Acne

‘అందం’తో పాటు.. ఆరోగ్యాన్ని కూడా అందించే ‘కివి పండు’

Sandeep Thatla  |  Dec 3, 2019
‘అందం’తో పాటు.. ఆరోగ్యాన్ని కూడా అందించే ‘కివి పండు’

(Beauty and Health Benefits of Kiwi Fruit)

ఈ రోజులలో మార్కెట్‌లో పండ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనికి ప్రధాన కారణం జనాలకు ఆరోగ్యం పై శ్రద్ధ పెరగడం ఒకటైతే.. మరొకటి  పోషకాలనేవి ప్రాసెస్ ఫుడ్స్‌లో కన్నా కూడా..  సహజ సిద్ధమైన పండ్లు, కాయగూరలలో ఎక్కువగా లభించడమే. ఇక మన శరీరానికి కావాల్సింత ఎక్కువ పోషకాలను అందించే పండ్లలో  కివి కూడా ఒకటి.

ఈ కివి పండుని ‘చైనీస్ గూస్ బెర్రీ’ అని కూడా పిలుస్తుంటారు. దీనికి ప్రధాన కారణం.. ఈ పండ్లు ఆక్రోట్ ఫలం ఆకారంలో ఉండి గూస్ బెర్రీ రుచిని పోలి ఉంటాయి. 12వ శతాబ్దం నుండే ఈ పండ్లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇక ఎప్పుడైతే ఈ పండ్ల సాగు చైనా నుండి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలకు విస్తరించిందో.. అప్పుడు ‘కివి’ పేరుతో ఈ ఫలాలు పాపులర్ అయ్యాయి. అయితే ఇప్పటికీ కూడా చైనాలో ఈ పండ్ల సాగు బాగానే ఉంది.

 

రోజులో గంటల తరబడి కూర్చోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఇవే

కివి పండు గురించిన వాస్తవాలు (Fast Facts of Kiwi)

ప్రపంచంలోనే అత్యధికంగా కివి పండును సాగు చేసే దేశం చైనా. ప్రతియేట సుమారు 20 లక్షల టన్నుల పండ్లను అక్కడ నుండి దిగుమతి చేస్తుంటారు. 

100 గ్రాముల నారింజ పండులో.. కేవలం 53 మిల్లి గ్రాముల  ‘విటమిన్ సి’ ఉండగా.. అదే 100 గ్రాముల కివి పండులో సుమారు 64 మిల్లి గ్రాముల ‘విటమిన్ సి’ ఉంటుంది

కివి పండును ఎక్కువగా తినడం వల్ల.. కొంతమందిలో అలెర్జీ కూడా వస్తుంది. అయితే ఇది ఆరోగ్యపరంగా చేసే మేలు కూడా ఎక్కువే. 

కివి పండులో ఉండే పోషక విలువలు (Nutritional Values of Kiwi)

కివి పండులో పోషక విలువలు అపారంగా ఉంటాయి. ఆ కారణంగానే.. దీనిని ఆహారంలో భాగం చేసుకోమని వైద్యులు చెబుతుంటారు.

100 గ్రాముల కివి పండులో.. 61 క్యాలరీలు, 0.5 గ్రాముల కొవ్వు, 3 మిల్లి గ్రాముల సోడియం, 312 మిల్లి గ్రాముల పొటాషియం, 1.1 గ్రాముల ప్రోటీన్ & 15 గ్రాముల కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి.

అలాగే విటమిన్స్, మినరల్స్ విషయానికి వస్తే…

విటమిన్ A – 1%, క్యాల్షియం – 0.03, విటమిన్ సి – 1.54, ఐరన్ – 1%, విటమిన్ B6 – 5%, మెగ్నిషియం – 4% లు కివి పండులో లభిస్తాయి. అందుకనే ఎవరికైనా శరీరంలో విటమిన్లు, మినరల్స్ కొరత ఉంటే.. వారు కివి పండుని తమ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.

