Lifestyle

ఈ 12 ఊహాజనితమైన ఆలోచనలూ.. మీకు తెలియకుండానే మీ ప్రేమబంధంలో కలతలు తీసుకురావచ్చు

Cathline Chen  |  Nov 27, 2018
ఈ 12 ఊహాజనితమైన ఆలోచనలూ.. మీకు తెలియకుండానే మీ ప్రేమబంధంలో కలతలు తీసుకురావచ్చు

మీరు ప్రేమించిన వ్యక్తి లేదా జీవిత భాగస్వామి విషయంలో ఏదైనా అనుమానం తలెత్తితే.. మాట్లాడి విషయం తెలుసుకోవచ్చు. అదే సరైన పద్దతి. కానీ మీకు మీరే ఊహాజనితమైన ఆలోచనలతో సతమతమవుతూ వారి మీద ద్వేషం పెంచుకుంటే మాత్రం మీ జీవితం అగాధంలో పడుతుందనడంలో సందేహం లేదు. మనం కొన్నిసార్లు మనకు ప్రియమైన వారి గురించి ఇతరులు చెప్పే అబద్ధాలను కూడా నిజమనే భావిస్తుంటాం. అయితే నూటికి పదిసార్లు ఆలోచిస్తే తప్పించి, ఇలాంటి విషయంలో తుది నిర్ణయానికి రాకూడదు సుమా.

అలాగే మీకు నచ్చే కొన్ని విషయాలు మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు. అలాగే మీ భాగస్వామికి నచ్చే అనేక విషయాలు మీకు నచ్చకపోవచ్చు. ఈ విషయంలో కూడా మీరు ఏదో ఊహించి మీ భాగస్వామిని తప్పుబడితే పరిస్థితులే తలకిందులవుతాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం మనసు విప్పి మాట్లాడి విషయం తెలుసుకోవడమే.

అలాంటి ఉదాహరణలలో కొన్ని మీకోసం

1. ఇద్దరిదీ ఒకటే దారి అనుకోవద్దు

మీరు మీకున్న ఆసక్తులను సాధ్యమైనంత వరకు మీ భాగస్వామిపై రుద్దకపోవడం మంచిది. మీకు ఇష్టమైన సంగీతమే తనకూ ఇష్టముండాలని లేదు. తన ప్రాధాన్యత మరేదైనా కావచ్చు. అలాంటప్పుడు, ఇద్దరూ పరస్పరం

తమ తమ ఆసక్తులను గౌరవించుకుంటూ ముందుకు సాగాల్సిందే.

         

 

2. పోలిక వద్దు..!

మీరు విడాకులు తీసుకొని మరో వివాహం చేసుకొని ఉండవచ్చు. అలాంటప్పుడు సాధ్యమైనంత వరకు గత

విషయాలను, ప్రస్తుత విషయాలతో పోల్చి చూసుకోకపోవడం మంచిది. నూతన జీవితాన్ని ఆనందంగా గడపడానికే ప్రాధాన్యమివ్వాలి.

3. ఈర్ష్యా, ద్వేషాలు అసలే వద్దు..!

ముఖ్యంగా అనుమాన పిశాచిని మన దరి చేరనివ్వకుండా చూసుకోవాలి. మీ భాగస్వామి మీతో కాకుండా మరెవరితోనైనా సన్నిహితంగా ఉంటే అన్యధా భావించడానికి బదులు.. అసలు విషయం తెలుసుకోవడానికి

ప్రయత్నించండి. మీ భాగస్వామిపై మీకు నమ్మకం లేకపోతే.. మీపై కూడా మీకు నమ్మకం లేనట్లే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

4. మీకోసం సమయం కేటాయించలేదని బాధపడవద్దు

ఆఫీసు పనిలో లేదా బిజినెస్ పనిలో బిజీగా ఉండి.. మీకోసం సమయం కేటాయించలేనంత మాత్రాన.. మీ భాగస్వామికి మీపై ప్రేమ లేదని భావించవద్దు. అలాంటి విషయాలకు మీ మనసులో చోటు కల్పించవద్దు. మీ సహనమే మీ భాగస్వామిలో ఆత్మస్థైర్యం పెంచుతుందనే విషయాన్ని నమ్మండి.

