ఇటీవలే ఇసాక్ రిచర్డ్స్ (Issac Richards) అనే వ్యక్తి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. అయితే దీనికి కారణం ఏమిటో తెలుసా. ఆ అమెరికన్ తెలుగులో బాగా మాట్లాడడమే. ఆయన గతంలో తెలుగు రాష్ట్రాల్లో విరివిగా సంచరించారట. ఈ క్రమంలో తెలుగు మాట్లాడడం నేర్చుకున్నారట. అంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్న రిచర్డ్స్‌కి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎందరో అభిమానులు ఏర్పడ్డారు. అలాగే ఎందరో నెటిజన్లు కూడా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
“కన్యాశుల్కం” నాటకంలోని.. చిత్రమైన సంభాషణలు మీకోసం
రిచర్డ్స్‌కు వైజాగ్, విజయవాడ ప్రాంతాల్లో మిత్రులు ఉన్నారు. వారి ద్వారా ఆయన తెలుగు నేర్చుకున్నారు. రిచర్డ్స్ తెలుగులో మాట్లాడుతున్న వీడియోని దినేష్ అనే వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. ఆయన ఓ సెలబ్రిటీ అయిపోయారు. తనకు అంతగా లభించిన ఆదరణ పట్ల రిచర్డ్స్ కూడా ఉబ్బితబ్బిబవుతున్నారు. తాను తెలుగు మాట్లాడడం గొప్ప విషయం అనుకోలేదని.. కానీ తనకి ఇంతమంది అభిమానులు ఏర్పడడం చూసి నమ్మలేకపోయానని అన్నారు రిచర్డ్స్.
తెలుగమ్మాయిల అందాన్ని.. అపురూపంగా చూపిన ఘనత “బాపు” చిత్రాలదే..!
తనను ఎంతగానో ప్రేమిస్తున్న అభిమానులను.. తెలుగు భాషా ప్రేమికులను ఫేస్బుక్ ద్వారా కలిసి మాట్లాడతానని కూడా తెలిపారు రిచర్డ్స్. ప్రస్తుతం అనేక సోషల్ మీడియా ఛానల్స్‌లో రిచర్డ్స్ వీడియో వైరల్ అయ్యింది. అనేకమంది సెలబ్రిటీలు కూడా తెలుగు మాట్లాడుతున్న ఈ అమెరికన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఓ అమెరికన్ అయ్యి ఉండి… తెలుగు నేర్చుకోవడమే కాకుండా.. ఇంత స్పష్టంగా మాట్లాడడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిన విషయమని తెలిపారు.
తాజాగా టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మీ (Manchu Lakshmi) కూడా ఇసాక్ రిచర్డ్స్ వీడియోపై స్పందించారు. “ఇతను మాట్లాడుతున్న తెలుగు నాకన్నా బాగుంది. మన భాషను ఇతర దేశస్తులు కూడా ప్రేమించడం.. మన మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం కదా” అని ఆమె తన ట్విటర్ ద్వారా తెలిపింది. అదే ట్వీట్‌కి నటుడు బ్రహ్మాజీ కూడా రిప్లై ఇచ్చారు. “నీ దుంపతెగ.. ఎంత బాగా తెలుగు మాట్లాడుతున్నావు” అని రిచర్డ్స్‌కి కాంప్లిమెంట్ ఇచ్చాడు.
తెలుగు వారి పల్లె పడుచు.. “ఎంకి” ముచ్చట్లు మీకోసం..!
ఇసాక్ రిచర్డ్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యాడు. తాను ఇంత బాగా ఫేమస్ అవ్వడానికి కారణమైన తెలుగు ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ.. తను ఫేస్బుక్‌లో ఓ మెసేజ్ కూడా పెట్టాడు. ” తెలుగు మర్చిపోకూడదు. చాలా మంచి భాష అది” అని పోస్టు చేశాడు. ప్రస్తుతం రిచర్డ్స్ ఫేస్బుక్ ఖాతాకు ఫాలోయింగ్ బాగా పెరుగుతోంది. ఎంతోమంది తెలుగు వ్యక్తులు కూడా ఆ ఖాతాను ఫాలో అవుతూ.. రిచర్డ్స్‌కు అభినందనలు తెలుపుతున్నారు. అలాగే మరో ట్వీట్‌లో రిచర్డ్స్ మాట్లాడతూ “నా గుండె ఆంధ్రాలో ఉంది” అని పోస్టు చేశాడు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది
Read More From Entertainment
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే
Sandeep Thatla