కివి పండు వల్ల ఉపయోగాలు (Uses of Kiwi)

కివి పండు వల్ల అనేక ఉపయోగాలున్నాయి

కివి పండు గుజ్జుని ఫేస్ మాస్క్‌ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు.

కేశ సంరక్షణకు కివి పండు గుజ్జును షాంపూలా వాడడం వల్ల.. జుట్టు రాలిపోవడం లేదా తెల్లగా మారిపోవడం లాంటి సమస్యలు దూరమవుతాయి.

రకరకాల ఆహార పదార్ధాల పై.. కివి పండుతో గార్నిష్ చేసుకోవచ్చు.

కివి పండుతో రకరకాలైన మిల్క్ షేక్స్ తయారు చేసుకోవచ్చు.

కివి పండును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల.. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు.. ఆస్తమా తీవ్రత కూడా తగ్గుతుంది.

కివి పండు వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు (10 Health Benefits of Kiwi)

కివి పండు వల్ల కలిగే 10 ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఇవే

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

కివి పండులో ఉండే పొటాషియం కారణంగా.. అనేక గుండె సమస్యలు దూరమవుతాయి. రోజుకి నాలుగు మిల్లీగ్రాముల పొటాషియం తీసుకునే వారు.. హృద్రోగ సమస్యల బారిన పడే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. 

రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది

అధిక రక్తపోటుతో బాధపడే వారు.. కివి పండుని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు మన రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. 

జీర్ణశక్తిని పెంచుతుంది

జీర్ణ సమస్యలతో బాధపడేవారికి.. కివి పండు చేసే మేలు చాలా ఎక్కువ. ఇది మన జీర్ణాశయాన్ని ఉత్తేజపరుస్తుంది. అలాగే ఆహారాన్ని బాగా అరిగేలా చేస్తుంది. కివి పండులో ఉండే యాక్టినిడిన్ అనే ఎంజైమ్.. మనిషిలో జీర్ణ శక్తిని పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

అనవసర టాక్సిన్స్‌ని అదుపు చేయగలగడం

మానవ శరీరం అనేక టాక్సిన్లకి నిలయం. అయితే వీటి శాతం ఎక్కువైతే.. మన శరీరం అనేక ఇబ్బందులను కచ్చితంగా ఎదుర్కొంటుంది. మన శరీరంలో ఉండే అనవసరపు టాక్సిన్లని అరికట్టాలంటే.. కివి పండును ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. 

కంటికి ఎంతో మేలు

కంటి సమస్యలు తీవ్రమవుతున్న వేళ… వాటిని అధిగమించడానికి ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందులో భాగంగానే కివి పండును కూడా తినడం మంచిది. కివి పండులోని యాంటీ ఆక్సిడెంట్లు.. మన కంటి టిష్యూలు, కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.  

ఎముకలలో తలెత్తే సమస్యలని నివారించడం

వివిధ రకాల ఎముకల సమస్యలను.. కివి పండులోని విటమిన్ కె, కాల్షియమ్‌లు అదుపు చేయగలుగుతాయి. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగి ఎముకలు చిట్లినప్పుడు.. ఈ పండును ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా ఉపశమనం పొందే అవకాశం ఉంది.

మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు

సాధారణంగా పండ్లను ఆహారంగా తీసుకుంటే.. అందులోని చక్కెర శాతం మనిషి శరీరంలో ఉండే మధుమేహాన్ని ఇంకాస్త పెంచుతుంది. అయితే కివి పండులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ వేరేవాటితో పోల్చితే తక్కువ స్థాయిలో ఉండడం వలన.. రక్తంలోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. ఇక ఈ  పండులో ఉండే నీటి శాతం కూడా.. మధుమేహంతో బాధపడేవారు తీసుకునే డైట్‌కి సరిపోయేవిధంగా ఉంటుంది. పైగా ఈ  పండులో కేవలం 11 గ్రాముల కార్బ్స్ మాత్రమే ఉంటాయి. వేరే పండ్లలో ఈ శాతం ఎక్కువగా ఉంటుంది.

