Entertainment

ఎకో ఫ్రెండ్లి పెళ్లి చేసుకుంటూ… ఆదర్శంగా నిలుస్తున్న హీరో చేతన్

Sandeep Thatla  |  Jan 24, 2020
ఎకో ఫ్రెండ్లి పెళ్లి చేసుకుంటూ… ఆదర్శంగా నిలుస్తున్న  హీరో చేతన్

ఈ మధ్యకాలంలో  పర్యావరణ పరిరక్షణ పట్ల శ్రద్ధ చూపిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అనేకమంది సెలబ్రిటీలతో పాటు.. సామాన్య జనం కూడా మన భూమికి చేటు చేసే అంశాల పై అవగాహన పెంచుకోవడమే కాకుండా.. అందుకు తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. తమ జీవితాల్లో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలను పర్యావరణ హితంగా జరుపుకుంటున్నారు.

ఫ్రీ హగ్స్ పేరిట ముంబై నగరంలో.. రిచా ఛడ్డా చేసిన వినూత్న ప్రయత్నం మీకు తెలుసా..!

మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌లో ఓ జంట తమ వివాహన్ని ప్లాస్టిక్ రహిత వివాహంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ పెళ్ళిలో ఎక్కడా కూడా సింగిల్ యూజ్ అయ్యే ప్లాస్టిక్ లేకుండా జాగ్రత్తపడ్డారు. పైగా తమ వివాహానికి హాజరైన వారికి ఒక మొక్కని సైతం బహుమతిగా ఇచ్చి నలుగురికీ ఆదర్శంగా నిలిచారు. 

ఇప్పుడు చెప్పుకోబోయే వార్త కూడా అటువంటిదే. కన్నడ హీరో  చేతన్  వివాహం (chethan marriage) వచ్చే నెల అనగా ఫిబ్రవరి 2వ తేదీన బెంగుళూరులో జరగనుంది. ఈ క్రమంలో చేతన్ తన పెళ్ళి శుభలేఖలలో (wedding cards) విత్తనాలు (seeds) ఉండేలా ప్లాన్ చేసి మరీ వాటిని రూపొందించారు. అలా రూపొందించిన వాటిని బంధువులకి, స్నేహితులకి ఇస్తున్నాడు చేతన్.

సాధారణంగా వివాహ  తేదీ అయిపోయాక.. మన ఇళ్లలో ఉన్న శుభలేఖలను బయట పడేస్తుంటాం. అలా చేసేటప్పుడు ఈ  శుభలేఖని మట్టిలో కప్పి పెట్టి.. కాస్త నీరు పోస్తే అందులోని గింజలు మొలకెత్తి  చెట్లుగా మారతాయట. ఇలా ఆలోచించే చేతన్ కూడా తన పెళ్ళికి శుభలేఖలని ఇస్తున్నప్పుడు.. అందులో పర్యావరణానికి మేలు చేసే అంశాలను జోడించడం మరో ఎత్తు.

‘జొమాటో’లో ఉబర్ ఈట్స్ విలీనం .. ఈ ఆసక్తికర పరిణామం వెనుక కారణాలివే..!

చేతన్ పెళ్ళి శుభలేఖల విషయంలోనే ఇలా ఉంటే .. పెళ్లి విషయంలో ఇంకెంత పట్టింపుగా ఉంటాడో మనం ఊహించుకోవచ్చు. ఆయన తన పెళ్లిని ఎంతో నిరాడంబరంగా బెంగుళూరులోని (bengaluru) వినోబా భావే ఆశ్రమంలో (vinobha bhave old age home) చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

చేతన్ తన తల్లిదండ్రుల మాట కూడా కాదని.. ఇలా చాలా సాదాసీదాగా వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడట. స్వతహాగా NRI అయిన చేతన్ తన బాల్యం అంతా కూడా అమెరికాలో గడవడం.. అలాగే ఆయన తల్లిదండ్రులు కూడా అక్కడ పేరొందిన డాక్టర్లు కావడంతో వివాహాన్ని ఘనంగా జరిపించాలని భావించారట. కానీ చేతన్ అందుకు ఒప్పుకోలేదు. నిరాడంబరంగానే చేసుకోవడానికి ఆయన మొగ్గు చూపారట. ఇంతకి చేతన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న కారణం – “పెళ్లి కోసం అంటూ ఎంతో విలువైన డబ్బుని వృధా చేస్తున్నారు.. అదే డబ్బుతో అవసరాల్లో ఉన్న వారికి ఎంతో కొంత సహాయం చేయవచ్చు” అనే అభిప్రాయమే.

అలాగే అతను చేసుకోబోయే అమ్మాయి మేఘ కూడా.. ఒక సామాజిక కార్యకర్త (social worker) అని తెలిసింది. దీంతో ఒక హీరో అయి ఉండి, ఎంతో హంగు అర్బాటుతో వివాహం చేసుకునే అవకాశం ఉండి కూడా.. ఇలా నిరాడంబరంగా వివాహం చేసుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సమాజంలో ఇలా తమకంటూ ఒక గుర్తింపు ఉన్నవారు.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల.. అది సమాజం పై కూడా ఎంతో కొంత మంచి ప్రభావం చూపుతుంది అని చెప్పగలం.

శీతాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే ..!                                                                                                                              

Read More From Entertainment