5. మళ్లీ మనసును నొప్పిస్తారని అనుకోవద్దు

మీకు మీ భాగస్వామికి గతంలో గొడవ జరిగిన సమయంలో తను మీ మనసును గాయపరిచిన మాటలు మాట్లాడి ఉండవచ్చు. కానీ.. తను ఎప్పుడూ అలాగే ప్రవర్తిస్తారని మీరు ఒక నిర్ణయానికి వచ్చేయవద్దు. కోపం

క్షణికమనే విషయాన్ని నమ్మండి.

6. గతం మళ్లీ పునరావృతం అవుతుందని అనుకోవద్దు

మీ భాగస్వామికి ఒక గతం అనేది ఉండవచ్చు. ఆ గతంలో తనకు కొందరితో పరిచయాలు కూడా కలిగి ఉండవచ్చు. అందులో కొన్ని రిలేషన్ షిప్ వరకు కూడా వెళ్లి ఉండవచ్చు. కానీ పెళ్లి తర్వాత కూడా ఆ బంధాలు కొనసాగుతాయని నమ్మి మీ మనసు పాడుచేసుకోవద్దు. పాజిటివ్ సంకల్పం కలిగుంటేనే ప్రేమాభిమానాలు నిలుస్తాయని నమ్మండి.

7.మీ మనసు చదువుతారని అనుకోవద్దు

మీ మనసులోని విషయాలన్నీ మీరు చెప్పకుండానే మీ భాగస్వామికి తెలిసిపోతున్నాయని మీరు అనుకోవద్దు. నిజం చెప్పాలంటే.. మీ మనసులో ఏముందనేది మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కనుక, ఈ అపోహను వీడండి.

8. తనను కట్టడి చేయవద్దు

ప్రతీ వ్యక్తికి కూడా వ్యక్తిగతమైన నెట్ వర్క్ అనేది ఒక ఉంటుంది. ప్రతీ నెలకు ఒకసారి తన పాత మిత్రులతో కలిసి పార్టీ చేసుకోవాలనో లేదా తనకు నచ్చిన మీటింగ్‌కు అటెండ్ అవ్వాలనో అనుకోవచ్చు. అలాంటప్పుడు ఈ విషయాలను అప్రధానమైన వాటిగా మీరు పరిగణించవద్దు. వారు అలా వెళ్లడం వల్ల మీకు కేటాయించాల్సిన సమయం తగ్గిపోతుందని అనుకోవద్దు. తనను ఆపాలని చూడవద్దు. అలా చేస్తే తన మనసును నొప్పించే వారవుతారు.

9. మిమ్మల్ని పట్టించుకోవడం లేదని అనుకోవద్దు.

మీ భాగస్వామి కాస్త ముభావంగా ఉన్నా లేదా సరిగ్గా మాట్లాడకపోయినా.. తను మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారని ఒక నిర్ణయానికి వచ్చేయవద్దు. నెమ్మదిగా దగ్గరకు తీసుకొని మాట్లాడి, తన మనసులో ఏముందో

తెలుసుకోవడమే దీనికి పరిష్కారం.

10. మోసం చేస్తారని భావించవద్దు

ఇంత కాలం తనతో కలిసి జీవించి.. ఈ ఆలోచన మీకు రావడం ఏమిటి.? చాలా బాధాకరమైన ఆలోచన ఇది. కలలో కూడా ఈ భావనను స్ఫురణకు రానీయద్దు.


         

11. మీపై ఆసక్తిని కోల్పోయారని అనుకోవద్దు

ఇలాంటి ఆలోచన మీకు వస్తే నిర్భయంగా, ధైర్యంగా మీ భాగస్వామిని అడిగేయండి. మొహమాటం పడాల్సిన అవసరమే లేదు. అంతే గానీ.. మీ మనసు పాడుచేసుకొని దిగులు చెందవద్దు.

సహనమే ఏ సమస్యకైనా పరిష్కారం చూపిస్తుంది. మీ భాగస్వామి విషయంలో ఎలాంటి అనుమానం వచ్చినా.. కాస్త సంయమనం పాటించి నిదానంగా దానిని డీల్ చేయాలి. అప్పుడే మీ మనసుకు సాంత్వన చేకూరుతుంది. అంతేగానీ.. తొందరపాటు వల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ.

నిజమేనండీ బాబు.. నమ్మరా.. అయితే ఇక పై ఈ ఆలోచనలకు స్వస్తి పలికి చూడండి. కచ్చితంగా మీ జీవితం

నందనవనంగా మారిపోతుంది. ఆ తర్వాత మీరే నాకు థ్యాంక్స్ చెబుతారు.

 

 

Read More From Lifestyle