Food & Nightlife

వర్షాకాలంలో అందరూ ఎక్కువగా ఇష్టపడి తినే.. 8 రకాల స్న్యాక్ ఐటమ్స్ ఇవే

Sandeep Thatla  |  Jul 8, 2019
వర్షాకాలంలో అందరూ ఎక్కువగా ఇష్టపడి తినే.. 8 రకాల స్న్యాక్ ఐటమ్స్ ఇవే

Snacks in Rainy Season

వేసవికాలంలో సూర్యుడి ప్రతాపానికి నీరసించిపోయిన ప్రజానీకానికి ఊపిరి అందించే కాలం వర్షా కాలం. దాదాపు 50 డిగ్రీల వేడి నుండి ఒక్కసారిగా చల్లబడిపోయే వాతావరణం మనకి వర్షాకాలంలో కనిపిస్తుంది. ఇక అటువంటి చల్లటి వాతావరణంలో చినుకులు పడుతున్న వేళ మనకి ఎటువంటి పదార్ధాలు తినాలనిపిస్తుందో తెెలుసా.. మరీ ముఖ్యంగా చిరుతిళ్ళు వైపుకి మన మనస్సు లాగుతుంది.

ఆహా.. ఏమి రుచి..! ఈతరం యువతను.. అమితంగా ఆకర్షిస్తున్న కర్రీ పాయింట్స్

అలా మాన్సూన్ సీజన్.. అదే వర్షాకాలంలో ఎక్కువ మంది ప్రజానీకం ఇష్టపడే స్న్యాక్ ఐటమ్స్ దాదాపు స్పైసీగా ఉంటుంటాయి. అలా స్పైసీగా ఉండే స్న్యాక్ ఐటమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం

స్న్యాక్ ఐటమ్స్ –

ఈ క్రింద చెప్పబోయే స్నాక్ ఐటమ్స్ మనకి బాగా తెలిసినవే! అయితే మరోసారి వాటి గురించి ఒక చిన్నపాటి వివరణ.

* మిర్చి

దాదాపుగా ఈ మిర్చి బజ్జి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో! ఎందుకంటే చిన్న తోపుడు బండి నుండి మొదలుపెట్టి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ వరకూ ఈ మిర్చి లభిస్తుంది. పైగా ఇది ఇళ్ళలో సైతం సొంతంగా చేసుకోవడానికి వీలుపడే పదార్థం. శనగపిండి మరియు మిరపకాయతో చేసే ఈ పదార్ధం ఇష్టపడని వారు బహు తక్కువమంది ఉంటారు.

Mirchi Bajji

* ఆలు బజ్జి

మిర్చి బజ్జి ఎలాగైతే చేసుకుంటామో.. దాదాపు అదే పద్దతిలో మనం ఆలు బజ్జి కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఐటమ్‌లో మిరపకాయకి బదులు ఆలుగడ్డని వాడుతాము. ఈ పదార్ధంలో కూడా శనగపిండిని వాడి.. ఈ ఆలు బజ్జిని చేయడం జరుగుతుంది.

Alu Bajji

* సమోసా

ఇక మనం దాదాపు కాలాలతో సంబంధం లేకుండా తినే స్నాక్ ఐటం – సమోసా. అయితే ఈ సమోసా ఒకప్పుడు కేవలం ఆలు స్టఫ్‌తో లభించేది, కాని ప్రస్తుతం – కార్న్ సమోసా, ఆనియన్ సమోసా, చికెన్ సమోసా, మటన్ సమోసా అంటూ పలు రకాల సమోసాలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఢిల్లీలోని ఒక రెస్టారెంట్‌లో అయితే ఏకంగా 35 రకాల సమోసాలు లభిస్తున్నాయంటే ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి. ఇక ఈ సమోసా చేయడానికి కావాల్సిన అతి ముఖ్యమైన పదార్ధం మైదా పిండి.

మరో సరికొత్త రికార్డు సాధించిన.. హైదరాబాద్ ప్యార‌డైజ్ బిర్యానీ

Samosa

* పకోడీ

పకోడీ గురించి తెలియనివారెవ్వరు చెప్పండి. అదే సమయంలో ఆనియన్ పకోడిగా మొదలైన ఈ స్న్యాక్ ఐటం తరువాత కాలంలో చికెన్ పకోడీ, వెజిటేబుల్ మిక్స్ పకోడీ & ప్రస్తుతం మ్యాగీ పకోడీ అంటూ కొత్త పద్ధతులలో రూపొంది.. పెద్ద ఎత్తున్న ఫుడ్ లవర్స్‌ని ఆకర్షిస్తోంది. అయితే మ్యాగీ పకోడి ఎలా చేయాలంటే – మ్యాగీని యధాతధంగా చేసుకున్న తరువాత.. దానిలో సన్నగా తరిగిన ఉల్లిగడలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం & ఉప్పు వేసుకోవాలి. వీటితో పాటు శనగపిండి కూడా ఆ మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దానిని ముద్దలు ముద్దలుగా చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకొవాలి. అంతే… మ్యాగీ పకోడీ సిద్దమైపోతుంది.

