ప్రేమలో పడిన వాళ్లందరూ.. రోజుకి 24 గంటలు ప్రేమించిన వ్యక్తితోనే గడపాలని భావిస్తుంటారు. ఇలాంటప్పుడు సుదూర బంధాలను (Long distance relationship) కొనసాగించడం చాలా కష్టమే. ప్రేమించినవారు పక్కన లేకపోతే జీవితం నరకంగా ఉంటుంది. అయితే వారికి పూర్తిగా దూరంగా ఉండడం కంటే.. కాస్త దగ్గరగా ఉన్నామనే ఫీలింగ్‌తో జీవించడం బెటర్ కదా. ఇలాంటి ఇబ్బందిని దూరం చేయడానికే కొన్ని యాప్స్ (Apps) వచ్చేశాయ్. వాటి సాయంతో మీరిద్దరూ దూరంగా ఉన్నా.. దగ్గరగా ఉన్నట్లు ఫీలయ్యే అవకాశం కూడా ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం రండి..
1. ఆల్‌టైం ఫేవరెట్ – Skype
మనసైనవారితో ఫోన్‌లో మాట్లాడుతుంటే అసలు సమయమే తెలీదు కదండీ. అందులోనూ వీడియో కాల్ అయితే.. కనీసం ఆ కొంతసమయమైనా వాళ్లు మన పక్కనే ఉన్నారనిపించడం ఖాయం. ఇందుకోసం సింపుల్ సొల్యూషన్ ఏదైనా ఉందంటే అది స్కైప్ మాత్రమే. స్కైప్ ద్వారా లాప్‌టాప్‌లో వీడియో కాలింగ్ చేయడమే కాకుండా.. తన రూపాన్ని పెద్దగా చూస్తూ పక్కనే ఉన్నట్లుగా భావించే అవకాశం ఎక్కువ. అందుకే మీ ల్యాప్‌టాప్‌లో స్కైప్ యాప్‌ని ఇన్ స్టాల్ చేసుకోండి. ఇది ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌లోనూ అందుబాటులో ఉంది. అయితే ఇంకెందుకాలస్యం.. వీకెండ్‌లో పాప్‌కార్న్, పెప్సీతో ఎంజాయ్ చేస్తూ.. స్కైప్‌లో నచ్చిన వారితో గంటలు గంటలు మాట్లాడుకోండి.
2. దూరాన్ని దూరం చేసేందుకు – Snapchat
ఎప్పుడూ మీరు వీడియో చాట్ చేసేందుకు సమయం సరిపోదు. అప్పుడప్పుడూ వేరే చోట్ల ఉండి.. మాట్లాడే వీలు కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో స్నాప్‌చాట్ చక్కగా ఉపయోగపడుతుంది. ఎక్కడపడితే అక్కడ, ఫొటోల ద్వారా మాట్లాడుకోవచ్చు. ఇందులోని ఫిల్టర్లు మీకు మంచి ఫన్‌ని అందిస్తాయి కూడా. మీరు పర్సనల్ ఫొటోలు పంచుకునేందుకు కూడా ఇదో మంచి మార్గం ఎందుకంటే.. ఇందులో పంపిన ఫొటోలు చూసిన పది సెకన్ల తర్వాత డిలీట్ అయిపోయే సదుపాయం కూడా ఉంది. ఆ ఆప్షన్‌ని ఎంచుకొని పంపిస్తే సరి. దీనిని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఉన్న ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
3. దగ్గరయ్యే జంటల కోసం – Couple
ఇది కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలకు చక్కగా నప్పే యాప్. ఇందులోనూ మిగిలిన యాప్స్‌లా చాటింగ్, వీడియో మెసేజింగ్ ఆప్షన్లతో పాటు.. థంబ్ కిస్, మూడ్ షేరింగ్ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇవి మీరు ఎలా ఫీలవుతున్నారో చెప్పకుండానే అవతలి వారికి అర్థమయ్యేలా చేస్తాయి. దీనిద్వారా పంపించిన మెసేజ్‌లను ఎవరికీ కనిపించకుండా దాచుకునే వీలు కూడా ఉంది. మరెందుకు ఆలస్యం.. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.
