Fashion

అలనాటి తారల నుంచి.. మనం నేర్చుకోవాల్సిన బ్యూటీ పాఠాలు ఇవే…!

Lakshmi Sudha  |  Feb 15, 2019
అలనాటి తారల నుంచి.. మనం నేర్చుకోవాల్సిన బ్యూటీ పాఠాలు ఇవే…!

ఆనాటి హీరోయిన్లు (old film actresses) చక్కటి శరీర లావణ్యంతో అందంగా మెరిసిపోయేవారు. వారి నటన సైతం మనసుని తాకేంతగా ఉండేది. అందుకే ఇప్పటికీ వారు ఎవర్ గ్రీన్ తారలుగా కొనసాగుతున్నారు. నటన విషయంలోనే కాదు. ఫ్యాషన్, మేకప్ వంటి విషయాల్లోనూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సౌందర్యపరంగా వారి దగ్గర నుంచి మనం ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి? ఎలాంటి ఫ్యాషన్లు ఫాలో అవ్వాలి? మొదలైన విషయాలు తెలుసుకొందాం.

కాటుక:

అలనాటి తారల కళ్లు విశాలంగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి కదా.. ఇప్పటిలాగా అప్పుడు ఐలైనర్ లేదు. ఐషాడో లేదు. అయినా వారి కళ్లు ఎంత అందంగా ఉండేవి. కేవలం కాటుకతోనే వారి కళ్లు అంత అందంగా మెరిసిపోయేవి. ఇప్పుడు మనం వింగ్డ్ ఐ లైనర్ అంటున్నామే.. ఆరోజుల్లోనే వారు అలా కళ్లను తీర్చిదిద్దుకొనేవారు. కావాలంటే సావిత్రి, అంజలీదేవి, జమున లాంటి అలనాటి తారల కళ్లను చూడండి మీకే తెలుస్తుంది.

బొట్టు

బొట్టు పెట్టుకోవడం ఓ కళ. పాత సినిమాల హీరోయిన్లను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. వారు పెట్టుకొనే బొట్టు చాలా నీట్ గా, అందంగా కనిపిస్తుంది. ఇప్పటిలా రంగుల బొట్టులు లేకపోయినా.. ఉన్న వాటితోనే అందంగా తీర్చిదిద్దేవారు. ఆ కాలంలోనూ స్టిక్కర్లున్నా.. ఇప్పుడున్నన్ని రకాలుండేవి కావు. ఉన్నవాటితోనే చాలా అందంగా మెరిసిపోయేవారు. అందమైన స్టిక్కర్ల విషయంలో జమున, వాణిశ్రీ మిగిలినవారి కంటే ఓ అడుగు ముందుంటారు.

హెయిర్ స్టైల్

రకరకాల హెయిర్ స్టైల్స్ చూడాలంటే.. పాత సినిమాలే చూడాలి. అప్పటి హీరోయిన్లకు పెద్ద పెద్ద జడలుండేవి. కాబట్టి రకరకాలుగా జడలు వేసుకొనేవారు. ఈతపాయల జడలు, రెండు జడలు, నాలుగు జడలు వేసుకొనేవారు. అవి చాలా స్టైలిష్ గా ఉండేవి. అసలు ముడి అంటే ముందు మనకు గుర్తొచ్చే పేరు వాణిశ్రీ. అసలు ఆవిడ పాటించిన హెయిర్ స్టైల్స్ అన్నీ ఎవర్ గ్రీన్ అనే చెప్పుకోవాలి.

యాక్సెసరీస్

ఆనాటి చిత్రాల్లో హీరోయిన్లు వాడే నగలు, హ్యాండ్ బ్యాగులను చూస్తే చాలా ట్రెండీగా కనిపిస్తాయి. అలాగే చాలా క్యూట్‌గా కూడా ఉన్నాయనిపిస్తాయి. అసలు ఏ చీరకు ఎలాంటి నగలు వేసుకోవాలి? ఎలాంటి  చెవిపోగులు పెట్టుకోవాలి? అని తెలుసుకోవాలంటే పాతసినిమాలు చూస్తే సరిపోతుంది.

డ్రస్సింగ్ స్టైల్

పాత సినిమాల్లో హీరోయిన్లను చూడండి.. వాళ్ల చీరలు, లంగా ఓణీలు, పంజాబీ డ్రస్సులు ఎంత బాగుంటాయో. నెట్ చీరలు, పోల్కాడాట్ చీరలు ఇలా.. ఈ తరంలో మనం ఫ్యాషన్ అనుకొంటున్నవన్నీ.. వారు ఆరోజుల్లోనే కట్టుకొన్నారు. వారు ధరించే బ్లౌజ్‌లు సైతం చాలా మోడ్రన్‌గా కనిపిస్తాయి. వీనెక్, యునెక్, కాలర్ నెక్ జాకెట్లతో అలనాటి హీరోయిన్లు హొయలు ఒలికించేవారు. వాటిని చూసినప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపించకమానదు.

ఇవి కూడా చదవండి

దేశాంతర వివాహాలు చేసుకున్న.. మన కథానాయికలు వీరే

బ్లాండ్ జుట్టుతో అనుష్క ఎలా ఉంటుందో మీకు తెలుసా

పెళ్లికి ముందే.. ఎమర్జెన్సీ కిట్ సిద్ధం చేసుకోవడం మర్చిపోవద్దు

 

 

Read More From Fashion