స్కిన్ క్యాన్సర్‌తో పోరాడుతుంది

స్కిన్ క్యాన్సర్‌కి కివి పండుని కూడా ఒక చికిత్సగా పరిగణిస్తున్నారు.  కివి పండుని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చర్మ రుగ్మతలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. కివి పండులో లభించే విటమిన్ సి కారణంగా.. అవి శరీరంలో చర్మాన్ని  ఇబ్బంది పెట్టె సెల్స్‌‌తో పోరాడతాయి.

బరువు తగ్గడానికి ఎంతో మేలు

ఈరోజుల్లో బరువు తగ్గడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో భాగంగానే కివి పండును కూడా మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.  కివి పండులో లభించే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, హై ఫైబర్ కంటెంట్ మొదలైనవి మన శరీరంలో కొవ్వుని పేరుకుపోకుండా చేస్తాయి. దీని ద్వారా మన శరీరం అధిక బరువు పెరగకుండా ఉంటుంది.

శరీరంలో ఆమ్లస్థాయిలని నియంత్రణలో పెట్టడం

కివి పండులో ఉండే అధికశాతం మినరల్స్.. మన శరీరంలో ఎసిడిక్ ఆహారాన్ని నియంత్రణలో పెట్టడం జరుగుతుంది. దీని వల్ల ఆమ్ల స్థాయిలు సరిగ్గా ఉంటాయి.

 

బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ & వాటి వల్ల కలిగే ప్రయోజనాలు..!

ప్రతిరోజు కివి పండు ఎందుకు తినాలో తెలిపే 10 కారణాలు (10 reasons why you need to have kiwi everyday)

ప్రతిరోజు కివి పండును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలివే

విటమిన్ సి

కివి పండులో లభించే అనేక పోషకాలలో విటమిన్ సి కూడా ఒకటి.   ‘విటమిన్ సి’ ఎక్కువ మోతాదులో లభించే పండుగా కూడా దీనికి పేరుంది.

హృద్రోగ సమస్యలు రాకుండా ఉంటాయి

కివి పండును రోజు తినడం వల్ల కలిగే లాభాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే ఈ పండు తినడం వల్ల మన శరీరంలో కొవ్వు శాతం అదుపులో ఉంటుంది. తద్వారా గుండె సంబంధిత రుగ్మతలు రాకుండా ఉంటాయి.

ఆస్తమా ఉన్న వారు ఇది తప్పకుండా తీసుకోవాలి

ఆస్తమాతో బాధపడే వ్యక్తులు ఊపిరితిత్తుల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు గనుక.. ఈ కివి పండుని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. 

రక్తం గడ్డ కట్టడాన్ని అరికడుతుంది

కివి పండును తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతే  కాకుండా రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు దోహదపడుతుంది. అందుకే చాలా మంది వైద్యులు.. రోగులకు కివి పండును సూచిస్తుంటారు. 

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే.. అది అంతే బలంగా మన శారీరక రుగ్మతలతో పోరాడుతుంది. కివి పండుని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల.. అందులోని రోగ నిరోధక గుణాలు మన శరీరానికి అంతే మేలు చేస్తాయి. 

నాన్ – ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్‌కి చికిత్సగా

ఆల్కాహాల్ వలన మాత్రమే కాకుండా.. హై లెవల్ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగే రుగ్మతలలో ఒకటే ఫ్యాటీ లివర్. దీనికి  చికిత్సగా కూడా కివి పండుని పరిగణిస్తారు. ఎందుకంటే ఈ కివి పండులో ఉండే లక్షణాలు శరీరంలోని కొవ్వుని కరిగిస్తాయి. అలాగే నాన్ – ఆల్కాహాలిక్ ఫ్యాటి లివర్‌కి చికిత్సగా కూడా దీనిని పరిగణిస్తారు.