4. కొంగొత్త ట్రెండ్‌తో – Touchnote
చాలామంది ప్రేమలో ఉన్నవారు వివిధ రకాల మీమ్స్, కోట్స్‌తో ఉన్న ఫొటోలను.. ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటివి మీ ఫొటోతోనే అందిస్తే ఎంత బాగుంటుంది కదా. అలాంటివి కావాలంటే.. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీ ఇద్దరి ఫొటోలను పక్క పక్కన ఉంచి.. మీకు నచ్చిన క్యాప్షన్ రాసుకోవచ్చు. ఇలా సెలక్ట్ చేసుకున్న ఫొటోలను మీ మనసైన వారికి పోస్ట్ కార్డ్ రూపంలోనూ పంపే వీలుంటుంది. మీరు వెళ్లిన ట్రిప్‌కి సంబంధించిన ఫొటోలను.. చక్కటి కార్డ్స్ రూపంలో షేర్ చేసుకోవాలంటే ఈ యాప్‌ని ఉపయోగించవచ్చు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింట్లోనూ అందుబాటులో ఉంది.
5. అద్బుతమైన క్వాలిటీకి – Google Duo
ఇది ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్లలో ప్రీ ఇన్‌స్టాల్ అయి వస్తోంది. ఒకవేళ ఇది మీ ఫోన్లో లేకపోతే మీరు చాలా మిస్సవుతున్నట్లే అన్నమాట. ఎందుకంటారా? చక్కటి క్వాలిటీ వీడియో దీని ప్రత్యేకత. ఎదుటివారితో క్లియర్‌గా వీడియో కాల్ మాట్లాడడం అంటే దీనివల్లే సాధ్యమవుతుంది. ఒకవేళ మీరు నెట్‌వర్క్ తక్కువగా ఉన్న ప్రదేశంలో ఉన్నా.. మీ నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నా ఇది ఆడియో కాల్‌గా కూడా మారిపోతుంది. బాగుంది కదూ.. అందుకే దీన్ని వెంటనే డౌన్‌లోడ్ చేసి ఉపయోగించడం ప్రారంభించండి.
6. చక్కటి సర్ప్రైజ్‌కి – loklok
ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా.. మీరు తమ గురించే ఆలోచిస్తున్నారని మిమ్మల్ని ప్రేమించినవారికి తెలియజేయాలని భావిస్తున్నారా? అయితే ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. దీని ద్వారా మీరు పంపే క్యూట్ డూడుల్స్, స్మైలీస్ వారి లాక్‌స్క్రీన్‌పైన కనిపించే వీలుంటుంది. అంటే మీరు పంపే మెసేజ్ చూడడానికి వారు.. యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. దీన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ప్లేస్టోర్ లేదా ఆప్‌స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
7. ఈ దూరం కూడా ఉండదిక – Weconnect
మానసికంగా ఇద్దరినీ కలిపేందుకు ఎన్నో దారులున్నా.. ఇద్దరూ కలిసి రోజంతా మాట్లాడుకుంటున్నా.. దూరంగా ఉన్న భార్యాభర్తలు ఎంతో బాధపడుతుంటారు. దీనికి కారణం వారికి లైంగికంగా ఆనందం కలగకపోవడమే. అయితే ఈ యాప్ ద్వారా ఈ సౌకర్యాన్ని కూడా మీరు అందుకోవచ్చు. ఇద్దరూ రెండు రకాల సెక్స్ టాయ్స్‌ని కొనుక్కొని దాన్ని.. ఈ యాప్‌కి అనుసంధానించాలి. ఈ యాప్ సాయంతో.. ఆ టాయ్‌ని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సులువుగా ఆపరేట్ చేసే వీలుంటుంది. మూడ్ వచ్చేలా మాట్లాడుకున్న తర్వాత.. ఈ యాప్ ద్వారా ఒకరికొకరు సుఖాన్ని అందించే వీలు కూడా ఉంది. సెక్స్ టాయ్ స్పీడ్, రిథమ్ వంటివన్నీ దీని ద్వారా కంట్రోల్ చేయవచ్చు. దీంతో అవతలి వ్యక్తి మిమ్మల్ని ఎలా సుఖపెట్టాలని భావిస్తున్నారో.. అవన్నీ రిమోట్ సాయంతో చేస్తారన్నమాట. దీన్ని కూడా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరి, ఇందులో మీరు ఎన్ని యాప్స్ మీ ఫోన్లో డౌన్‌లోడ్ చేశారు? ఒకసారి ఆలోచించండి
సెక్స్టింగ్: లైంగిక జీవితాన్ని హాట్ హాట్‌గా మార్చే.. రొమాంటిక్ సందేశాలు..!
డేట్ కు వెళ్తున్నారా? ఇలా రెడీ అవ్వండి
ఆమె కౌగిలిలో కరిగిపోయా.. ఈ లోకాన్నే మరిచిపోయా: మోడరన్ రోమియోల మాటలివే..!