింది. ఇక హిందీలో అమితాబ్ చేసిన పాత్ర ఇక్కడ పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి 'లాయర్ సాబ్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు.  అయితే పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం ఎప్పుడు సమయం ఇస్తే.. అప్పుడు ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

చిరంజీవి - కొరటాల శివ

ఈ జాబితాలో ఆఖరుగా చెప్పుకున్నా.. 2020లో ఇది బాక్స్ ఆఫీస్ అదిరిపోయే చిత్రంగా నిలవనుంది. అదే - చిరంజీవి & కొరటాల శివ కలయికలో రూపొందనున్న చిత్రం. ఈ సినిమా కథా చర్చలు ముగియడం..అలాగే ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ముగింపు దశకు చేరుకోవడం విశేషం. మరోవైపు చిరంజీవి కూడా ఈ చిత్రంలో తన పాత్రకి సరిపోయే విధంగా కసరత్తులు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇక వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న కొరటాల శివ.. ఈ మెగా అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని .. మెగా హిట్ కొడతారు అని మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దేవాలయ భూముల కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'గోవిందాచార్య' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. 

ఈ పైన పేర్కొన్న చిత్రాలు 2020లో ప్రేక్షకుల ముందుకి రానున్న వేళ.. వాటి కోసం ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారన్న మాట నిజం. 

ఒకప్పటి బాల నటులు... నేడు స్టార్ హీరో హీరోయిన్లు.. వారెవరంటే..?