ఆరోగ్యకరమైన నిద్ర కోసం…

ఒక సర్వే ప్రకారం.. నిద్రకు ఉపక్రమించే సమయానికి రెండు గంటల ముందు కివి పండు తిన్నవారితో పోలిస్తే… పడుకొనే ముందు ఈ పండుని భుజించినవారు నిద్రలేమికి గురైన అవకాశాలు తక్కువని తేలింది. ఈ కారణం చేత, నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ కివి పండుని ఒకసారి ట్రై చేయవచ్చు.

ఆరోగ్యకరమైన చర్మం కోసం…

చర్మ రుగ్మతలు లేదా క్యాన్సర్ వంటివి రాకుండా ఈ కివి పండు కాపాడుతుంది. అదే కాకుండా ముఖ వర్చస్సు కోసం.. కివి పండుతో చేసిన ఫేస్ ప్యాక్ ట్రై చేయవచ్చు.

కంటి సంరక్షణ కోసం…

ఈ కివి పండును రోజు తినడం వల్ల… మన కళ్ళకు ఇబ్బందిని కలిగించే రకరకాల కెమికల్ రియాక్షన్స్ తగ్గుముఖం పడతాయి. 

శరీరంలో చక్కర శాతాన్ని అదుపులో …

ఈ కివి పండులో ఉండే అతి తక్కువ శాతం గ్లైకేమియా ఇండెక్స్ కారణంగా.. రక్తంలో ఉండే చక్కర శాతం అదుపులో ఉంటుంది. ఒకరకంగా మధుమేహం కూడా అదుపులోనే ఉంటుంది.

చర్మ సౌందర్యానికి ఉపయోగపడే కివి పండు (Kiwi for Skin Care)

కివి పండుతో చేసిన ఉత్పత్తులు లేదా ఫేస్ ప్యాక్‌ల ద్వారా.. చర్మ సంరక్షణను పెంపొందించుకుంటూ.. అదే సమయంలో చర్మ రుగ్మతల నుండి ఎలా బయటపడవచ్చో.. ఈ  అయిదు సూత్రాల ద్వారా తెలుసుకుందాం.

కళ్ళ క్రింద ఏర్పడే.. నల్లటి వలయాలను తగ్గించడం

కివి పండు గుజ్జుని మన కళ్ళ చుట్టూ రాసుకోవడం వల్ల.. వాటి క్రింద ఏర్పడే నల్లటి వలయాలు తొలిగిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

దురదలను తగ్గించడం

చర్మం లేదా ముఖం పైన ఏర్పడే దురదలను నివారించే శక్తి ఈ కివి పండుకి ఉంది. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల దురదలు తగ్గముఖం పడతాయి.

చర్మం పొడిబారకుండా.. అలాగే ముసలితనపు ఛాయలు త్వరగా రాకుండా చేస్తాయి

కివి పండులో లభించే రకరకాల విటమిన్లు, మినరల్స్ వలన చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే  ముడతలు కూడా తగ్గుముఖం పడతాయి,

ముఖం పై.. క్లీన్సర్‌లా పనిచేస్తుంది

కివి పండులో లభించే ‘విటమిన్ సి’ మన ముఖం పై ఏర్పడే మురికితో పాటు..  అపరిశుభ్రమైన పదార్దాలను కూడా తుడిచివేస్తుంది. అలాగే కివి పండు గుజ్జును మన ముఖానికి పట్టిస్తే.. చర్మం కాంతిమంతంగా మారుతుంది. 

స్కిన్ క్యాన్సర్‌తో కూడా పోరాడుతుంది

స్కిన్ క్యాన్సర్ మొదలైన చర్మ రుగ్మతల నివారణకు.. కివి పండులో ఉండే ‘విటమిన్ సి’ ఎంతగానో తోడ్పడుతుంది. 

