ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
దేశభక్తి ఉప్పొంగే ఈ ప్రదేశాలను ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిందే..

దేశభక్తి ఉప్పొంగే ఈ ప్రదేశాలను ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిందే..

మన దేశం ఈ ఆగస్టు 15 తేదిన 73వ స్వాతంత్ర దినోత్సవం (Independence day) వేడుకలు జరుపుకుంటోంది. మన జాతీయ పండగ అయిన ఈ రోజున దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. ఆగస్టు 12 తేదిన బక్రీద్… అలాగే 13, 14, 16 సెలవులు పెడితే చాలు.. వీకెండ్స్‌తో కలిపి 9 రోజుల పాటు సెలవులు వస్తుండడంతో చాలామంది వివిధ ప్రదేశాలకు చెక్కేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా బయటకు వెళ్లిరావడం అనేది మనల్ని రోజువారీ జీవితంలో ఎదురయ్యే బోరడమ్ నుంచి దూరం చేస్తుంది.

మరి, ఎలాగూ బయటకు వెళ్లాలనుకుంటున్నాం కాబట్టి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వెళ్లే ఆ ప్రదేశం.. మనలో దేశభక్తిని మరింత పెంచేదైతే ఇంకా బాగుంటుంది కదూ.. అలాంటి ప్రదేశాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. మనం ఈ రోజు ఇలా స్వేచ్ఛగా జీవితం కొనసాగిస్తున్నామంటే అది చాలామంది చేసిన త్యాగాల వల్లే. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు వారందరినీ తలచుకుంటూ దేశభక్తి (patriotism) ఉప్పొంగేలా ఈ ప్రదేశాలకు చుట్టేయండి.

1. ఇండియా గేట్, ఎర్ర కోట – దిల్లీ

ADVERTISEMENT

1. ఇండియా గేట్, ఎర్ర కోట – దిల్లీ

న్యూ దిల్లీ మన దేశం గుండె లాంటిది. దేశ రాజధాని అయిన దిల్లీలో నిలబడి అక్కడున్న ఇండియా గేట్‌ని చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఈ ఇండియా గేట్‌ని మొదటి ప్రపంచ యుద్ధం, ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 82 వేల మందికి పైన ఉన్న సైనికుల స్మారకార్థం కట్టారట. ఇక్కడి గోడలపై వారందరి పేర్లు కూడా చెక్కి ఉండడం విశేషం. అంతేకాదు.. ఇక్కడి అమర్ జవాన్ జ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఈ జ్యోతిని 1971లో బంగ్లాదేశ్ స్వాంతంత్రం సమయంలో మరణించిన వీర సైనికుల స్మారకార్థం ఉంచారట. ఇక దానికి దగ్గర్లోనే ఉన్న ఎర్రకోట వరల్డ్ హెరిటేజ్ సైట్ గానూ గుర్తింపు సాధించింది. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధాన మంత్రి ఇక్కడ జెండా ఎగరేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగం కూడా చేస్తారు. 1639లో మొగల్ చక్రవర్తి అయిన షాజహాన్ దీన్ని నిర్మించారు. ఎర్రకోటపై జెండా ఎగరేయడం జీవితంలో ఒక్కసారైనా చూడాలని చాలామంది కోరుకుంటారు.

2. వాఘా బోర్డర్, జలియన్ వాలా బాగ్ – పంజాబ్

2. వాఘా బోర్డర్, జలియన్ వాలా బాగ్ – పంజాబ్

ADVERTISEMENT

వాఘా బోర్డర్ పంజాబ్‌లోని అమ్రుత్‌సర్‌లో ఉంది. ఈ బోర్డర్‌లో ఇరు దేశాల సైనికులు మార్చ్ ఫాస్ట్ చేసి ఒకరికొకరు వందనం చేసుకుంటూ ఉదయం జెండా ఎగరేయడం.. చీకటి పడే సమయానికి తిరిగి జెండాను దింపడం చేస్తుంటారు. ఈ ప్రక్రియను బీటింగ్ రిట్రీట్‌గా పేర్కొంటారు. కేవలం మన జెండానే కాదు.. మన దేశం నుంచి బీఎస్ఎఫ్, పాకిస్థాన్ నుంచి పాకిస్థాన్ రేంజర్స్ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. పంజాబ్‌లోనే ఉన్న మరో ప్రదేశం జలియన్ వాలా బాగ్. 1919, 13 ఏప్రిల్ తేదిన ఈ ప్రదేశంలో వేలాది మంది శాంతియుతంగా పోరాటం చేస్తున్న యోధులు.. బ్రిటిష్ తూటాల ధాటికి ప్రాణాలు వదిలారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వారి ప్రాణ త్యాగం వల్లే వచ్చిందని వారిని గుర్తుచేసుకుంటూ ఈ ప్రదేశాలు తిరిగి రావచ్చు.