Pakodi

* కార్న్

మొక్కజొన్న కండెలని మనం చాలా ఇష్టపడుతుంటాం. అదే సమయంలో వాటిని గింజెలని ఒలిచి.. గ్రైండ్ చేసి వాటితో గారెలు చేసుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు స్వీట్ కార్న్ పేరుతో ప్రత్యేకంగా సాగు చేసినవి మార్కెట్‌లో లభిస్తుండడంతో వాటిని ఉడకబెట్టి ఆ గింజెలకి ఉప్పు, కారం & నిమ్మకాయ రసం అద్దుకుని తినడం ఇప్పుడు కొత్త ట్రెండ్. రోడ్డు పైన ఎక్కడ చూసినా సరే మనకి ఈ స్వీట్ కార్న్ దొరుకుతుంది.

Corn

* పల్లీలు

మన చిన్నతనం నుండి ఇంటిదగ్గర లేదా రోడ్డు & రైలు మార్గాల ద్వారా ప్రయాణం చేసేటప్పుడు.. కాలక్షేపానికి సైతం తీసుకునే స్న్యాక్ ఐటెంగా పల్లీలని చూస్తుంటాము. ఇక ఈ పల్లీలని రకరకాలుగా తమ చిరుతిండిగా తీసుకుంటుంటారు. ఉదాహరణకి మసాలా పల్లి, సాల్ట్ పల్లి… ఇలాగన్న మాట.

Masala Peanuts

* బ్రెడ్ పకోడీ

ఒకప్పుడు బ్రెడ్‌ని స్న్యాక్ ఐటంగా చూస్తే… ఇప్పుడు మాత్రం దానిని వుపయోగించి రకరకాలైన స్న్యాక్ ఐటమ్స్‌ని చేస్తున్నారు. అందులో ఒకటి – బ్రెడ్ పకోడి. ఇక ఈ బ్రెడ్ పకోడీని చేయడానికి బాగా ఉడకబెట్టిన ఆలుగడ్డలని ముద్దగా చేసుకుని అందులోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, వంటివి వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఆ స్టఫ్‌ని రెండు బ్రెడ్ పీసెస్ మధ్యన పెట్టి.. సదరు బ్రేడ్ పీసెస్‌ని అంతకుముందే కలుపుకున్న శనగపిండిలో ముంచి ఆయిల్‌‌లో ఫ్రై చేసుకోవాలి. అంతే… నోరూరించే బ్రెడ్ పకోడీ సిద్ధమైపోతుంది. 

Bread Pakoda

* ముంత మసాల

ఈ ముంత మసాలను సాయంకాలం స్నాక్ క్రింద చాలామంది తీసుకుంటుంటారు. ఈ ముంత మసాల .. ఎగ్ బజ్జి మసాలా, మిర్చి బజ్జి మసాలా, ఆలు బజ్జి మసాలా, టమాటా బజ్జి మసాలా పేరిట అనేక రకాలుగా ఇది మనకి లభిస్తుంది. మనకి కావాల్సిన బజ్జిని తీసుకుని దానిని సగానికి కోసి… ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, కారం, కార్న్, కాస్త నిమ్మకాయి రసం వేసి బాగా కలుపుకున్న తరువాత.. ఆ మిశ్రమానికి కాసింత వేయించిన పల్లీలు వేసేస్తే రుచికరమైన ముంత మసాలా సిద్దమైపోతుంది.

Muntha Masala

ఈ ఎనిమిది వంటకాలే కాకుండా మరికొన్ని స్న్యాక్ ఐటమ్స్ – పునుగులు, మినప గారెలు వంటివి కూడా వర్షాకాలంలో ఫుడ్ లవర్స్‌కి ఇష్టమైన మెనులో ఉంటుంటాయి.

 

హైదరాబాద్ కి షాన్.. “ఉస్మానియా బిస్కెట్స్” చరిత్ర మీకోసం…!

Read More From Food & Nightlife