కివి పండుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి (How to make Facepack with Kiwi?)

కివి పండుతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడం ఎలా?

కివి పండు & పెరుగు

బాగా పండిన కివి పండు గుజ్జుని.. ఒక కప్పు పెరుగుతో మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖం, మెడ ప్రాంతాల్లో రాసుకుని.. ఒక 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మీ చర్మం సున్నితంగా మారిపోతుంది.

కివి పండు & తేనె

కివి పండుని ముక్కలుగా కోశాక.. ఆ ముక్కలలోని గుజ్జుని ఒక కప్పులోకి తీసుకోవాలి. ఆ కప్పులో తేనెను పోశాక.. ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. తేనె, కివి పండు మిక్స్ చేసిన మిశ్రమాన్ని.. ముఖానికి రుద్దుకోవడం వల్ల.. మన ముఖ చర్మంలో సున్నితత్వంతో పాటు.. మెరుపుని కూడా చూడవచ్చు.

కివి పండు & అరటిపండు

సగం అరటిపండుతో పాటు..  కివి పండు గుజ్జుని సమపాళ్లలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ  మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ తేనె కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్యాక్‌ని ముఖంతో పాటు.. మెడ పైన రాసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

మధుమేహం అంటే ఎందుకు భయం..? ఈ సలహాలు మీకోసమే ..!

కివి పండు గురించి తెలుసుకోవాల్సిన అయిదు ప్రశ్నలు (FAQ)

కివి పండు గురించి సాధారణంగా మనం తెలుసుకోవాలనుకునే ప్రశ్నలు & వాటి సమాధానాలు

1. కివి పండు తీసుకోవడం వల్ల.. డెంగ్యూ జ్వరం తగ్గుతుందా?

ఒక్క కివి పండును తినడం వల్లే.. డెంగ్యూ ఫీవర్ తగ్గుతుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే డెంగ్యూ జ్వరానికి  చికిత్సను తీసుకుంటూనే.. ఈ కివి పండును ఆహారంలో భాగంగా కూడా తీసుకుంటే, శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంచేందుకు ఇది సహాయ పడుతుంది.

2. ఒక్క కివి పండు, ఆ రోజు మొత్తానికి.. మీకు కావాల్సిన ‘సీ విటమిన్’ని అందించగలదా?

అవును నిజమే. ఒక నారింజ పండులో కన్నా.. చాలా ఎక్కువ ‘విటమిన్ సి’ మనకి కివి పండులో లభిస్తుంది.

3. కివి పండు తింటే, మీ కంటి చూపు మెరుగవుతుందా?

కివి పండును తినడం వల్ల కలిగే ఉపయోగాల్లో ఇది కూడా ఒకటి. కివి పండును మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల.. మన కళ్ళను ప్రభావితం చేసే రుగ్మతలను ఇది కట్టడి చేస్తుంది. ఈ  పండులో లభించే విటమిన్లు & మినరల్స్ దీనికి ఎంతగానో దోహదపడతాయి. 

4. కివి ఆధారిత ఫేస్ ప్యాక్‌ను ఉపయోగిస్తే.. మీ ముఖం చర్మం మెరుస్తుందా?

కివి పండులో లభించే కొన్ని విటమిన్లు.. మన ముఖం పై పేరుకుపోయిన మలినాలతో పాటు.. రకరకాల బ్యాక్తీరియాలని నిర్మూలించడమే కాకుండా.. మన చర్మం మరింత కాంతివంతంగా మారేందుకు దోహదపడతాయి.

5. కివి పండు తింటే బరువు తగ్గుతారా?

కివి పండును తినడం వల్ల.. మన శరీరంలో ఏర్పడే కొవ్వు కరుగుతుంది. ఈ క్రమంలో అది మన శరీర ఆకారం పై కూడా ప్రభావం చూపుతుంది. 

Read More From Acne