రిపబ్లిక్ డే స్పెషల్: ఈ చ‌రిత్రాత్మ‌క క‌ట్ట‌డాలు.. స్వాతంత్య్ర పోరాటానికి నిద‌ర్శ‌నాలు..!

https://telugu.popxo.com/trending/famous-historical-places-related-to-indian-freedom-struggle-in-telugu-791533/

3. సెల్యులార్ జైల్ – అండమాన్, నికోబార్ ఐల్యాండ్స్

ADVERTISEMENT

బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో దీన్ని కాలాపానీ అనేవారు. పోర్ట్ బ్లెయిర్‌లో ఉన్న జైల్లో బ్రిటిష్ వారు భారత స్వాతంత్ర యోధులందరినీ బందీలుగా ఉంచేవారు. 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ జైలును కట్టారు. ఇక్కడే చాలామంది స్వాంతంత్ర సమరయోధులు ఎన్నో హింసలకు గురై చివరి శ్వాస విడిచారు. ప్రస్తుతం ఇది గొప్ప కట్టడంగా పేరు సాధించింది. ఇక్కడ ప్రతి సాయంత్రం వారి స్మారకార్థం సౌండ్ అండ్ లైట్ షో జరుగుతుంది.

4. కార్గిల్ వార్ మెమోరియల్ – ద్రాస్

4. కార్గిల్ వార్ మెమోరియల్ – ద్రాస్

కార్గిల్ యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. 1999లో జరిగిన ఈ యుద్ధం గురించి మనలో చాలామంది వినే ఉంటాం. ఈ యుద్ధంలో అసువులు బాసిన భారత జవాన్లను గుర్తు చేసుకుంటూ ఈ కార్గిల్ వార్ మెమోరియల్‌ని నిర్మించారు. ఈ మెమోరియల్‌కి మధ్యలో ఉన్న సాండ్ స్టోన్ గోడపై.. ఈ యుద్ధంలో ప్రాణాలు విడిచిన సైనికులందరి పేర్లు చెక్కారట. ఈ యుద్ధం తర్వాత భారత ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకున్న టైగర్ హిల్స్, టోలోలాండ్ హిల్స్ ఇక్కడి నుంచి బాగా కనిపిస్తాయి.

ADVERTISEMENT

గ్లామర్ ప్రపంచాన్ని వదిలి.. ఇండియన్ ఆర్మీకి సేవలందిస్తున్న బ్యూటీ క్వీన్..!

https://telugu.popxo.com/trending/beauty-queen-to-army-officer-interesting-story-of-garima-yadav-in-telugu/

5. దండి – సూరత్

సూరత్ దగ్గర్లోని దండి గ్రామం దేశంలోనే ఉప్పు ఉత్పత్తికి ప్రఖ్యాతి గాంచింది. 1930లో మహాత్మాగాంధీ ఇక్కడే దండి మార్చ్‌ని ప్రారంభించారు. ఆయనతో పాటు వేల మంది అందులో పాల్గొన్నారు. స్వాతంత్రం కోసం చేసిన అహింసా యుద్ధం ఇది. ఈ ప్రదేశానికి చరిత్రపరంగా చాలా ప్రాముఖ్యం ఉంది.

ADVERTISEMENT

6. నాతుల్లా పాస్ – సిక్కిం

6. నాతుల్లా పాస్ – సిక్కిం

గ్యాంగ్‌టక్ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో 14,140 అడుగుల ఎత్తులో ఉన్న నాతులా పాస్‌ని ఒకప్పటి సిల్క్ రూట్‌గా చెప్పుకోవచ్చు. భారత్, చైనా మధ్యలో ఈ మార్గం నుంచే వ్యాపారం కొనసాగుతూ ఉండేది. ప్రస్తుతం ఇది ఇండో చైనా బొర్డర్‌గా కొనసాగుతోంది. ఇక్కడ పహారా కాస్తున్న భారత చైనా సైనికులను మనం చూడొచ్చు. మంచు దుప్పటిలోనూ వీరు పహారా కాసే పద్ధతి చూస్తుంటే, మనకు సైనికుల పట్ల గౌరవం మరింత పెరిగిపోతుంది. ఇక్కడి నెహ్రూ స్టోన్‌ని తప్పక చూడాల్సిందే. 1958లో భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇక్కడికి వచ్చిన రోజు గుర్తు చేస్తూ దీన్ని నిర్మించారు.

రిపబ్లిక్ డే స్పెషల్: వీరి వాక్కులు మనకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే..!

ADVERTISEMENT

https://telugu.popxo.com/2019/01/quotes-by-freedom-fighters-in-telugu/

7. జైసల్మేర్ బోర్డర్ – రాజస్థాన్

జైసల్మేర్ బోర్డర్ భారత్, పాకిస్థాన్‌ని వేరు చేస్తుంది. స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయతను దేశభక్తిని నరనరాన ఫీలవ్వాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే. ఇక్కడ లాంగ్ వాలా, టానోట్ బోర్డర్ పోస్ట్స్ ప్రధాన ఆకర్షణలు. జైసల్మేర్ మ్యూజియం, ఇందిరా గాంధీ కెనాల్.. వంటివి కూడా చూడాల్సిందే. ఇక్కడ పహారా కాసే సైనికులను కూడా కలుసుకొని వారితో మాట్లాడొచ్చు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

09 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT